సర్సోం దా సాగ్
సర్సోం దా సాగ్ (హిందీ, ఉర్దూ భాషలలో "సర్సోం కా సాగ్") భారత దేశంలోని పంజాబ్ ప్రాంతంలోని శాకాహార వంటకం. ఇది పాకిస్తాన్ లోనూ ప్రసిద్ధమైనది. దీనిని ఆవాల ఆకుల నుండి తయారుచేస్తారు.
మూలము | |
---|---|
ప్రదేశం లేదా రాష్ట్రం | భారత ఉపఖండంలోని పంజాబీ ప్రాంతం |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | ముఖ్యాహారం |
ప్రధానపదార్థాలు | ఆవాల ఆకులు |
ఈ వంటకాన్ని సాంప్రదాయకంగా "మఖీ ది రోటీ" తో పాటు తింటారు.[1] దీనిపై బట్టరును గానీ, సాంప్రదాయకంగా నెయ్యిని గానీ రాసుకుని తింటారు.[2]
కావలసిన పదార్థాలు
మార్చు- ఆవ ఆకులు... పావు కేజీ
- పాలకూర... వంద గ్రా
- ఉల్లిపాయలు... 25 గ్రా.
- ముల్లంగి... రెండు
- వెల్లుల్లి... ఐదు రెబ్బలు
- అల్లం... చిన్న ముక్క
- పచ్చిమిర్చి... రెండు
- ఉప్పు... తగినంత
తయారీ విధానము
మార్చుఆవ ఆకులను, పాలకూరను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి, చల్లార్చి... మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి. అల్లం, వెల్లుల్లిపాయలను కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యి వేసి అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల పేస్టు వేసి దోరగా వేయించాలి. తరువాత ముందుగా ఉడికించి పేస్ట్ చేసుకున్న ఆవకూర మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి. చివర్లో పైన చెప్పుకున్న పోపు సామానులతో పోపుపెట్టి ఆవకూరకు కలపాలి. అంతే రుచికరమైన సర్సోం కా సాగ్ తయారైనట్లే...! ఇది రోటీలలోకి చాలా రుచిగా ఉంటుంది.[3]
మూలాలు
మార్చు- ↑ Laveesh Bhandari, Sumita Kale, "Indian states at a glance, 2008-09: Punjab : performance, facts and figures", Pearson Education India, 2009, ISBN 81-317-2345-3, section 4.7.2
- ↑ Jiggs Kalra, Pushpesh Pant, "Classic Cooking Of Punjab",tumhari aisi kitasi Allied Publishers, 2004, ISBN 81-7764-566-8, page 42.
- ↑ సార్సన్ కా సాగ్[permanent dead link]