ఊటీ

తమిళనాడు లో ఒక నగరం
  ?ఉదకమండలం
తమిళనాడు • భారతదేశం
ఉదకమండలం చిత్రం
ఉదకమండలం చిత్రం
అక్షాంశరేఖాంశాలు: 11°23′N 76°54′E / 11.38°N 76.90°E / 11.38; 76.90Coordinates: 11°23′N 76°54′E / 11.38°N 76.90°E / 11.38; 76.90
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 2,719 మీ (8,921 అడుగులు)
జిల్లా (లు) నీలగిరి జిల్లా
జనాభా 93,921 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 643 00x
• +0423
• TN 43

ఉదకమండలం(ఊటీ) (ooty) తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం, పట్టణం. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఇది మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు.

చరిత్రసవరించు

ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగ వంశ రాజుల ఆధీనంలోకి మారాయి. తరువాత 12వ శతాబ్దంలో హోయసాల వంశ రాజైన విష్ణువర్థనుడి స్వాధీనంలో ఉన్నాయి. చివరకు టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చి, 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు అప్పగించబడ్డాయి.

పక్కనే ఉన్న కోయంబత్తూర్ ప్రావిన్సుకు గవర్నరుగా ఉన్న జాన్ సుల్లివాన్ ఊటీ చల్లటి వాతావరణం,, అడవులను చూసి ముచ్చటపడి, అక్కడ నివసిస్తున్న కోయజాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని కొన్నాడు.

నెమ్మదిగా ఈ స్థలాలు ఆంగ్ల ప్రైవేటు వ్యక్తుల పరం కావడంతో త్వరత్వరగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాల్ని నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది.[1]. దీని అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునే వారు.

వాతావరణంసవరించు

కొప్పెన్ వాతావరణ వర్గీకరణ ప్రకారం ఊటీ వాతావరణం ఒక ఉప ఉష్ణమండల పర్వత వాతావరణం.ఉష్ణవాతావరణంలో నగరం ఉన్నప్పటికీ దక్షిణభారతదేశం యొక్క అత్యంత విరుద్ధంగా ఊటీ వాతావరణం సాధారణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా, చల్లగా ఉంటుంది.జనవరి, ఫిబ్రవరి నెలల రాత్రుల్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.సాధారణంగా వసంతకాలంలో అక్కడి వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది.ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి.సగటు అత్యల్ప ఉష్ణోగ్రత సుమారు 5–12 °C (41–54 °F), సగటు అధిక ఉష్ణోగ్రత సుమారు 17–20 °C (63–68 °F) నమోదవుతాయి.దక్షిణ ఆసియా ప్రమాణాల ప్రకారం 25 °C (77 °F) ఉష్ణోగ్రత అక్కడ నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రత.ఊటీలో వర్షాకాలం సాధారణంగా చాలా చల్లగా అధిక తేమగల గాలులతో కూడి ఉంటుంది.ఏడాది పొడవునా గాలులు అధికంగా వీస్తుంటాయి. −2 °C (28 °F) అక్కడ నమోదయిన అత్యల్ప ఉష్ణోగ్రత.నగరం డిసెంబరు నుంచి మార్చి వరకు పొడివాతావరణంతో 1250మి.మీటర్ల అవపాతంతో చవిచూస్తుంది.

జనవాసాలుసవరించు

2011 జనాభాలెక్కల ప్రకారం ఉదకమండలం జనాభా 88,340 మంది.అక్కడి లింగనిష్పత్తి సగటు ప్రతి 1000 మంది పురుషుల కోసం 1023 ఆడవారు ఉన్నారు. కానీ జాతీయ నిష్పత్తిని చూస్తే ప్రతి 1000 మంది పురుషుల కోసం 929 ఆడవారు మాత్రమే ఉన్నారు.మొత్తం జనాభాలో 7,781 మంది అరు సంవత్సారాల వయస్సు లోపు గలవారు.అందులో 3,915 మంది మొగవాళ్లు.మొత్తం జనాభాలో 28.98% శాతం మంది షెడ్యూల్ కులాలవారు, 3% మంది షెడ్యూల్ తెగలవారు ఉన్నారు.నగరం సగటు అక్షరాస్యత జాతీయ సగటు అక్షరాస్యత కంటే ఎక్కువ.నగరం సగటు అక్షరాస్యత 82.15% శాతం అయితే జాతీయ అక్షరాస్యత వచ్చి 72.99% శాతం.నగరంలో మొత్తం 23,235 గృహాలున్నాయి.మొత్తం 35,981 మంది కార్మికులు నివసిస్తున్నారు.అందులో 636 మంది రైతులు,5194 వ్యవసాయకూలీలు,292మంది గృహపరిశ్రమల్లో పనిచెసేవారు, ఇతర కార్మికులు 26,411 మంది, ఉపాంత రైతులు 65మంది,828మంది ఉపాంత వ్యవసాయ కూలీలు, గృహపరిశ్రమల్లో పనిచెసే ఉపాంత కార్మికులు 56మంది, 2,499 మంది ఇతర ఉపాంత కార్మికులు ఉన్నారు. అక్కడి సంధానభాష తమిళం.నీలగిరి స్థానిక భాషలైన బడగ, పానీయ భాషల్లో కూడా తెగలు మాట్లాడుతారు.అక్కడి స్థానికులు పొరుగు రాష్టాల సామీప్యత, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఉండటం వల్ల ఆంగ్లం, కన్నడ, మలయాళం భాషల్లో కొద్దివరకు మాట్లాడటం, అర్థం చేసుకోవడం చేస్తున్నారు.

