సిఎన్ఎన్ (పూర్తి పేరు కేబుల్ న్యూస్ నెట్వర్క్) అన్నది అమెరికన్ బేసిక్ కేబుల్, శాటిలైట్ టెలివిజన్ ఛానల్, టైమ్ వార్నర్ వారి టర్నర్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ డివిజన్ వారి యాజమాన్యంలో ఉంది.[1] దాన్ని 1980లో అమెరికన్ మీడియా అధినేత టెడ్ టర్నర్ 24 గంటల కేబుల్ వార్తా ఛానెల్ గా ప్రారంభించారు;[2][3] ఐతే ఏప్రిల్ 2016 నాటికే సిఎన్ఎన్ ఎగ్జిక్యూటివ్ అధికారికంగా ఇక ఏ మాత్రం టీవీ న్యూస్ నెట్వర్క్ కాదనీ, ఒక 24 గంటల గ్లోబల్ మల్టీ ప్లాట్ ఫాం నెట్వర్క్ అని అభివర్ణించారు.[4] సిఎన్ఎన్ 24 గంటల వార్తా ప్రసారాలను అందించే తొలి న్యూస్ ఛానెల్ గా,[5] యునైటెడ్ స్టేట్స్ లో పూర్తిస్థాయి వార్తా ఛానెళ్లలో మొదటిదానిగా నిలిచింది.[6]

దీనికి అనేక సోదర ఛానెళ్ళు ఉన్నా, సిఎన్ఎన్ ప్రాథమికంగా న్యూయార్క్ నగరంలోని టైమ్ వార్నర్ సెంటర్, వాషింగ్టన్ డి.సి., లాస్ ఏంజలెస్ నగరాల్లోని స్టూడియోల నుంచి ప్రసారమవుతుంది. అట్లాంటాలోని సిఎన్ఎన్ సెంటర్లో దాని ప్రధాన కార్యాలయాన్ని వారాంతపు కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు. దాని అంతర్జాతీయ వ్యాప్త సోదర ఛానెల్ అయిన సిఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌ నుంచి అమెరికన్‌ ఛానెల్‌ని విడిగా చూపడానికి సిఎన్‌ఎన్‌ని కొన్నిసార్లు సిఎన్ఎన్/యు.ఎస్. (లేదా సిఎన్‌ఎన్‌ డొమెస్టిక్) అని పిలుస్తూంటారు.[7] 2010 ఆగస్టు నాటికి సిఎన్ఎన్ దాదాపు 10 కోట్ల అమెరికన్ ఇళ్ళలో చూస్తూంటారు.[8] 8.9 లక్షల అమెరికన్ హోటల్ రూముల్లోనూ, కెనడాలోని శాటిలైట్, కేబుల్ ప్రొవైడర్లలోనూ సిఎన్ఎన్ విస్తరించివుంది. సిఎన్ఎన్ ప్రోగ్రాములు సిఎన్ఎన్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 212 దేశాలు, ప్రాంతాల్లో ప్రదర్శించారు.[9]

ఫిబ్రవరి 2015 నాటికి సిఎన్ఎన్ అమెరికాలో 9.62 కోట్ల గృహ టెలివిజన్ సెట్లలో (వీటిలో 82.7 టెలివిజన్ సెట్లు ఇంటికి ఒకటి చొప్పున ఉన్నవి) సిఎన్ఎన్ ప్రదర్శితమౌతోంది.[10]

చరిత్ర

మార్చు

తొలినాళ్ళ చరిత్ర

మార్చు

కేబుల్ న్యూస్ నెట్వర్క్ 1980 జూన్ 1న సాయంత్రం ఈస్టర్న్ టైంజోన్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. టెడ్ టర్నర్ పరిచయం చేసిన తర్వాత డేవిడ్ వాకర్, లూయీస్ హర్ట్ దంపతులు ఛానెల్ మొదటి వార్తా కార్యక్రమానికి యాంకరింగ్ చేశారు.[11] సిఎన్ఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ బర్ట్ రైన్ హార్ట్ ప్రారంభం సమయంలోనే నెట్వర్క్ మొదటి న్యూస్ యాంకర్ బెర్నార్డ్ షా సహా ఛానెల్ తొలి 200 మంది ఉద్యోగులను ఉద్యోగంలోకి తీసుకున్నారు.[12]

