వనపర్తి శాసనసభ నియోజకవర్గం

ఇది వనపర్తి జిల్లాకు చెందిన శాసనసభ నియోజకవరం. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి గోపాల్‌పేట మండలం, ఆలంపూర్ నియోజకవర్గం నుంచి పెబ్బేరు మండలాలు కొత్తగా ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గతంలో పాక్షికంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర మండలాలు కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నియోజకవర్గంకు తరలించారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లెల చిన్నారెడ్డి గెలుపొందినాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రముఖస్థానం సంపాదించిన సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు.[1][2]

వనపర్తి
—  శాసనసభ నియోజకవర్గం  —
వనపర్తి is located in Telangana
వనపర్తి
వనపర్తి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు
వనపర్తి రాజ భవనం

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

మార్చు

నియోజకవర్గపు గణాంకాలు

మార్చు
  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,75,329.
  • ఓటర్ల సంఖ్య (2008 ఆగస్టు నాటికి): 2,36,695.[3]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 21.64%, 0.43%.

నియోజకవర్గ భౌగోళిక సమాచారం

మార్చు

భౌగోళికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యగా ఉన్న ఈ నియోజకవర్గం తూర్పున నాగర్‌కర్నూల్ నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గాలతో సరిహద్దును కలిగి ఉండగా, పశ్చిమాన, ఉత్తరాన దేవరకద్ర నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. దక్షిణాన కొంతభాగం ఆలంపూర్ నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. నియోజకవర్గంలోని పెద్దమండలి మండలంలోని కొంతభాగం, పెబ్బేరు మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నది.

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు:[4][5]
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 సురవరం ప్రతాపరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1952 (ఉ.ఎ) ఎం.ఆర్.రెడ్డి పి.ఎస్.పి జయరామ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 పద్మనాభరెడ్డి[6] భారత జాతీయ కాంగ్రెస్ ఏకగ్రీవ ఎన్నిక
1962 జానంపల్లి కుముదినీ దేవి[7] భారత జాతీయ కాంగ్రెస్ జి.ఎస్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1967 జానంపల్లి కుముదినీ దేవి భారత జాతీయ కాంగ్రెస్ ఎం.జగన్నాథరెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1972 అయ్యప్ప భారత జాతీయ కాంగ్రెస్ ఏ.బాలకృష్ణయ్య స్వతంత్ర అభ్యర్థి
1978 జయరాములు ఇందిరా కాంగ్రెస్ ఏ.బాలకృష్ణయ్య జనతా పార్టీ
1983 ఏ.బాలకృష్ణయ్య తెలుగుదేశం పార్టీ జయరాములు కాంగ్రెస్
1985 ఏ.బాలకృష్ణయ్య తెలుగుదేశం పార్టీ జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్
1989 జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ.బాలకృష్ణయ్య తెలుగుదేశం పార్టీ
1994 రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ కందూర్ లావణ్య తెలుగుదేశం పార్టీ
2009 రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తె.రా.స
2018 సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తె.రా.స జిల్లెల చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[8] తుడి మేఘా రెడ్డి కాంగ్రెస్ పార్టీ సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి

1999 ఎన్నికలు

మార్చు

1999లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.చిన్నారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ రెడ్డిపై 3353 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చిన్నారెడ్డికి 65286 ఓట్లు రాగా, రావుల చంద్రశేఖర్ రెడ్డి 61933 ఓట్లు సాధించాడు.

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.చిన్నారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందూర్ లావణ్యపై 3975 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చిన్నారెడ్డి 64239 ఓట్లు సాధించగా, లావణ్యకు 60264 ఓట్లు లభించాయి. మొత్తం 5 గురు అభ్యర్థులు పోటీచేయగా ప్రధానపోటీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే కొనసాగింది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు కలిపి మొత్తం పోలైన ఓట్లలో 95.9% ఓట్లు సాధించారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థితో సహా మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
129830
జి.చిన్నారెడ్డి
  
49.48%
కందూ లావణ్య
  
46.42%
ఇతరులు
  
4.1%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 జి.చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ 64239
2 కందూర్ లావణ్య తెలుగుదేశం పార్టీ 60264
3 సత్యంసాగర్ బహుజన్ సమాజ్ పార్టీ 2792
4 పి.విష్ణువర్థన్ రెడ్డి ఇండిపెండెంట్ 1454
5 జింకల కృష్ణయ్య ఇండిపెండెంట్ 1081

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మంత్రి జి.జిన్నారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు.[9] భారతీయ జనతా పార్టీ తరఫున సబ్బిరెడ్డి వెంకటరెడ్డి పోటీలో ఉన్నాడు.[10] ప్రజారాజ్యం నుండి భూపేష్ ముదిరాజ్[11], లోక్‌సత్తా తరఫున ప్రవీణ్ కుమార్‌లు[12] పోటీపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్.చంద్రశేఖర్ రెడ్డి పోటీలో ఉన్నాడు.

నియోజకవర్గ ప్రముఖులు

మార్చు
జి.చిన్నారెడ్డి
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన జి.చిన్నారెడ్డి మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. వ్యవసాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన చిన్నారెడ్డి గతంలో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మెన్‌గాను, ఆంధ్రప్రదేశ్ ఎలక్త్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మెన్‌గాను వ్యవహరించాడు. 1985లో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టి చిన్నారెడ్డి పరాజయం పొందగా, ఆ తరువాత 1989లో విజయం సాధించాడు. 1999, 2004లలో వరస విజయాలు సాధించాడు. 2009 ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిననూ[13] రావుల చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయాడు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 12, తేది 11-09-2008.
  2. Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  4. Eenadu (31 October 2023). "భిన్న ఫలితాల వనపర్తి". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
  5. Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  6. Sakshi (26 October 2023). "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  7. Eenadu (29 October 2023). "శాసన సభలో అతివల కేతనం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  8. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  9. సూర్య దినపత్రిక, తేది 22-03-2009
  10. సూర్య దినపత్రిక, తేది 18-03-2009
  11. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  12. ఈనాడు దినపత్రిక, తేది 22-03-200
  13. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 22-03-2009