సాలూరి వాసు రావు
సంగీత దర్శకుడు
సాలూరి వాసు రావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఇతడు ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి ఐదుగురు కుమారులలో మూడవ కుమారుడు.
సాలూరి వాసూరావు | |
---|---|
వృత్తి | సంగీత దర్శకుడు |
తండ్రి | సాలూరి రాజేశ్వరరావు |
జననం, విద్య, వివాహం
మార్చు- 25-01-1953 లో మద్రాస్‌లో జన్మించారు.
- భార్య రాగమంజరి, ఒక కుమారుడు ఒక కుమార్తె, కుమారుడు మునీష్ తమిళ్ సినిమాల్లో కథానాయకుడు. కుమార్తె మాధవి గాయని
సినిమాల్లో ప్రవేశం
మార్చువాసూరావు సినీ ప్రవేశం 17 ఏళ్ళ వయసులో 1970 ల్లో గిటారిస్ట్‌గా పిఠాపురం నాగేశ్వరరావు గారివద్ద మొదలైంది. తరువాత మాధవపెద్ది సత్యం గారి వద్ద నుండి బేస్ గిటారిస్ట్‌గా సినిమాల్లో పనిచేసారు. గిటారిస్ట్‌గా అనేకమంది తెలుగు ఇతర బాషా సంగీత దర్శకుల వద్ద పనిచేసిన ఆయన బాల సుబ్రహ్మణ్యంతో కలసి 500 సంగీత ప్రదర్శనలతో రికార్డ్ సృష్టించారు.
అవార్డులు
మార్చుసినిమాలు
మార్చు- పోలీస్ అల్లుడు (1994)
- పచ్చ తోరణం (1994)
- రైతుభారతం (1994)
- అన్నా చెల్లెలు (1993)
- హై హై నాయకా (1989)
- గోపాలరావు గారి అబ్బాయి (1989)
- పోలీస్ ఆఫీసర్ (1986)
ఇతర విశేషాలు
మార్చు- ఈయన ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు
- వాసూరావు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న అన్నమ్మయ్య ప్రాజెక్టులో భాగంగా అన్నమయ్య పాటలకు సంగీతం అందిస్తున్నారు. దీన్లో భాగంగా ఆయన అన్నమయ్య సంకీర్తనలు ఇప్పటి వరకు 1600 స్వరపరిచారు. 1601 నుంచి 1700 వరకు స్వరపర్చమని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు ఆయనకు నిర్దేశించింది. 2014, నుండి ఈ ప్రాజెక్టు ప్రారంభించారు
- సాలూరి లలిత సంగీతం' పేరుతో గీతాలను స్వరపరుస్తున్నారు.
బయటి లింకులు
మార్చు- ఐ.ఎమ్.డి.బి.లో వాసు రావు పేజీ.
- నా గురించి -http://vasuraosaluri.com/aboutme.html
- అవార్డ్స్ - http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/award-for-saluri-vasu-rao/article2787076.ece
- http://www.sakshi.com/news/devotion/seventh-cd-of-annamayya-keerthanas-released-by-vasurao-saluri-236562