సాధన శివదాసాని
సాధన శివదాసాని (1941 సెప్టెంబరు 2 - 2015 డిసెంబరు 25) హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ నటి.[1] ఆమె భారతీయ సినిమా అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా పరిగణించబడింది. 1960ల మధ్యకాలంలో రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ త్రయం చిత్రాలలో ఆమె "మిస్టిరియస్ ఉమెన్"గా "ది మిస్టరీ గర్ల్"గా పేరుగాంచింది. సినిమారంగంలో సాధన పేరుతో పిలిచే ఆమె సౌందర్యంతో పాటు ట్రెండ్ సెట్టింగ్ ఫ్యాషన్ కు కూడా ప్రసిద్ది చెందింది.[2][3]
సాధన శివదాసాని | |
---|---|
జననం | కరాచీ, సింద్ ప్రావిన్స్, బ్రిటీష్ రాజ్ (ప్రస్తుతం సింధ్, పాకిస్థాన్) | 1941 సెప్టెంబరు 2
మరణం | 2015 డిసెంబరు 25 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 74)
సమాధి స్థలం | ఓషివారా శ్మశానవాటిక, ముంబై |
ఇతర పేర్లు | ది మిస్టరీ గర్ల్ |
విద్యాసంస్థ | జై హింద్ కళాశాల, ముంబై (ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1958–1981 |
గుర్తించదగిన సేవలు | అస్లీ నఖ్లీ (1962) మేరే మెహబూబ్ (1963) వో కౌన్ థీ? (1964)< br/> అర్జూ (1965) వక్త్ (1965) మేరా సాయా (1966) ఇంటక్వామ్ (1969) ఏక్ ఫూల్ దో మాలీ (1969) |
జీవిత భాగస్వామి | ఆర్.కె. నయ్యర్
(m. 1966; died 1995) |
కరాచీలో జన్మించిన ఆమె, వారి కుటుంబం ఆమెకు 7 సంవత్సరాల వయస్సులో భారతదేశ విభజన సమయంలో బొంబాయికి వలస వచ్చారు. శ్రీ 420 (1955)లో అంతగా గుర్తింపు లేని పాత్రతో సినిమా కెరీర్ మొదలుపెట్టింది. తరువాత, ఆమె లవ్ ఇన్ సిమ్లా (1960)లో నటించింది. ఈ చిత్రంలో ఆమె విలక్షణమైన హెయిర్ స్టైల్ విపరీతంగా ప్రేక్షకులను ఆకర్శించింది. ఎంతగా అంటే "సాధన కట్"గా పేరు పొందింది. పరాఖ్ (1960), హమ్ దోనో (1961), అస్లీ-నక్లి (1962), ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా (1962), మేరే మెహబూబ్ (1963) వంటి చిత్రాలతో ప్రముఖ నటిగా ఆమె ఇండస్ట్రీలో స్థిరపడింది. ఆ తరువాత వో కౌన్ తీ? (1964), అర్జూ (1965), వక్త్ (1965), మేరా సాయా (1966), అనిత (1967) చిత్రాలలో తన అందం, అభినయంతో అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసింది.[4][5]
అయితే హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism) కారణంగా 1960ల చివరలో ఆమె ఆరోగ్యం క్షీణించింది, దీని కారణంగా ఆమె సినిమాల నుండి కొంత విరామం తీసుకోవలసి వచ్చింది. ఆమె చికిత్స కోసం బోస్టన్‌కు వెళ్లింది. తిరిగి వచ్చిన ఆమె 1969లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుసగా రెండు బాక్సాఫీస్ హిట్‌లు ఏక్ ఫూల్ దో మాలీ, ఇంతకంలలో నటించింది.
అంతేకాకుండా 1974లో, ఆమె క్రైమ్ థ్రిల్లర్ గీతా మేరా నామ్‌తో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. అనారోగ్యంతో హిందూజా ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ 2015 డిసెంబరు 25న తుదిశ్వాస విడిచింది.[6] ఆమె చివరి చిత్రం ఉల్ఫత్ కి నయీ మంజిలీన్ (1994) కాగా, 2002లో మరణానంతరం, IIFA లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకుంది.
