సాగర్ జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సాగర్ జిల్లా ఒకటి. సాగర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
Sagar జిల్లా
सागर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Sagar |
ముఖ్య పట్టణం | Sagar, Madhya Pradesh |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Sagar |
విస్తీర్ణం | |
• మొత్తం | 10,252 కి.మీ2 (3,958 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 23,78,295 |
• జనసాంద్రత | 230/కి.మీ2 (600/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 77.52% |
• లింగ నిష్పత్తి | 896 |
Website | అధికారిక జాలస్థలి |
సరిహద్దులు
మార్చుజిల్లా వైశాల్యం 10,252 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జనసంఖ్య 2,021,783 (1991 నుండి 23% జనసంఖ్య అభివృద్ధి చెందింది). 2001 గణాంకాల ప్రకారం జనసంఖ్య 1,646,198. సాగర్ జిల్లా సరిహద్దులలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లలిత్‌పూర్ జిల్లా,ఈశాన్య సరిహద్దులలో చత్తర్‌పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులలో దామోహ్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో నరసింగ్‌పూర్ జిల్లా, నైరుతీ సరిహద్దులలో రాయ్‌సెన్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో విదిశ జిల్లా, వాయవ్య సరిహద్దులో అశోక్‌నగర్ జిల్లా ఉన్నాయి. జిల్లాలో యాదవులు అధికంగా ఉన్నారు.[1]
As of 2011 it is the third most populous district of Madhya Pradesh (out of 50), after Indore and Jabalpur.[2]
భౌగోళికం
మార్చుసాగర్ జిల్లా చదరమైన మైదానభ్హుమిగా అక్కడక్కడా చిన్నచిన్న కొండలతో విభజించబడి ఉంటుంది. ఇది వింధ్యపర్వతాలలో ఇసుకరాళ్ళతో కూడిన భాభాగంతో ఉంటుంది. జిల్లాలో నదులు, వాగులు, వంకలు, ఏర్లు ప్రవహిస్తున్నాయి. వీటిలో సునార్ నది, బియాస్ నది, ధాసన్ నది, బినా నది ప్రధానమైనవి. ఈ నదులన్నీ ఉత్తరదిశగా ప్రవహించి గంగానదిలో సంగమిస్తున్నాయి. జిల్లా దక్షుణ, మధ్యభాగంలో నల్లరేగడి మట్టి ఉంది. ఉత్తర, తూర్పు భూభాగంలో ఎరుపు, గోధుమ వర్ణమిశ్రితమైన సారవంతమైన మట్టితో కూడిన భూభాగం ఉంది. ఈశాన్య భూభాగంలో హిరాపూర్ గ్రామంలో నాణ్యమైన ఇనుము నిల్వలు ఉన్నాయి. జిల్లాలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. వీటిలో జిల్లా ఉత్తరంలో ఉన్న రామ్నా టేకు అభయారణ్యం విశాలమైనది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,378,295,[2] |
ఇది దాదాపు. | లాటివ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం..[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 188వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 132 .[2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.62%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 896:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 77.52%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
Culture
మార్చుPlaces of interest
మార్చుసంస్కృతి
మార్చుసాగర్ పట్టణానికి ఎరాన్ 75 కి.మీ దూరంలో ఉంది. ఎరాన్ బినా తాలూకాలో ఉంది. ఎరాన్ బినా నదీతీరంలో ఉంది. బినా నది బెత్వానదికి ఉపనదిగా ఉంది. ఎరాన్‌కు సహజసిద్ధమైన రక్షణ ఇస్తుంది. నాలుగవ వైపున చాల్కొతలిక్ పీరియడ్‌లో కోటగోడ, కందకం నిర్మించబడింది. మందిబమొర నుండి రహదారి మార్గంలో గొహర్, దంసురా గ్రామాల మీదుగా ఎరాన్ చేరుకోవచ్చు. బినా - భోపాల్ రైల్వేస్టేషనుకు మందిబమొర 12 కి.మీ దూరంలో ఉంది. ఖురై పట్టణం నుండి నిర్తల, సిల్గావ్, లహత్వా, ధంసర మీదుగా ఎరాన్ చేరుకోవచ్చు. ఎరాన్‌లో పురాతన నెయోలితిక్, చాల్‌కొలితిక్ సంస్కృతి కనిపిస్తుంది. మౌర్యులు, సుంగాలు, శాతవాహనులు, షకాలు, నాగాలు, గుప్తాలు, హూణులు, కల్చురీలు, పర్మరాలు వారి సంస్కృతి ఎరాన్ సంస్కృతిని ప్రభావితం చేసింది. గుప్తసామ్రాజ్యానికి చెందిన సముద్రగుప్తుడు ఎరాన్‌కు (సముద్రగుప్తుని స్వభోగ్ నగర్) విజయం చేసాడు.
