సాగర్ సంగమే
డెబాకి బోస్ దర్శకత్వంలో 1959లో విడుదలైన బెంగాలీ సినిమా.
సాగర్ సంగమే, 1959 ఏప్రిల్ 15న విడుదలైన బెంగాలీ సినిమా. డెబాకి బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భారతి డెబి, మంజు అధికారి, జహర్ రాయ్ తదితరులు నటించారు.[1] ఈ సినిమా 1959లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ సినిమా, ఉత్తమ బాల నటి అవార్డులను అందుకుంది. భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ అవార్డులను అందజేశారు. ఈ సినిమా 9వ బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[2]
సాగర్ సంగమే | |
---|---|
దర్శకత్వం | డెబాకి బోస్ |
రచన | డెబాకి బోస్ ప్రేమేంద్ర మిత్రా |
నిర్మాత | అమర్ మాలిక్ పిక్చర్స్ |
తారాగణం | భారతి డెబి మంజు అధికారి జహర్ రాయ్ |
ఛాయాగ్రహణం | బిమల్ ముఖర్జీ |
కూర్పు | గోబర్ధన్ అధికారి |
సంగీతం | రాయ్ చంద్ బోరల్, షైలెన్ రాయ్ (సాహిత్యం) |
విడుదల తేదీ | 1959, ఏప్రిల్ 15 |
సినిమా నిడివి | 90 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
నటవర్గం
మార్చు- భారతి డెబి
- మంజు అధికారి
- జహర్ రాయ్
- నితీష్ ముఖోపాధ్యాయ్
- సైలెన్ గంగోపాధ్యాయ
- తుల్సి లహ్రి
- మనోరమ డెబి
- నిభానాని డెబి
- మాస్టర్ బిభూ
- అమర్ పాల్
- ఎండి. ఇజ్రాయెల్
అవార్డులు
మార్చు- 1959: ఉత్తమ చలన చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1959: బెంగాలీలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర పురస్కారం
- 1959: ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డు - మంజు అధికారి
- బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
- 1959: గోల్డెన్ బేర్ - నామినేట్ చేయబడింది
మూలాలు
మార్చు- ↑ "Sagar Sangamey (1959)". Indiancine.ma. Retrieved 2021-06-13.
- ↑ "IMDB.com: Awards for The Holy Island". imdb.com. Retrieved 13 June 2021.
- ↑ "6th National Film Awards". International Film Festival of India. Archived from the original on 20 October 2012. Retrieved 13 June 2021.