సాదత్ అలీ

పాకిస్థానీ మాజీ క్రికెటర్

సాదత్ అలీ (జననం 1955, ఫిబ్రవరి 6) పాకిస్థానీ మాజీ క్రికెటర్. 1984లో పాకిస్థాన్ తరపున ఎనిమిది వన్డే ఇంటర్నేషనల్‌లు ఆడాడు. వన్డే ఇంటర్నేషనల్‌లో 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మొదటి పాకిస్థానీగా ఘనత సాధించాడు.[1]

సాదత్ అలీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1955-02-06) 1955 ఫిబ్రవరి 6 (వయసు 69)
లాహోర్, పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే1984 మార్చి 9 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1984 డిసెంబరు 7 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 8 148 56
చేసిన పరుగులు 184 10,122 1,576
బ్యాటింగు సగటు 30.66 47.97 30.30
100s/50s 0/1 21/43 0/14
అత్యధిక స్కోరు 78* 277 83
వేసిన బంతులు 27 6,730 562
వికెట్లు 2 82 17
బౌలింగు సగటు 14.50 37.78 30.41
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/24 6/49 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 136/– 19/–
మూలం: CricInfo, 2021 ఫిబ్రవరి 21

కెరీర్

మార్చు

1973-74 సీజన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి, 1974-75లో లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1984, మార్చి 9న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఇంగ్లాడ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులోకి వచ్చాడు.[2] పాకిస్తాన్ తరపున మరో ఏడు మ్యాచ్‌లు ఆడాడు. 1984, డిసెంబరు 7న ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు. 1988-89 సీజన్ వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటం కొనసాగించాడు. 1989-90 వరకు లిస్ట్ ఎ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.

1983-84లో హౌస్ బిల్డింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, లాహోర్ సిటీ వైట్స్ కోసం ఒక సీజన్‌లో అత్యధిక ఫస్ట్-క్లాస్ పరుగుల జాతీయ రికార్డును కలిగి ఉన్నాడు. ఆదాయపు పన్ను శాఖ క్రికెట్ జట్టు తరపున కూడా ఆడాడు.

విరమణ తరువాత

మార్చు

రిటైర్మెంట్ తర్వాత అలీ మ్యాచ్ రిఫరీ అయ్యాడు. 110 ఫస్ట్-క్లాస్, 63 లిస్ట్ ఎ, 28 టీ20 మ్యాచ్‌లను పర్యవేక్షించాడు. 2015 జనవరి 27న చివరి మ్యాచ్ జరిగింది.[2]

వ్యక్తిగత జీవితం

మార్చు

సాదత్ 1955, ఫిబ్రవరి 6న పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించాడు.[1] ఇతని సోదరుడు అష్రఫ్ అలీ కూడా 1980 నుండి 1987 వరకు 8 టెస్టులు, 16 వన్డేలు ఆడిన మాజీ పాకిస్తానీ క్రికెటర్. [3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Saadat Ali profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Retrieved 2023-09-02.
  2. 2.0 2.1 "Saadat Ali Debut and last played matches in Tests, ODIs, T20Is and other formats". ESPNcricinfo. Retrieved 2023-09-02.
  3. "Ashraf Ali profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Retrieved 2023-09-02.

బాహ్య లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సాదత్_అలీ&oldid=4137005" నుండి వెలికితీశారు