ఆలయాలు
మార్చుసాగర్ జిల్లాలో బినా నది దక్షిణతీరంలో పలు ఆలయాలు ఉన్నాయి. విష్ణాలయం, వరాహ ఆలయం, నృసింహాలయం, గరుడ స్తంభం, ఇతర ఆర్కిటెక్చర్ ప్రాధాన్యత కలిగిన శిథిలాలయాలు ఉన్నాయి. ఆలయాల కుడ్యాలలో ఎరాన్ సంబంధిత సమాచారం విస్తాతంగా లభిస్తుంది. కుడ్యాలలో బుధగిప్తా, శక, పాలకుడు శ్రీధర్ వర్మ, హూణ, తోమర్, సముద్రగుప్తుడు, గోపరాజ్ సతి స్తంభాలు గురించిన సమాచారం ఉంది. ఎరాన్‌లో పలు సతి స్తంభాలు కనిపించాయి. ఎరాన్‌లో భారతీయ పురాతన సతి స్తంభం కనుగొనబడింది. 1874-1875 లో జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్‌హం దీనిని కనుగొన్నాడు.
శిలాశాసనాలు
మార్చుజిల్లాలోని శిలాశాసనాలు గుప్తుల కాలం (సా.శ. 510) [5] గుప్తరాజు భానుగుప్తా (గోపరాజ్) ఎరాన్‌కు వచ్చి యుద్ధం చేసి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య ఇక్కడ సతీసహగమనం చేసింది. ఎరాన్ వద్ద మధ్యయుగ ఆరంభం నుండి ఆధునిక కాలం వరకు స్థాపించిన పలు స్తంభాలు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని నాశనం చేయబడినప్పటికీ 10 స్తంభాలు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. ఈ స్తంభాలలో చెక్కబడిన వ్రాతలు ఎరాన్ గురించిన పలు విషయాలు వివరిస్తున్నాయి. ఆకాలం నాటి స్త్రీల పరిస్థితి ఇందులో విశదంగా తెలుస్తుంది. సతిసహగమన ప్రక్రియలో దైవప్రార్థనలు నిర్వహించారని ఈవ్రాతలలో సహగమనం నిర్వహించిన తేదీకూడా వ్రాయబడింది. వివరణలు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. ఈ వ్రాతలలో చనిపోయిన వ్యక్తిపేరు, ఆయనతో సహగమనం చేసిన భార్య పేరు ఉన్నాయి. సతి స్తంభాలలో ఎరన్ గ్రామం పేరు సహగమనం చేసిన స్త్రీ పేరు ఉన్నాయి.
సతి స్థంభాలు
మార్చుసతి స్తంభాలలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొలిమి, ఆశీర్వదించే చేతులు చెక్కబడి ఉన్నాయి. సూర్య, చంద్ర, నక్షత్రాలు, అగ్ని, భూమి ఉన్నంత వరకు సతి స్మృతులు నిలిచి ఉంటాయని అర్ధం. ఈ గ్రామంలో ఉన్న స్తంభాలన్ని క్షత్రియ, బ్రాహ్మణులకు చెందినవి. ఇవి నగ్రి లిపిలో వ్రాయబడి ఉన్నాయి. 1874 - 75 లో జనరల్ ఏ. కన్నింగ్‌హాం ఈ గ్రామాన్ని పరిశోధనార్ధం సందర్శించిన సమయంలో అక్కడ పురాతనమైన పలు రాగి నాణ్యాలు లభించాయి. వీటిలో కొన్ని చారిత్రక విలువలు కలిగి ఉన్నాయి. వీటిలో పలు పంచ్ మార్క్డ్ నాణ్యాలు ఉన్నాయి. ఎరన్‌లో లభించిన నాణ్యాలలో లక్ష్మీ, జంతువులు (గుర్రం, ఏనుగు), కంచలోపల ఉన్న చెట్టు, పలు ఇతర చిహ్నాలు ఉన్నాయి. ఇతరచిహ్నాలలో స్వస్తిక్, త్రిరత్న, ఇంద్రధ్వజ, ధర్మచక్ర, తామర పుష్పం, ఉజ్జయిని చిహ్నం, నదిలోని చేపలు, అర్ధచంద్రాకారం, చంద్రవంక, చక్రం, ఎద్దు, సాదర్‌చక్ర, కొండలు, కొండలు, వీరుడు, క్రాస్, బాల్ చిహ్నాలు ఉన్నాయి.
