సింధు భైరవి

కె. బాలచందర్ దర్శకత్వంలో 1985లో విడుదలైన తమిళ సినిమా

సింధు భైరవి, 1985 నవంబరు 11న విడుదలైన తమిళ సినిమా. కె. బాలచందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో శివకుమార్, సుహాసిని, సులక్షణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం స్వరపరిచాడు. ఈ సినిమాలోని పాటలను కె. జె. ఏసుదాసు, కె. ఎస్. చిత్ర పాడారు. విమర్శకుల నుండి సానుకూల సమీక్షలు వచ్చాయి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.[1] ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి, జాతీయ ఉత్తమ సంగీత దర్శకత్వం, జాతీయ ఉత్తమ నేపథ్య గాయని విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా సీక్వెల్ బాలచందర్ నిర్మించిన సహానా అనే టెలివిజన్ సిరీస్ ఫార్మాట్‌లో ఉంది.[2] తెలుగులో కూడా ఇదే పేరుతో విడుదలయింది.

సింధు భైరవి
Sindhu Bhairavi Movie Poster.jpg
సింధు భైరవి సినిమా పోస్టర్
దర్శకత్వంకె. బాలచందర్
కథా రచయితకె. బాలచందర్
నిర్మాతరాజం బాలచందర్
పుష్ప కందస్వామి
తారాగణంశివకుమార్
సుహాసిని
సులక్షణ
ఛాయాగ్రహణంఆర్. రఘునాథ రెడ్డి
కూర్పుగణేష్-కుమార్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
కవితలయ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1985 నవంబరు 11 (1985-11-11)
సినిమా నిడివి
159 నిముషాలు
దేశంభారతదేశం
భాషతమిళం

నటవర్గంసవరించు

 • శివకుమార్ (జె.కె. బాలగణపతి)
 • సుహాసిని (సింధు)
 • సులక్షణ (భైరవి)
 • ఢిల్లీ గణేష్ (గురుమూర్తి)
 • జనగరాజ్ (గజపతి)
 • ప్రతాప్ పోతన్ (సంజీవి)
 • టి.ఎస్. రాఘవేంద్ర (న్యాయమూర్తి భారతి కన్నన్)
 • మణిమాల (సింధు తల్లి)
 • చార్లే (రామానుజం)
 • కవితలయ కృష్ణన్ (భారతి కన్నన్ డ్రైవర్‌)
 • ఆర్. సుందరమూర్తి (జెకెబి డ్రైవర్‌)

పాటలుసవరించు

ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు.[3] నేపథ్య గాయని కె.ఎస్. చిత్రకు మంచి పేరు వచ్చింది.[4] పాడలేను పల్లవైన భాషరాని దానను అనే పాట తమిళ మాతృకకు మొదటి జాతీయ అవార్డు వచ్చింది. ఇళయరాజాకు ఉత్తమ సంగీత దర్శకత్వం కోసం జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది.[5][6][7]

అవార్డులుసవరించు

1986 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలుసవరించు

 1. Dhananjayan 2014, p. 286.
 2. Warrier, Shobha (6 March 2003). "Sindhu Bhairavi is back". Rediff.com. Retrieved 5 August 2021.
 3. "Sindhu Bhairavi". Kavithalayaa. Retrieved 5 August 2021.
 4. Dhananjayan 2014, p. 287.
 5. Mani, Charulatha (10 May 2013). "Light and melodious". The Hindu. Retrieved 5 August 2021.
 6. Saravanan, T. (20 September 2013). "Ragas hit a high". The Hindu. Retrieved 5 August 2021.
 7. Mani, Charulatha (14 October 2011). "A Raga's Journey: Kinetic Kalyani". The Hindu. Retrieved 5 August 2021.

బయటి లింకులుసవరించు