నూతన్

భారతీయ నటి

నూతన్ సమర్థ్ బహల్ (1936 జూన్ 4 - 1991 ఫిబ్రవరి 21) హిందీ చిత్రాలలో నటించిన భారతీయనటి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్‌లో 80కి పైగా చిత్రాలలో నటించింది. వీటిలో ఎక్కువగా ఆమె కథానాయికగా చేసింది. ఆమె భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరిగా పరిగణించబడుతుంది.[1]

నూతన్
జననం
నూతన్ సమర్థ్

(1936-06-04)1936 జూన్ 4
బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (నేటి ముంబై, మహారాష్ట్ర, భారతదేశం)
మరణం1991 ఫిబ్రవరి 21(1991-02-21) (వయసు 54)
జాతీయతఇండియన్
క్రియాశీల సంవత్సరాలు1950–1991
గుర్తించదగిన సేవలు
హమ్ లాగ్ (1951)
నగీనా (1951)
సీమ (1955)
అనారి (1959)
సుజాత (1959)
ఛలియా (1960)
బాందిని (1963)
తేరే ఘర్ కే సామ్నే (1963)
మిలన్ (1967)
సరస్వతీచంద్ర (1968)
అనురాగ్ (1972)
సౌదాగర్ (1973)
మెయిన్ తులసి తేరే ఆంగన్ కి (1978)
జీవిత భాగస్వామి
రజనీష్ బహల్
(m. 1959)
పిల్లలుమొహ్నిష్ బహల్
తల్లిదండ్రులు
  • కుమార్‌సేన్ సమర్థ్ (తండ్రి)
  • శోభన సమర్థ్ (తల్లి)
బంధువులుప్రనూతన్ బహల్ (మనవరాలు)
పురస్కారాలు
  • ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు - 5
  • బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (BFJA) – ఉత్తమ నటి అవార్డు
  • ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
సన్మానాలుపద్మశ్రీ (1974)
2011లో భారతదేశం తపాలా బిళ్లపై నూతన్

రొమాన్స్, సాహిత్యం, సైకలాజికల్ మొదలు సామాజిక వాస్తవిక ఇతివృత్తాలు వరకు తన సహజసిద్ధమైన నటనా శైలితో నటించి ప్రసిద్ధిచెందింది.[2] నూతన్ ఉత్తమ నటిగా రికార్డు స్థాయిలో ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకోగా 1974లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది.

కెరీర్

మార్చు

ముంబైలో చిత్రనిర్మాత కుమార్‌సేన్ సమర్థ్, సినీ నటి శోభనా సమర్థ్‌లకు జన్మించిన నూతన్ 14 సంవత్సరాల వయస్సులో 1950లో తన తల్లి దర్శకత్వం వహించిన హమారీ బేటీ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది. 1951లో ఆమె నగీనా, హమ్ లాగ్ చిత్రాలలో నటించింది. 1955లో సీమ చిత్రంలో ఆమె నటనకు విస్తృత స్థాయి గుర్తింపుతో పాటు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది.

ఆమె 1960ల నుండి 1970ల చివరి వరకు ప్రముఖ పాత్రలను పోషించడం కొనసాగించింది. వాటిల్లో సుజాత, బాందిని, మిలన్, మెయిన్ తులసి తేరే ఆంగన్ కి, అనారీ, ఛలియా, తేరే ఘర్ కే సామ్నే, ఖందాన్, సరస్వతీచంద్ర, అనురాగ్, సౌదాగర్ చిత్రాలు మచ్చుకి చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలకుగానూ తనకు మరో నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి.

1980లలో నూతన్ క్యారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించింది. ఆమె మరణానికి కొంతకాలం ముందు వరకు పని చేస్తూనే ఉంది. ఆమె సాజన్ కి సహేలీ (1981), మేరీ జంగ్ (1985), నామ్ (1986) వంటి చిత్రాలలో ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. మేరీ జంగ్‌లో ఆమె నటనకు ఆమెకు ఉత్తమ సహాయ నటి విభాగంలో మరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.

వ్యక్తిగతం

మార్చు

నూతన్ నావికాదళ లెఫ్టినెంట్-కమాండర్ రజనీష్ బహల్ ను 1959 లో వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు మోహ్నిష్ బహల్ ఉన్నాడు. అతను చలనచిత్ర, టెలివిజన్ నటుడు. అతని కూతురు, నూతన్ మనవరాలు ప్రనూతన్ బహల్ కూడా బాలీవుడ్ నటి.

1991లో రొమ్ము క్యాన్సర్‌తో నూతన్ మరణించింది. ఆమె భర్త 2004లో వారి అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదంలో మరణించాడు.[3]

అవార్డులు, నామినేషన్లు

మార్చు

పౌర పురస్కారం

మార్చు

1974లో భారత ప్రభుత్వంచే దేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

మార్చు

ఉత్తమ నటి

Year Film Role Result
1957 సీమ గౌరీ విజేత
1960 సుజాత సుజాత విజేత
1961 ఛలియా శాంతి నామినేట్ చేయబడింది
1964 బాందిని కల్యాణి విజేత
1968 మిలన్ రాధ విజేత
1974 సౌదాగర్ మహజుభి నామినేట్ చేయబడింది
1979 మెయిన్ తులసీ తేరే ఆంగన్ కీ సంజుక్తా చౌహాన్ విజేత

ఉత్తమ సహాయ నటి

Year Film Role Result
1974 అనురాగ్ అను రాయ్ నామినేట్ చేయబడింది
సౌదాగర్ మహజుభి నామినేట్ చేయబడింది
1979 మెయిన్ తులసి తేరే ఆంగన్ కీ సంయుక్తా చౌహాన్ నామినేట్ చేయబడింది
1986 మేరీ జంగ్ ఆర్తి విజేత

BFJA అవార్డులు

మార్చు

ఉత్తమ నటి (హిందీ)

Year Film Role Notes
1964 బాందిని కల్యాణి విజేత
1968 మిలన్ రాధ విజేత
1974 సౌదాగర్ మహజుభి విజేత

మూలాలు

మార్చు
  1. "Forever Nutan". Rediff.com. Retrieved 22 September 2011.
  2. Dhawan, M.L. (26 February 2006). "To the manner born". The Sunday Tribune. Retrieved 28 February 2022.
  3. "Actor Mohnish Behl's father dies in fire". Rediff.com. 4 August 2004.
"https://te.wikipedia.org/w/index.php?title=నూతన్&oldid=4338020" నుండి వెలికితీశారు