నాణ్యాలు
మార్చులిపితో కూడిన నాణ్యాలలో గుర్తించతగినది రాజా ధర్మపాలా పేరుతో ముద్రించబడిన నాణ్యాలని చెప్పచ్చు. చరిత్రసృష్టించిన రాణో ధమ్మపలాసా (రాజా ధర్మపాలా) పేరుతో ముద్రిచబడిన ఒక నాణ్యం రెండవ వైపు పెద్ద బ్రహ్మీ అక్షరంతో ముద్రినచబడిన నాణ్యం మౌర్యుల కాలం నాటిది.ఈ నాణ్యం ప్రస్తుతం లండన్‌లో బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శించబడుతుంది. ఎరాన్‌లో లిపితోకూడిన నాణ్యాలు, ఇతర ప్రాముఖ్యత కలిగిన నాణ్యాలు లభించాయి. ధర్మపాలా పేరుతో ముద్రించబడిన ఒక రాగి నాణ్యం భారతదేశంలో ముద్రించబడిన ఆరంభకాల నాణ్యంగా భావిస్తున్నారు. ఈ నాణ్యం క్రీ.పూ 3వ శతాబ్దంలో ముద్రించబడినదని భావిస్తున్నారు. సత్తుతో చేసిన గుండ్రని మరొక నాణ్యం మీద ఇంద్రగుప్త పేరు ముద్రించబడు ఉంది. ఇది కూడా 3వ శతాబ్ధానికి చెందిన ఎరాన్ నాణ్యమని భావిస్తున్నారు. లిపి లేని ప్రాంతీయ నాణ్యాలు అనేకం ఎరాన్ వద్ద జరిపిన త్రవ్వకాలలో లభించాయి. ఈ పట్టణం రాజధానిగా కాని నాణ్యాలు తయారుచేసిన కేంద్రగా కాని ఉండి ఉండాలని భావిస్తున్నారు. పంచ్- మార్క్డ్, గిరిజన నాణ్యాలు రెండవ సారి ఎరాన్ త్రవ్వకాలలో లభించాయి. బ్రాహ్మీ లిపిలో ఎరాకన్యా (ఎరాకన) పేరుతో ముద్రించబడిన నాణ్యాలు కూడా ఎరాన్‌లో లభించాయి. నది చిహ్నం ఉన్న నాణ్యం పురాతన ఎరాన్ పట్టణాన్ని సూచుస్తుందని కన్నింగ్‌హాం అభిప్రాయం. బ్రాహ్మీ లిపిలో ఉన్న ఈ నాణ్యాలు క్రీ.పూ 2-1 శతాబ్ధాలకు చెందినవని భావిస్తున్నారు. నలుచదరంగా ఉన్న కొన్ని నాణ్యాలు పాత కర్సపానాకు చెందినవి. ఎరాన్‌లో లభించిన మిగలిన నాణ్యాల మీద లిపి లేదు కాలి కొన్ని ఎరాన్ సంబంధిత చిహ్నాలు మాత్రం ఉన్నాయి.
