సాధన్‌ పాండే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, స్వయం సహాయక బృందాలు, స్వయం ఉపాధి శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా మంత్రిగా పని చేశాడు.

సాధన్‌ పాండే

వినియోగదారుల వ్యవహారాల శాఖ &స్వయం సహాయక బృందాలు, స్వయం ఉపాధి శాఖ
పదవీ కాలం
20 మే 2011 – 9 నవంబర్ 2021
గవర్నరు ఎంకే. నారాయణన్
డి. వై. పాటిల్
కేశరి నాథ్ త్రిపాఠి
జగదీప్ ఢంకార్
తరువాత శశి పంజా (స్వయం సహాయక బృందాలు, స్వయం ఉపాధి శాఖ) మానస్ భూనియా (వినియోగదారుల వ్యవహారాల శాఖ)

ఎమ్మెల్యే
పదవీ కాలం
13 మే 2011 – 20 ఫిబ్రవరి 2022
ముందు రూప బాఘ్చి
నియోజకవర్గం మాణిక్తల
పదవీ కాలం
1985 – 2011
ముందు అజిత్ కుమార్ పంజా
నియోజకవర్గం బర్తోలా

వ్యక్తిగత వివరాలు

జననం (1950-11-13)1950 నవంబరు 13
మరణం 2022 ఫిబ్రవరి 20(2022-02-20) (వయసు 71)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ (1979–1999)

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (1999–2022)

సంతానం 1
నివాసం మణిక్తల, కోల్‌కాతా
పూర్వ విద్యార్థి కలకత్తా యూనివర్సిటీ

రాజకీయ జీవితం

మార్చు

సాధన్ పాండే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి 2011లో పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వినియోగదారుల వ్యవహారాలు, స్వయం సహాయక బృందాలు, స్వయం ఉపాధి శాఖలకు ఇన్‌ఛార్జ్‌గా మంత్రిగా పని చేశాడు. ఆయన బర్తోలా నియోజకవర్గం నుండి ఐదుసార్లు,[1] మాణిక్తల నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

సాధన్ పాండే కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 ఫిబ్రవరి 20న మరణించాడు.[2] [3][4]

మూలాలు

మార్చు
  1. "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 154. Election Commission. Retrieved 3 December 2014.
  2. Prajasakti (21 February 2022). "పశ్చిమ బెంగాల్‌ సీనియర్‌ మంత్రి సాధన్‌ పాండే మృతి | Prajasakti". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  3. Prabha News (20 February 2022). "మంత్రి సాధన్ పాండే మృతి - మమత బెన‌ర్జీ సంతాపం". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  4. Sakshi (20 February 2022). "టీఎంసీ సీనియర్‌ నేత కన్నుమూత.. ఆవేదనలో సీఎం మమత బెనర్జీ". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.