యేలుబడి , రాజకీయాలుసవరించు

నీలగిరి రాజధాని ఊటీ (ఉదకమండలం).ఊటీ నీలగిరి జిల్లాకు ప్రధాన కేంద్రం.ఉదకమండలం శాసనసభ నియోజకవర్గం నీలగిరి లోకసభ నియోజకవర్గం యొక్క భాగంగా ఉంది.

ఆర్థికవ్యవస్థసవరించు

ఊటిలో ఆర్థిక రంగం ఎక్కువగా పర్యాటక రంగంపై ఆధారపడివుంది. వ్యవసాయం పై ఆధారపడివున్న పరిసర ప్రాంతాలకు ఊటీ ఒక సరఫరా మార్కెట్.ఊటీలో కూరగాయలు, పండ్లు పండిస్తారు.కూరాగాయల్లో ప్రధానంగా క్యారెట్, బంగాళదుంప, క్యాబేజీ, కాలీఫ్లవర్, పండ్లల్లో ప్రధానంగా పీచస్, రేగు, బేరి, స్ట్రాబెర్రీ పండిస్తారు. ఊటీ మున్సిపల్ మార్కెట్ వద్ద రోజూ జరిగే ఉత్పత్తుల వేలంపాట భారతదేశంలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్లలో ఒకటి.చాలా కాలం నుంచి ఇక్కడ పాడి పరిశ్రమ కుడా బాగా అభివృద్ధి చెందింది. పాల ఉత్పత్తుల సహకార సంఘం ఆద్వర్యంలో పాడి పరిశ్రమ కొనసాగుతోంది. అందులో మీగడ తీసిన పాల ఫౌడరు, జున్ను తయారీ చేస్తారు.స్థానిక వ్యవసాయ పరిశ్రమ యొక్క ఫలితంగా కొన్ని పరిశోధనా కేంద్రాలు అక్కడ నెలకొన్నాయి.ఆ సంస్థ్లల్లో మట్టి పరిరక్షణా కేంద్రం, పాడి పశువుల పెంపకం, బంగాళాదుంప పరిశోధనా కేంద్రాలకు సంబంధించి ఉన్నాయి.ఫ్లోరీ కల్చర్, సెరీ కల్చర్ విధానాలతో స్థానిక పంటల పరిధిని విస్తరించాలని, పుట్ట్టగొడుగుల పెంపకం పై ప్రయత్నాలు జరుగుతున్నాయి. హింధూస్థాన్ ఫోటో ఫిలింస్ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉంది.ఇది నగరం శివార్లలో హిందూనగర్ వద్ద ఉంది. రాబీస్ టీకాలను తయారుచేసే హ్యూమన్ బయోలాజికల్స్ సంస్థ ఊటీ సమీపంలో ఉన్న పుడుమండులో ఉంది.ఇతర తయారీ పరిశ్రమలు ఊటీ శివార్లలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి కెట్టీ (సూదల తయారీ సంస్థ, అరువంకాడు (కార్డైట్ తయారీ సంస్థ,, కూనూర్ (రాబీస్ టీకా తయారీ సంస్థ).చాక్లెట్, ఊరగాయ తయారీ, వడ్రంగి కుటీర పరిశ్రమలు ఉన్నాయి.అక్కడ తయారుచేసే చాక్లెట్లు పర్యాటకులకు, స్థానికులకు ప్రసిద్ధి చెందాయి.ఆ ప్రాంతం టీ సాగుకు పేరు మోసినా ఊటీలో టీ సాగు, దాని సంవిధానం చేయరు. టీ మరింత ఆర్థికంగా కొద్దిగా తక్కువ ఎత్తులో సాగుచేస్తారు.కూనూర్, కోటగిరి టీ సాగు, సంవిధానం యొక్క స్థానిక కేంద్రాలు.

పర్యాటకంసవరించు

చూడవలసిన ప్రదేశాలు

 • బొటానికల్ గార్డెన్సూ
 • దొడ్డబెట్ట శిఖరం
 • ఊటీ బోట్‌హౌస్
 • కాఫీ తోటలు
 • ఊటీ సరస్సు
 • రాతి గృహం
 • పర్వత రైలు మార్గం
 • సెయింట్ స్టీఫెంస్ చర్చి
 • మైనపు ప్రపంచం
 • గిరిజన మ్యూజియం
 • జింకల పార్కు
 • పైకారా సరస్సు
 • దేవదారు వనాలు
 • కామరాజు సాగర్ డ్యాం
 • ముడుమలయ్ జాతీయపార్కు
 • ముకుర్తి జాతీయపార్కు
 • ఎమరాల్డ్ సరస్సు
 • అవలాంచి సరస్సు
 • పోర్తిమండ్ సరస్సు
 • అప్పర్ భవాని సరస్సు

ప్రముఖులుసవరించు

సంస్థలుసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఊటీ&oldid=3149734" నుండి వెలికితీశారు