సాధన తను నటించిన చిత్రం లవ్ ఇన్ సిమ్లా దర్శకుడు ఆర్.కె. నయ్యర్ ను 1966 మార్చి 7న వివాహం చేసుకుంది.[7] ఆయన 1995లో మరణించాడు.
జీవితం తొలి దశలో
మార్చు1941 సెప్టెంబరు 2న బ్రిటిష్ ఇండియాలోని కరాచీలో సింధీ హిందూ కుటుంబంలో ఆమె అంజలి శివదాసానిగా జన్మించింది, తన తల్లిదండ్రులు శివరామ్ శివదాసాని, లాలీ దేవిలకు సరళ శివదాసాని మొదటి సంతానం కాగా, ఆమె రెండవ సంతానం. ఆమె తండ్రి బెంగాలీ నటి, డ్యాన్సర్ సాధనా బోస్‌కి పెద్ద అభిమాని కావడంతో, అతను తన కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సులో సాధనగా పేరు మార్చాడు. ఆమె బాబాయ్ హరి శివదాసాని, ఆయన కూతురు బబితా కపూర్ ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారే.
భారతదేశ విభజన సమయంలో వారి కుటుంబం కరాచీ నుండి వలస వచ్చి బొంబాయిలో స్థిరపడింది. ఆమె 8 సంవత్సరాల వయస్సు వరకు తల్లి వద్ద చదివించింది, ఆ తర్వాత ఆమె వాడాలాలోని ఆక్సిలియం కాన్వెంట్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె పాఠశాల విద్య తరువాత, ఆమె జై హింద్ కళాశాలలో ఆర్ట్స్ డిగ్రీ కోసం ప్రవేశం తీసుకుంది. కళాశాలలో చదివే రోజుల్లో ఆమె అనేక నాటకాలలో నటించేది, కానీ కుటుంబం రెండు పూటలా గడవడం కష్టంగా ఉన్నప్పుడు, ఆమె తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కొలబా(Colaba)లో టైపిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉదయం కళాశాలకు హాజరై, రోజు రెండవ భాగంలో పని చేసేది. అయితే, ఆమె డిగ్రీ పూర్తి చేయలేకపోయింది. ఆమెకు చిన్నతనం నుండే సినిమాల్లో నటించాలని ఆకాంక్ష ఉండడం కారణంగా సినిమాలలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. నటి నూతన్ ఆమెకు ప్రేరణగా నిలిచింది.[8] ఆమె హమ్ దోనో (1961), అస్లీ-నఖ్లీ (1962)లలో నటించిన నటుడు దేవ్ ఆనంద్‌కి కూడా పెద్ద అభిమాని.
మూలాలు
మార్చు- ↑ Roshmila Bhattacharya (28 August 2011). "Sadhana's fringe benefits from Audrey Hepburn". Hindustan Times. Mumbai. Archived from the original on 23 June 2013. Retrieved 3 February 2012.
- ↑ "Sadhana Shivdasani Cremated, Waheeda Rehman, Asha Parekh Bid Farewell". NDTV. Retrieved 27 December 2015.
- ↑ "Bollywood, kin, bid adieu to Sadhana". The Hindu. 27 December 2015. Retrieved 27 December 2015.
- ↑ "Sadhana: The actor with the timeless elegance, the fringe and that outfit". The Indian Express. Retrieved 27 December 2015.
- ↑ "Sadhana will always be remembered for her trendsetting 'Sadhana cut' hairstyle, say fans". IBNLive. Archived from the original on 27 డిసెంబరు 2015. Retrieved 27 December 2015.
- ↑ "Sadhana, Hindi film style icon of 1960s, is no more". The Hindu. 26 December 2015. Retrieved 27 December 2015.
- ↑ "Sadhana Shivdasani Cremated, Waheeda Rehman, Asha Parekh Bid Farewell". NDTV. Retrieved 27 December 2015.
- ↑ Chandrika Bhattacharya (1990). "Interview in Movie Magazine". Movie Magazine. Retrieved 3 February 2012.