ప్రారంభం నుంచి సిఎన్ఎన్ కేబుల్, శాటిలైట్ టీవీ ప్రొవైడర్లు, వెబ్సైట్లు, ప్రత్యేకించిన క్లోజ్-సర్క్యూట్ ఛానెళ్ళు (సిఎన్ఎన్ ఎయిర్ పోర్ట్ వంటివి) వంటివాటికి విస్తరిస్తూనే ఉంది. కంపెనీకి 36 బ్యూరోలు (10 డొమెస్టిక్, 26 ఇంటర్నేషనల్), 900కి పైగా అనుబంధ స్థానిక స్టేషన్లు, అనేక స్థానిక, విదేశీ భాషల నెట్వర్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఛానెల్ విజయం వల్ల స్థాపకుడు టెడ్ టర్నర్ ను విశ్వసనీయ మీడియా మొఘల్ గా నిలిపింది, 1996లో టర్నర్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టంను టైమ్ వార్నర్ విలీనం చేసేందుకు వేదిక ఏర్పరిచింది.

సిఎన్ఎన్2 అనే అనుబంధ ఛానెల్ జనవరి 1, 1982లో వ్యవస్థాపించారు, 24 గంటల పాటు ప్రతీ 30 నిమిషాలకు వార్తా ప్రసారాలయ్యేలా నిరంతర ప్రసారాలు కొనసాగించారు. ఆ ఛానెల్ తర్వాత సిఎన్ఎన్ హెడ్లైన్ న్యూస్ గా పేరు మార్చారు, తర్వాత ఇప్పుడు హెచ్ఎల్ఎన్ గా పెట్టి ప్రస్తుతం ప్రత్యక్ష వార్తా ప్రసారాలపై దృష్టిపెడుతూ, ప్రైమ్ టైంలోనూ, సాయంత్రాలూ ప్రముఖ వ్యక్తిత్వాలను ఆధారం చేసుకున్న కార్యక్రమాలను అందిస్తూ కొనసాగుతోంది.

ప్రధాన ఘటనలు

మార్చు
 
సిఎన్ఎన్ సెంటర్లో న్యూస్ రూం ప్రతిరూపం.

ఛాలెంజర్ దుర్ఘటన

మార్చు

1986 జనవరి 28న సిఎన్ఎన్ లైవ్ కవరేజిని ప్రారంభించి నడిపిస్తున్న ఒకేఒక ఛానెల్, స్పేస్ షటిల్ ఛాలెంజర్ కుప్పకూలిపోవడంతో ఏడుగురు సిబ్బంది మరణించారు.

బేబి జెస్సికాను కాపాడడం

మార్చు

1987 అక్టోబర్ 14న జెస్సికా మెక్ క్లార్ అనే 18 నెలల పాప టెక్సాస్లోని మిడ్లాండ్లో ఓ బావిలో పడిపోయింది. సిఎన్ఎన్ వేగంగా ఈ కథనాన్ని నివేదించింది, ఇది విస్తృత ప్రచారం పొందడానికి, పాపను కాపాడడానికి కథనం ఉపకరించింది. న్యూయార్క్ టైమ్స్ 1995లో జరిగినదాన్ని పునర్విచారిస్తూ లైవ్ వీడియో వార్తల ప్రభావాన్ని గురించి వార్త ప్రచురించింది:

గల్ఫ్ యుద్ధం

మార్చు

మొదటి పర్షియన్ గల్ఫ్ యుద్ధం సిఎన్ఎన్ ఛానెల్ చరిత్రని మలుపుతిప్పిన ఘటనగా నిలుస్తూ అప్పటి మూడు పెద్ద టీవీ నెట్వర్కులను దాటి మొదటి స్థానానికి దూసుకుపోయింది. ఇరాక్ భూభాగం నుంచి బాగ్దాద్ లోని అల్-రషీద్ హోటల్ నుంచి సిఎన్ఎన్ విలేకరులు బెర్నార్డ్ షా, జాన్ హాలిమన్, పీటర్ ఆర్నెట్ ప్రసారాలు అందించారు. అలా ఇరాక్ భూభాగం నుంచి నేరుగా ప్రసారాలు చేసిన ఏకైక ఛానెల్ గా సిఎన్ఎన్ నిలిచి ఇతర నెట్వర్క్ లను దాటుకుపోయింది.

