విదిశ జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో విదిశా జిల్లా (హిందీ:) ఒకటి. విదిశా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

Vidisha జిల్లా

विदिशा जिला
మధ్య ప్రదేశ్ పటంలో Vidisha జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Vidisha జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుBhopal
ముఖ్య పట్టణంVidisha
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుVidisha
విస్తీర్ణం
 • మొత్తం7,371 km2 (2,846 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం14,58,875
 • సాంద్రత200/km2 (510/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72.08%
 • లింగ నిష్పత్తి897
జాలస్థలిఅధికారిక జాలస్థలి
ఉదయగిరి గుహ, విదిష

సరిహద్దులు సవరించు

విదిశా జిల్లా ఈశాన్య సరిహద్దులో అశోక్‌నగర్ జిల్లా, తూర్పు సరిహద్దులో సాగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రాయ్‌సేన్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో భోపాల్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో గునా జిల్లా ఉన్నాయి.[1]

భౌగోళికం సవరించు

విదిశా జిల్లా విద్యాచల పీఠభూమిలో ప్రధాన వింధ్యపర్వత శ్రేణిలో ఉంది. జిల్లాలో వింధ్ యపీఠభూమి ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది. ఈ పర్వత శ్రేణి నుండి పలు నదులు జన్మించి ప్రవహిస్తున్నాయి. వీటిలో బెత్వా, బినా, సింధ్ నదులు ప్రధానమైనవి. వింధ్యపర్వత శ్రేణిలో జన్మించిన నదులు మాల్వా పీఠభూమి వైపు ప్రవహిస్తున్నాయి. .[2] జిల్లా 23 - 0 నుండి 20’, 24 - 0 నుండి 22' ఉత్తర అక్షాంశం, 77 - 0 నుండి 16’, 78 - 0 నుండి 18’ డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 7,371 చ.కి.మీ జిల్లాలో చారిత్రక నగరమైన బెస్నగర్, సాంచి బౌద్ధ స్తూపం ఉన్నాయి.[1]

చరిత్ర సవరించు

1904లో ఏర్పాటు చేసిన భిలాస జిల్లాలో గ్వాలియర్ రాజాస్థానంలోని విదిశ తాలూకాగా, బసోడా తాలూకా ఉండేవి. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మునుపటి గ్వాలియర్ రాజాస్థానం 1948లో రూపొందించబడిన మధ్యభారతం రాష్ట్రంలో భాగంగా మారింది. 1949లో భిలాస జిల్లాతో చిన్న కురువై రాజాస్థానం చేర్చబడింది. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన తరువాత విదిశ జిల్లా ప్రస్తుత రూపానికి చేరుకుంది. భోపాల్ రాజాస్థానం (1949-56), సిరొన్ తాలూకా, రాజస్థాన్ రాజాస్థానంలో కొంత భాగం పురాతన తోంక్ రాజాస్థానంలోని కొంత భాగం చేర్చి మధ్యప్రదేశ్ రాష్ట్రం రూపొందించబడింది. సిరోని తాలూకా, భోపాల్ రాజాస్థానంలోని పిక్లోన్ పరగణాలు విదిశ జిల్లాకు కలుపబడ్డాయి.[2]

2001 లో గణాంకాలు సవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,458,212,[3]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 341వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 198 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.03%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 887:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 72.08%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "Vidisha". mponline. Archived from the original on 2010-07-14. Retrieved 2010-08-19.
  2. 2.0 2.1 "Vidisha". District administration. Archived from the original on 2010-09-18. Retrieved 2010-08-19.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Vidisha District Population Census 2011, Madhya Pradesh literacy sex ratio and density". Census Organisation of India. 2011. Archived from the original on 2013-01-03. Retrieved 23 నవంబరు 2014.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301

వెలుపలి లింకులు సవరించు

వెలుపలి లింకులు సవరించు