ప్రగతి (నటి)

సినీ నటి

ప్రగతి (జననం 1975 ఏప్రిల్ 17) తెలుగు సినీనటి.[2] ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది.[3]

ప్రగతి
జననం
ప్రగతి

(1975-04-17) 1975 ఏప్రిల్ 17 (వయసు 49)
విద్యబిఎ పొలిటికల్‌ సైన్స్‌[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1994–1997
2002–ప్రస్తుతం
పిల్లలుఇద్దరు

నవంబరు 2023లో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ 28వ పురుషులు, మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా జరిగాయి.[4]

జీవితం మార్చు

ఆమె ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఉలవపాడులో జన్మించింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లికి సాయంగా ఉండటం కోసం కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసేది. చెన్నైలో స్థిరపడింది.[5]

కెరీర్ మార్చు

ప్రగతి కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉండగా చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో కనిపించింది. ఆ ప్రకటన చూసిన తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్ తన సినిమా వీట్ల విశేషంగాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.[5] రెండు సంవత్సరాల పాటు ఏడు తమిళ సినిమాలు, ఒక మలాయళం సినిమాలో నటించింది. తరువాత వివాహం కావడంతో నటనకు కొద్దిరోజులు విరామం తీసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మూడు భాషల్లో టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది.

సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (24 October 2022). "పోటీ లేకపోతే బోర్‌ కొడుతుంది..." Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  2. "ప్రగతి బయోగ్రఫీ, ప్రొఫైలు". movies.dosthana.com. Archived from the original on 11 November 2016. Retrieved 19 September 2016.
  3. "ప్రగతి (నటి)". alchetron.com. Retrieved 22 September 2016.
  4. "Pragathi: జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నటి ప్రగతి.. | pragathi wins bronze medal in national powerlifting". web.archive.org. 2023-11-28. Archived from the original on 2023-11-28. Retrieved 2023-11-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. 5.0 5.1 సునీతా చౌదరి, వై. "ప్రగతి తో ఇంటర్వ్యూ". cinegoer.net. సినీ గోయెర్. Archived from the original on 30 July 2016. Retrieved 22 September 2016.
  6. Sakshi (17 March 2022). "నటి ప్రగతి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మూవీ తెలుసా?". Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.
  7. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. Archived from the original on 16 September 2015. Retrieved 13 July 2019.
  8. సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
  9. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  11. "Kerintha: Coming-of-age stories".
  12. "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019.
  13. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.