1991 జనవరి 16న బాంబు దాడులు ప్రారంభం అయిన నిమిషం నుంచే ఆ విషయాన్ని బెర్నార్డ్ షా ఇలా ప్రకటించారు:[13]

ప్రారంభమైన వెనువెంటనే బాగ్దాద్ నుంచి ప్రత్యక్ష చిత్రాలను ప్రసారం చేయలేకపోవడంతో గల్ఫ్ యుద్ధపు తొలి కొద్ది గంటల పాటు సిఎన్ఎన్ కవరేజీ రేడియో ప్రసారాలేమో అన్న నాటకీయ అనుభూతి కలిగిచింది, లెజండరీ సిబిఎస్ వార్తల యాంకర్ ఎడ్వర్డ్ ఆర్.ముర్రో రెండవ ప్రపంచ యుద్ధంలో లండన్ పై జర్మన్ బాంబుదాడులను ఆసక్తికరమైన వార్తల కవరేజి ద్వారా తెలియజేసిన సందర్భంతో పోల్చారు. ప్రత్యక్ష సంఘటనల దృశ్యాలు, బొమ్మలు లేకపోయినా సిఎన్ఎన్ టెలివిజన్ స్టేషన్లు, నెట్వర్కులతో ప్రపంచవ్యాప్తంగా ప్రసారాలు చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది సిఎన్ఎన్ ని వీక్షించారు – ఈ సందర్భం సిఎన్ఎన్ ఇంటర్నేషనల్ ఏర్పాటుకు కారణమైంది.

మూలాలు

మార్చు
  1. Time Warner: Turner Broadcasting Archived జనవరి 22, 2011 at the Wayback Machine
  2. "Mean Dted - My WordPress Blog". Archived from the original on 2008-05-13. Retrieved December 30, 2016.
  3. "Charles Bierbauer, CNN senior Washington correspondent, discusses his 19-year career at CNN. (May 8, 2000)". Cnn.com. Archived from the original on 2012-09-29. Retrieved October 12, 2013.
  4. "For CNN, Platform Publishing Now In DNA". NetNewsCheck.com. Retrieved 2016-04-27.[permanent dead link]
  5. "CNN changed news – for better and worse". Taipei Times. May 31, 2005. Retrieved January 24, 2009.
  6. Kiesewetter, John (May 28, 2000). "In 20 years, CNN has changed the way we view the news". Cincinnati Enquirer. Retrieved January 24, 2009.
  7. "CNN Show Pages".
  8. "This date in deal history: CNN begins broadcasting". Deal Magazine. May 31, 2006. Archived from the original on 2009-06-24. Retrieved 2010-09-23.
  9. "CNN is Viewers Cable Network of Choice for Democratic and Republican National Convention Coverage". Timewarner.com. August 18, 2000. Retrieved February 20, 2010.[permanent dead link]
  10. Seidman, Robert (February 22, 2015). "List of how many homes each cable network is in as of February 2015". TV by the Numbers. Zap2it. Archived from the original on 2015-12-29. Retrieved March 10, 2015.
  11. Barkin, Steve Michael; Sharpe, M.E. (2003). American Television News: The Media Marketplace and the Public Interest.
  12. Wiseman, Lauren (May 10, 2011). "Burt Reinhardt dies at 91: Newsman helped launch CNN". The Washington Post. Retrieved May 19, 2011.
  13. "The Gulf War and its Consequences". Yale.edu. 1996. Retrieved October 12, 2013.