సావ్జీ ధోలాకియా
సావ్జీ ధంజీ ధోలాకియా (జననం 12 ఏప్రిల్ 1962) ఒక భారతీయ వ్యాపారవేత్త. వజ్రాల తయారీ, ఎగుమతి సంస్థ అయిన హరి కృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్. ఆయనకు 2022లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
సావ్జీభాయ్ ధంజీభాయ్ ధోలాకియా | |
---|---|
జననం | దుధలా గ్రామం,అమ్రేలి జిల్లా, గుజరాత్, భారతదేశం | 1962 ఏప్రిల్ 12
వృత్తి | హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకుడు |
నికర విలువ | 38 బిలియన్ అమెరికన్ డాలర్లు |
జీవిత భాగస్వామి | గౌరిబెన్ ధోలాకియా |
పిల్లలు | మేన, నిమిష, ద్రవ్య |
జీవిత చరిత్ర
మార్చుసావ్జీ ధోలాకియా గుజరాత్ లోని అమ్రేలీ జిల్లా దుధలాలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. అతను 4వ తరగతి వరకు చదువుకున్నాడు, 13 సంవత్సరాల వయస్సులో మానేశాడు. సూరత్ లో తన పినతండ్రి వజ్రాల వ్యాపారంలో చేరాడు. తరువాత అతని సోదరులు హిమ్మత్, తులసి కూడా అతనితో చేరారు. వారు 1984 లో వజ్రాల వ్యాపారాన్ని స్థాపించారు. వారి చిన్న సోదరుడు ఘనశ్యామ్ వారితో కలిసి 1992లో ముంబైలో వజ్రాల ఎగుమతి కార్యాలయాన్ని ప్రారంభించాడు. కంపెనీ 2014 నాటికి 6500 మంది ఉద్యోగులతో పెరిగి ప్రధాన వజ్రాల ఎగుమతి సంస్థగా మారింది.[1]
అతని నికర విలువ 2017 లో 38 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. [2]
తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పట్ల ఆయన వైఖరి విభిన్నంగా ఉండటంతో పలు మార్లు వార్తల్లో నిలిచాడు. 2014 లో తమ సంస్థ అభివృద్ధిలో పాలు పంచుకున్నందుకు గాను 491 మందికి కార్లు, 207 మందికి ఇళ్ళు కొనుగోలు చేయడానికి సహాయం, 570 మందికి నగలు బోనసుగా అందించాడు.[1]
అవార్డులు
మార్చు- పద్మశ్రీ పురస్కారం (2022)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Damor, Vinay Umarji nbsp;nbsp; Kalpesh (2014-10-23). "Newsmaker: Savji Dholakia". Business Standard India. Retrieved 2022-02-09.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Savji Dholakia to receive Padma Shri award; here's all you need to know about Surat-based diamantaire". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-02-09.