సావిత్రి (సినిమా)
సావిత్రి 2016 లో వచ్చిన తెలుగు సినిమా. విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై పవన్ సాదినేని దర్శకత్వంలో డాక్టర్ వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మించాడు. ఇందులో నారా రోహిత్, నందిత ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ
మార్చుసావిత్రి ( నందిత ) కి తన చిన్ననాటి నుండే పెళ్ళి చేసుకోవాలనే పిచ్చి ఉండేది. నిజానికి, ఆమె తన బంధువుల పెళ్ళిలో జన్మించింది. ఆమె ఏకైక లక్ష్యం పెళ్ళే కావడంతో, తగిన వరుడిని వెతికేందుకు ఆమె తన కుటుంబాన్ని ఒప్పించింది. సావిత్రిని రిషి ( నారా రోహిత్ ) కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని ఆమె కుటుంబం నిర్ణయించుకుంటుంది. ఈ సంగతి వాళ్ళిద్దరికీ తెలియదు. షిరిడికి వెళ్ళేటప్పుడు, సావిత్రి, రిషీ కలుస్తారు. ఆమె ఆసక్తి చూపకపోయినా అతడు మాత్రం తక్షణమే ఆమెతో ప్రేమలో పడతాడు. కొన్ని పరిస్థితుల కారణంగా, ఇద్దరూ రైలు మిస్సౌతారు. రైలును పట్టుకోడానికి వాళ్ళిద్దరూ కలిసి చేసే ప్రయాణంలో, రిషి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, తాను ఇప్పుడు ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నందున వారు ఎంచుకున్న అమ్మాయితో పెళ్ళి చేసుకోనని చెబుతాడు. పెళ్ళి చేసుకోబోయేది సావిత్రినేనని ఆ తరువాత రిషికి తెలుస్తుంది. ఈ పెళ్ళికి అంగీకరించని సావిత్రి తండ్రికి తాను చేసిన తప్పును వివరిస్తాడు. రిషి వాళ్ల గ్రామంలో ఒక నెల పాటు ఉండి సావిత్రి కుటుంబాన్నంతా ఒప్పించి తన ప్రేమను గెలుచుకుంటాడు.
నటులు
మార్చుపాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అనగనగా" | కృష్ణ చైతన్య | శ్రావణ్ | 3:35 |
2. | "ఫ్లై లైక్ ఎ బర్డ్" | కృష్ణ చైతన్య | యజీన్ నజీర్ | 3:26 |
3. | "పిల్లో ఓ పిల్లో" | కృష్ణ చైతన్య | హేమచంద్ర, లలితా కావ్య | 4.06 |
4. | "తీన్‌మార్" | కృష్ణ చైతన్య | నారా రోహిత్ | 3:15 |
5. | "చిత్రమైనది" | కృష్ణ చైతన్య | చిత్ర, సాయి చరణ్ | 4:02 |
6. | "సావిత్రి" | బాలాజీ | సాయికృష్ణ | 2:11 |
7. | "పిల్లో ఓ పిల్లో" | కిట్టు విస్సాప్రగడ | హేమచంద్ర | 3:36 |
మొత్తం నిడివి: | 24:11 |