సాధ్యం 2010 లో విడుదలైన తెలుగు సినిమా. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో D. రత్న కుమార్, డి కరుణాకర్, డి సురేష్ లు కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై నిర్మించారు. జగపతి బాబు, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్నీ చరణ్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నమోదైంది.

సాధ్యం
(2010 తెలుగు సినిమా)
TeluguFilm Sadhyam.jpg
దర్శకత్వం కార్తికేయ గోపాలకృష్ణ
తారాగణం జగపతి బాబు, ప్రియమణి, కీర్తి చావ్లా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ప్రగతి
నిర్మాణ సంస్థ కుమార్ బ్రదర్స్ సినిమా
విడుదల తేదీ 5 మార్చి 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

సుహానీ ( ప్రియమణి ) చాలా సున్నితమైనది. ఆత్మవిశ్వాసం తక్కువ. ఆమెకు ప్రతిదాని వలనా, ప్రతిఒక్కరి వలనా ఇబ్బందే. కాకపోతే ఆమె తన చిరాకులను తనలోనే అణచి ఉంచుకుంటుంది. ఒక రోజు, ఆమె ఒక ప్రమాదం చూస్తుంది. ఆమె కృష్ణ ప్రసాద ( తనికెళ్ళ భరణి ) ను రక్షిస్తుంది. అతను కోలుకున్నాక, సుహానీ తన రివాల్వర్‌ను చూసిందని తెలుసుకుంటాడు. తన ప్రాణాలను కాపాడినందుకు "కృతజ్ఞత"గా ఆ రివాల్వరును ఆమెకు ఇస్తాడు. ఆమె ద్వేషించే ఎవరిపైనైనా ఆమె కోపాన్ని చూపమని చెబుతాడు. ఆమె చేసే ఏ కంగాళీనైనా తాను శుభ్రపరుస్తానని చెబుతాడు. తన రెండు ముఖాల బెస్ట్ ఫ్రెండ్ అనిత ( కీర్తి చావ్లా ) ను చంపాలనే ఉద్దేశంతో సుహానీ బయలుదేరింది.

అనితతో ఆమె స్నేహం యొక్క ఫ్లాష్ బ్యాక్. వారు ఒకే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తారు. అనిత సుహానీని మోసగించి ఇంటర్వ్యూకి తప్పుడు చిరునామా ఇస్తుంది. సుహానీ వేరే హోటల్‌లో కాల్ గర్ల్స్ కోసం జరిపిన దాడిలో చిక్కుకుంటుంది. సుహాని అనితను పోలీస్ స్టేషన్కు పిలుస్తుంది, తానామెకు తప్పుడు అడ్రసు ఇచ్చినట్లు అనిత ఒప్పుకోదు. ఆమె ఆ హోటల్‌లో ఎందుకు ఉందో తనకు తెలియదని చెబుతుంది. తరువాత, అనిత తనను వడుకుంటోందనీ, స్నేహితురాలిగా నటిస్తోందనీ సుహానీ గ్రహిస్తుంది.

ప్రస్తుతం లోకి వస్తే, ఆమె అనిత ఇంటికి వెళుతుంది. అక్కడ పరిస్థితి సరిగ్గా లేదని తెలుసుకుంటుంది. ఉద్యోగం పొందడానికి అనిత కంపెనీ ఛైర్మన్‌తో పడుకుంది. కాని చివరికి ఉద్యోగం రాలేదు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ ఆమెను నమ్మలేదు. ఈ వార్త కారణంగా ఆమె తండ్రి మరణించాడు అనిత మానసికంగా దెబ్బతింది. సుహానీ ఆమెను చంపలేదు.

ఆమె తన ప్రియుడు సందీప్ ( జగపతి బాబు ) వద్దకు వెళుతుంది, కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమౌతుంది. చివరగా, ఆమె తన జీవితంలోని అన్ని బాధలకు మూలకారణమైన ఒక నిర్దిష్ట వ్యక్తిపై సమాచారాన్ని సేకరించి అతన్ని చంపాలని నిర్ణయించుకుంటుంది. ఆ వ్యక్తి ఎవరు, సుహానీ అతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నదే మిగతా సినిమా.[1]

నటవర్గంసవరించు

పాటలుసవరించు

చిన్ని చరణ్ సంగీతం సమకూర్చాడు. మధుర ఎంటర్టైన్మెంట్ ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "అసలేమైందో"  కార్తిక్, రోషిణి 4:46
2. "సెక్సేఖరా"  రీటా సుచిత్ర 4:27
3. "భూం భూం షక"  సౌమ్య మహదేవన్ 4:42
4. "నాజానే"  రాహుల్ నంబియార్ 4:15
5. "అయ్యో రామా"  Chinni Charan 4:27
6. "అద్దంకి హైవే"  నర్సన్ కాసాల, గీతా మధురి 3:42
మొత్తం నిడివి:
26:19

మూలాలుసవరించు

  1. Sadhyam Telugu Movie Review - cinema preview stills gallery trailer video clips showtimes. IndiaGlitz: (2010-03-05). URL accessed on 2012-08-04.
"https://te.wikipedia.org/w/index.php?title=సాధ్యం&oldid=3035419" నుండి వెలికితీశారు