రాగి నాణ్యాలు
మార్చుఎరాన్ వద్ద లభించిన పలు పంచ్- మార్క్డ్ నాణ్యాలు కొంచెం పెద్దవి. ఎరాన్ వద్ద సాగర్ విశ్వవిద్యాలయం జరిపిన త్రవ్వకాలలో పలు పురాతన వస్తువులు కూడా లభించాయి. పలుచని గుండ్రని బంగారు ముక్క క్రీ.పూ 1వ శతాబ్ధానికి చెందినదని భావిస్తున్నారు. ఇది చక్కగా గుండ్రని ఆకారంతో ఉన్నప్పటికీ దీని మీద ఎలాంటి చిహ్నం ముద్రించబడకేదు. అది ఆభరణాలలో ఉపయోగించబడినది అనడానికి తగిన ఆధారం కూడా ఏమీ లేదు. అందువలన ఇది ధనానికి బదులుగా ఉపయోగపడిందని భావిస్తున్నారు. ఈ నాణ్యం చాల్కొలితిక్ ప్రజలలో వస్తుమార్పిడికి మాధ్యమంగా ఉపయోగపడిందని భావిస్తున్నారు. ఈ కాలనికి సంబంధించిన వెండిపూత పూసినవి, రాగి పంచ్- మార్క్ నాణ్యాలు లభించాయి. ఇవి రెండవ శతాబ్ధానికి చెందినవని భావిస్తున్నారు.
నాణ్యాల తయారీ
మార్చుఎరాన్ వద్ద పెద్ద ఎత్తున రాగి నాణ్యాల తయారుచెయ్యబడ్డాయని భావిస్తున్నారు. వీటిలో పంచ్- మార్క్, డై- స్ట్రక్, పోత పోసినవి ఉన్నాయని కన్నింగ్ హాం అభిప్రాయం. పంచ్- మార్క్ రాగి నాణ్యాలు వెండి నాణ్యాల కంటే పెద్దవి. నలుచదరంగా ఉన్న కర్సపనా డై- స్ట్రక్ నాణ్యాలు నాణ్యాలు 144 గ్రైంస్ బరువు ఉన్నాయి. వీటి మీద పలు చిహ్నాలు ఉన్నాయి. వీటిలో కొన్ని గిరిజన నాణ్యాలు. వీటిలో అధికంగా 17.45, 24.43 గ్రైనుల బరువున్నాయి. పంచ్- మార్క్ నాణ్యాలు సా.శ. 3 శతాబ్ధానికి చెందినవి. త్రవ్వకాలలో లభించిన వాటిలో క్షత్రపాలు, శాతవాహనులు, నాగాలు, గుప్త రాజు రామగుప్తా, హూణ పాలకుడు తొర్మణ, ఇండో - ససానియన్ పాలకులకు సంబంధిచినవి ఉన్నాయి. నాగా నాణ్యాలు విదిశ, పవయ (పద్మావతి), మథుర నాణ్యాలలో సారూప్యత కనిపిస్తున్నాయి. ఈ నాణ్యాల మీద ముద్రించబడిన వ్రాతలను అనుసరించి కాలనుగుణ పాలకుల వివరాలను తెలుసుకుంటున్నారు. ఎరాన్ ప్రాంతంలో 27 నాణ్యాల తయారీ కర్మాగారాలు ఉన్నాయని భావిస్తున్నారు. విదిశ అధిక సంఖ్యలో రాగి నాణ్యాలు ముద్రించబడ్డాయి. బాలాఘాట్ వద్ద రాగి విస్తారంగా లభించడం వలన ఈ ప్రాంతం రాజకీయంగా, నాణ్యాల తయారీకి కేంద్రంగా మారింది.
ఆర్ధికం
మార్చుమాల్వా, బుండేల్ఖండ్ ప్రాంతాలు సుంగ శాతవాహనుల కాలంలో సమృద్ధిగా ఉండేది. ఈ కాలానికి సంబంధించిన బంగారు నాణ్యాలు లభించలేదు. పంచ్- మార్క్ వెండి నాణ్యాలు తగినన్ని లభ్యం కాలేదు. సుంగ శాతవాహనుల తరువాత ఈ ప్రాంతంలో రాజకీయమైన మార్పులు సంభవించాయి. పశ్చిమ మాల్వాను శాక - క్షత్రపాలు ఆక్రమించుకున్నారు. వారి పాలన సా.శ. 2వ శతాబ్దం వరకు సాగింది. వారు పశ్చిమ మాల్వా ప్రాంతంలో వెండి నాణ్యాలను ప్రవేశపెట్టారు. .
