సహాయం:వికీ మార్కప్తో మూలాలివ్వడం గురించి పరిచయం/3
నిర్ధారత్వం
ఇన్లైన్ ఉల్లేఖన
రెఫ్టూల్బార్
విశ్వసనీయ వనరులు
సారాంశం
|
మూలాలను మానవికంగా ఉల్లేఖించడం కొంచెం ఇబ్బందిగా ఉండే, సమయం తీసుకునే వ్యవహారం. అదృష్టవశాత్తూ దానికీ పరికరం ఉంది. "RefToolbar" అనే ఈ పరికరాన్ని వికీపీడియా దిద్దుబాటు పెట్టెలో అమర్చి పెట్టారు. దాని సాయంతో మూలాలను తేలిగ్గా చేర్చవచ్చు.
ఆటోమాటిక్ పద్ధతి అత్యంత సులభమైనది. మీరు కేవలం వెబ్సైటు URL ఇచ్చి, "తయారు చెయ్యి" నొక్కితే వికీపీడియా ఆటోమాటిగ్గా ఉల్లేఖనను తయారుచేస్తుంది. అది తయారుచేసిన ఉల్లేఖనను ఒకసారి చూడండి. బాగానే ఉంటే "చొప్పించు" నొక్కండి. ఆ తరువాత మీరు, "మార్చు" నొక్కి అవసరమైన చోట్ల, ప్రచురణ తేదీ వంటి వివరాలను మార్చుకోవచ్చు, .
మూలం గురించిన సమాచారాన్ని మానవీయంగా నమోదు చేయడానికి, డైలాగ్ బాక్స్ లోని "మానవికంగా" ట్యాబును నొక్కండి. అక్కడ మీరు ఏ రకమైన మూలాన్ని జోడించాలనుకుంటున్నారో ఎంచుకోండి. వీలైనన్ని ఫీల్డ్లను ("పారామితులు") పూరించండి. (గమనిక: తేదీలు YYYY-MM-DD రూపంలో ఉండాలి).
మీరు తిరిగి ఉపయోగించాలనుకుంటున్న మూలాన్ని వెతికేందుకు, జాబితాను స్క్రోల్ చేయండి. లేదా పైనున్న "ప్రస్తుతమున్న ఉల్లేఖనల్లో వెతకండి" పెట్టెను వాడండి. కావలసిన మూలంపై నొక్కితే అది వ్యాసంలో చొప్పించబడుతుంది. లేదా, వ్యాసంలోని మూలాన్ని కాపీచేసి అవసరమైన చోట అతికించవచ్చు. లేదా వేరే పేజీనుండి మూలాన్ని కాపీ చేసి తెచ్చి ఇక్కడ అతికించవచ్చు!
|