సానయా ఇరానీ, ప్రముఖ భారతీయ టీవీ నటి, మోడల్. మొదట మోడల్ గా పనిచేసే ఆమె, మిలే జబ్ హమ్ తుమ్ సీరియల్ తో కథానాయికగా మారింది ఆమె. ఆ తరువాత ఆమె ఇస్ ప్యార్ కో క్యా నాం ధూన్? అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించింది సానయా. ఈ సీరియల్ దేశవ్యాప్తంగా హిట్ అయింది. ఆ తరువాత ఆమె ఛఛాంఛన్, రంగ్ రసియా వంటి ధారావాహికల్లో కూడా నటించింది.

సానయా ఇరానీ

వ్యక్తిగత జీవితం మార్చు

సానయా ఏడేళ్ళ పాటు ఊటీలోని బోర్డింగ్ స్కూల్ లో చదువుకుంది.[1]  ఆ తరువాత స్యెడ్నహం కళాశాలలో డిగ్రీ పూర్తిచేసింది. ఎంబీఏ చదువుకోవాలని అనుకున్నా, నటి కావాలని నిర్ణయించుకుని మోడలింగ్ లోకి అడుగుపెట్టింది సానయా.

19 అక్టోబరు 2010లో మిలే జబ్ హమ్ తుమ్ సీరియల్ షూటింగ్ చివరి రోజున ఆ సీరియల్ లో తనతో కలసి నటించిన మోహిత్ సెహగల్ తో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది సానయా.[2]

కెరీర్ మొదట్లో, సానయాకు హిందీ సరిగ్గా వచ్చేది కాదు. హిందీ అనర్గళంగా మాట్లాడలేక ఇబ్బంది పడేది.[3]

25 జనవరి 2016న తన ప్రియుడు మోహిత్ సెహగల్ ను వివాహం చేసుకుంది సానయా. గోవాకు చెందిన మోహిత్ ఆమె మొదటి ధారావాహిక మిలే జబ్ హమ్ తుమ్ లో సహనటుడు అతను.[4][5]

కెరీర్ మార్చు

టెలివిజన్ మార్చు

సానయా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. యశ్ రాజ్ ఫిలిం ప్రొడక్షన్స్ నిర్మించిన ఫనా (2006) సినిమాలో మెహబూబా పాత్రతో తెరంగేట్రం చేసింది ఆమె.[6] స్టార్ వన్ లో ప్రసారమైన మిలే జబ్ హమ్ తుమ్ (2008-2010) ధారావాహికలో గుంజన్ పాత్రలో మొదటి సారి కథానాయికగా నటించింది సానయా.[7] ఆ తరువాత ఇస్ ప్యార్ కో క్యా నాం ధూన్ (2011-2012) సీరియల్ లో హీరోయిన్ పాత్ర అయిన ఖుషీ కుమారీ గుప్తా సింగ్ రైజాదా గా నటించింది ఆమె.[8]

మూలాలు మార్చు

  1. "From Fanaa to Mile Jab Hum Tum". Rediff.com. 2004-12-31. Retrieved 2014-04-19.
  2. "We are opposites who attract: Sanaya, Mohit - The Times of India". Articles.timesofindia.indiatimes.com. 2011-08-14. Archived from the original on 2013-10-29. Retrieved 2014-04-19.
  3. "From Fanaa to Mile Jab Hum Tum". Rediff.com. 2004-12-31. Retrieved 2014-04-19.
  4. "Sanaya Irani and Mohit Sehgal ties the knot in Goa". The Indian Express.
  5. "Sanaya Irani: Women just want to take a selfie and men just want to steal a kiss".
  6. "From Fanaa to Mile Jab Hum Tum". Rediff.com. Retrieved 2012-06-09.
  7. "Sanaya Irani / Gunjan - Miley Jab Hum Tum". STAROne.in. Archived from the original on 2010-04-11. Retrieved 2012-06-09.
  8. "Replacement stars rewrite TRPs". Times Of India. Archived from the original on 2013-10-06. Retrieved 2012-06-09.