పురా వస్తు పరిశోధన
మార్చుత్రవ్వకాలలో 100 బంకమట్టి ముద్రికలు లభించాయి. వీటిలో క్షత్రపాశైలి బ్రాహ్మీ వ్రాతలు ఉన్నాయి. వరమిత్రపుత్రస్య రజ్నొ, సింహరిసెనస్య (ఈశ్వరమిత్ర కుమారుడు), క్షత్రప లేక మహాక్షత్రప వంటి బిరుదులు వీటిలో చోటు చేసుకున్నాయి. రజ్నో, కొండలు, నదుల చిహ్నాలు కూడా క్షత్రపా నాణ్యాలలో ముద్రించబడ్డాయి. సా.శ. 3వ శతాబ్దం చివర, 4వ శతాబ్దం వరకు ఈశ్వరమిత్ర ఆయన కుమారుడు సింహాస్రిసేన ఎరాన్ భూభాగాన్ని పాలించారని తెలుస్తుంది. ఎరాన్, విదిశలో రామగుప్తా కాలంనాటి నాణ్యాలు అధిక సంఖ్యలో లభించాయి. ఎరాన్ వద్ద సాగర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన త్రవ్వకాలలో 4 రకాల (సింహం, గరుడ, గరుడధ్వజ, బార్డర్) రాగినాణ్యలు లభించాయి. రామగుప్తా నాణ్యాలన్ని రాగి నాణ్యాలే. ఇవి బరువులో 20- 30 గ్రెయినుల బరువు ఉన్నాయి. నాగానాణ్యలను పోలిఉన్న ఈ నాణ్యాలు గుండ్రని ఆకారంలో ఉన్నాయి. రామగుప్తా నాణ్యాల మీద పేరు స్పష్టంగా ఉంది. సింహం, గరుడ, గరుడధ్వజ, బార్డర్ చిహ్నాలలో కొంత వ్యత్యాసం ఉంది. రామగుప్తా రాగి నాణ్యాలే కాక చంద్రగుప్త విక్రమాదిత్య కాలంనాటి నాణ్యాలు కూడా ఎరాన్ త్రవ్వకాలలో లభించాయి. ఇవి రెండు రకాలు. చక్రం, పూర్ణకుంభం. విదిశ త్రవ్వకాలు రామగుప్తా కాలాంనాటి నాణ్యాలు లభించాయి. వాటి రంగు, డిజైన్ ఎరాన్ నాణ్యాలను పోలి ఉన్నాయి. గుప్త సామ్రాజ్యంలో రాగినాణ్యాల ముద్రణకు రామగుప్తుడు ఆద్యుడని భావిస్తున్నారు. గుప్తుల ప్రత్యేకతలు కలిగిన రాగినాణ్యాలను ఆధారం చేసుకుని అధ్యనం కొనసాగింది. రామగుప్తా రాగినాణ్యాలు మాల్వా తూర్పు భాగంలో ముద్రించబడ్డాయి. ప్రధానంగా ఎరాన్ వద్ద అధికంగా తయారుచేయబడ్డాయి.
రామగుప్తా
మార్చురామగుప్తా రాగినాణ్యాలు నాగా నాణ్యలు, గుప్తులకంటే ముందు పాలించిన పాలకుల నాణ్యాలను పోలి ఉన్నాయి. .[6] రామగుప్తా ముద్రించిన నాణ్యాలను అదే పేరుతో ప్రాంతీయ అధికారులు కాని సామంతరాజులు కాని విడుదల చేయలేదు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యునికి అన్న రామగుప్తా. త్రవ్వకాలలో గ్వాలియర్, భోపాల్ రాజ్య నాణ్యాలు కూడా ఉన్నాయి. సమీప కాలంగా రచయిత డాక్టర్ మోహన్ లాల్ చధర్‌కు పంచ్- మార్క్ నాణ్యాలు 460 ఒక మట్టి కుండలో లభించాయి. ఇవి వెండి, రాగి, తగరం, ఇత్తడి, మిశ్రత లోహాలతో చేయబడ్డాయి. ఇవి దాదాపు 2300 సంవత్సరాలకు ముందు కాలానికి చెందినవి. వీటిలో ఏనుగు, సూర్యుడు, సదర, చక్ర, తౌరైన్, తాబేలు, వర్తులంలో చుక్క, అరుగుతో కూడిన చెట్టు, స్వస్తిక్, ఎద్దు, కొండ, చేప, జంట నాగులు, వజ్ర, ఉజ్జయిని చిహ్నాలు ఉన్నాయి. రెండవ వైపు ఒకటి రెండు చిహ్నాలు ఉన్నాయి. రెండవ వైపు సాధారణంగా స్వస్తిక్, సూర్యుడు, సదరచక్రా, చేప గుర్తులు ఉన్నాయి. మూడు నాణ్యాలలో మద్యలో చిల్లులు ఉన్నాయి. వీటిని కంఠహారం వంటి ఆభరణాలలో ధరించి ఉంటారు. ఈ చిహ్నాలు అసలైన నాణ్యాలను గుర్తించడానికి సహకరిస్తున్నాయి.
ఆకారం
మార్చునాణ్యాలు దీర్ఘచతురశ్రం, చదరం, ఉన్నాయి. వీటిలో కొన్ని పన్- మార్క్, స్టాంప్డ్ విధానంలో తయారు చేయబడ్డాయి. నాణ్యాలు 4 గ్రూపులుగా విభజించబడ్డాయి. మొదటి గ్రూప్ 1.30 గ్రాములు, రెండవ గ్రూప్ 2.50 గ్రాములు, మూడవ గ్రూప్ 3.80 గ్రాములు, 4వ గ్రూపు 9.60 గ్రాములు బరువున్నాయి. ఈ నాణ్యాలు డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం (సాగర్), మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. ఈ నాణ్యాలను అధ్యనం చేయడం వలన భారతీయ ప్రజల పురాతన చరిత్ర, సంస్కృతి, కళలు, మతం, ఆర్థికం, రాజకీయ చరిత్రను తెలియజేస్తున్నాయి. పురాతన కాలంలో ముద్రించబడిన ఈ నాణ్యాలను వ్యాపార మార్గంలో ఉన్న ప్రధాన పట్టణాలలో వినియోగించబడ్డాయి. ఎరాన్ నాణ్యాలు భారుచ్ (భ్రగు కచ్చ), ఉజ్జయిని నుండి కౌసంబి, మథుర, తక్షశిల వ్యాపర మార్గంలో వినియోగించబడ్డాయి. [7]
నేమినగర్ మహరాజ్
మార్చుబంద తాలూకాలో నేమినగర్ జైన్ తీర్ధ్ ఆలయం ఉంది. సాగర్ పట్టణానికి ఇది 30కి.మీ దూరంలో జాతీయ రహదారి - 86 పక్కన ఉంది. 108 ఆచార్యశ్రీ దీనిని నిర్మించాడు. నెమిసాగర్ జి మహరాజ్ ఆయన గురువు ఆచార్య 108 శ్రీ దయాదాగర్ జి మహరాజ్ ఆశీర్వాదంతో ఈ ఆలయ నిర్మాణం చేసాడు. ఈ ఆలయంలో 24వ తీర్ధంకర్ విగ్రహం ఉంది. ఆలయంలో నవగ్రహ మండపం ఉంది.
మక్రోనియా(సాగర్)
మార్చుజిల్లాలో ఓషో కొండ ఉంది. ఈ కొండ మీద రజనీష్ తన అమ్రిత్ సాధన చేసాడు. డాక్టర్ హెచ్.ఎస్ గౌర్ మక్రోనియాలో యూనివర్శిటీని ప్రారంభించాడు. కనుక మక్రోనియాకు పలు చారిత్రక సంఘటలకు సంబంధం ఉంది. సాగర్ సిటీకి ఈ ప్రాంతం సబర్బన్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది నగరానికి 5కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ప్రత్యేక రైల్వే స్టేషను ఉంది. ఇక్కడ సాగర్ 3 స్టార్ హోటల్ అనే పెద్ద హోటల్ ఉంది. ఇక్కడ సి.బి.ఎస్.సి మరొయు ఎం.పి, బోర్డ్ స్కూల్స్, ప్రభుత్వ ఇజనీరింగ్ కాలేజీలు, ఇక్కడ పలు ఆర్మీ బేసులు ఉన్నాయి. మక్రోనియా గ్రామపంచాయితీ మధ్యప్రదేశ్లో అతి పెద్ద గ్రామపంచాయితీగా గుర్తించబడుతుంది.
సుప్రసిద్ధ వ్యక్తులు
మార్చు- డాక్టర్. హరిసింగ్ గౌర్ - సాగర్ విశ్వవిద్యాలయం స్థాపకుడు. డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయ, ప్రముఖ న్యాయవాది, న్యాయవేత్త, విద్యావేత్తలు, సామాజిక సంస్కర్త, కవి, రచయిత, రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడు.
- నాథూరాం ప్రేమి (1881-1960). రంగంలో రచయిత, ప్రచురణకర్త, కవి, ఎడిటర్, భాషావేత్త, మేధో జైనమతం, హిందీ సాహిత్యంలో. కియరి, సాగర్ నగరంలో జన్మించాడు.
- పండిట్ రవిశంకర్ శుక్లా ( 1877 ఆగస్టు 2 - 1956 31 డిసెంబరు) - సాగర్ లో జన్మించాడు, మొదటి ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర
- అశోక్ "Mizaj" ( 1957 జనవరి 23 -)
- Ashok "Mizaj" ( 1957 జనవరి 23-)[8][9]- Shayar: హిందీ-ఉర్దూ గజల్
- విట్ఠల్‌భాయి పటేల్ - కవి, పాటల రచయితగా, మాజీ మంత్రి, సోషల్ వర్కర్
- అరుణ్ సక్సేనా - సుప్రసిద్ధ కన్స్యూమర్ కార్యకర్త, సోషల్ వర్కర్ సాగర్ లో జన్మించాడు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-24. Retrieved 2014-11-23.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
- ↑ 7
- ↑ 35
- ↑ References 1. Fleet, J.F. : Corpus Inscriptionum Idicarum, Vol. 3,p. 88-902. Cunningham,A.: Report of tours in Malwa and Bundelkhand, varansi,1966, p. 463. Bajpai, K.D. : Sagar through the ages, New Delhi, 1967, p. 27.4. Ibid, p. 26-27.5. Jha, V.D.: Recent excavation at Eran, Archaeological studies, Varanasi,1986, p. 101 6. Fleet, J.F.: Corpus Inscriptionum Idicarum, Vol.3, p. 18 7. Bajpai, K.D. : Sagar through the ages, New Delhi, 1967, p. 11-12 8. Ibid 9. Ibid 10. Ibid 11. Ibid 12. Ibid 13. Ibid 14. Corpus Inscriptionum Idicarum, Vol. 3, 91-9315. Bajpai, K.D. : Sagar through the ages, New Delhi, 1967, p. 3616. Cunningham, A.: Coins of Ancient India, London, 1891, p. 101, pl. xi17. Bajpai, K.D.: Indian Numismatic Studies, New Delhi, 1996, p. 1918. Cunningham, A. : Coins of Ancient India, London, 1891, p. 101, pl. xi fig. 1819. Bajpai, K.D.: Indian Numismatic Studies, New Delhi, 1996, p. 2320. Bajpai, K.D. : Sagar through the ages, New Delhi, 1967, p. 3621. Cunningham, A: Archaeological Survey of India, New Delhi, Vol. xiv, plate, xxxi 22. Bajpai, K.D.: Indian Numismatic Studies, New Delhi, 1996, p. 0723. Ibid 24. Ibid, p. 06 25. Ibid, p. 08 26. Bajpai, K.D.: Bulletin of ancient Indian History and Archaeology, University of Sagar, Vol. No. 1, 1967, p, 12427. Bajpai, K.D.: Indian Numismatic Studies, New Delhi, 1996, p. 1128. Ibid, p,16 29. Ibid 30. Ibid, p. 10131. Ibid, p. 1732. Ibid, p. 131 33. Ibid 34. Ibid 35. Ibid, p. 121 36. Lal, Mohan : Eran ki Tamrapasan Sanskriti, Sagar, 2009, p. 43 37. Ibid, p. 3438. Dr. Mohan Lal Chadhar, Mekal Insights, Journal of Indira Gandhi National Tribal University, Amarkantak, Vol. II No.01,January 2010. P,9439. Dr. Mohan Lal Chadhar, Mekal Insights, Journal of Indira Gandhi National Tribal University, Amarkantak, Vol. II No.01,January 2010. P,94
- ↑ book of Ashok Mizaj on Google Books Aawaz
- ↑ mushaira on Ghalib’s birth anniversary Mushaira on Ghalib’s birth anniversary, dailypioneer, 26 December 2012