సిక్కు పండుగల జాబితా
10మంది సిక్కు గురువుల ఆదేశానుసారం సిక్కులు పండుగలు జరుపుకుంటుంటారు. వైశాఖి, దీపావళి వంటి హిందూ పండుగలు కూడా జరుపుకుంటారు సిక్కులు.
సిక్కు పండుగలు
పండుగ | తేదీ/తిధి (ప్రతీ సంవత్సరం తిధుల బట్టీ మారతాయి) | వివరణ |
---|---|---|
మాఘీ | జనవరి 14 | ముక్త్ సర్ యుద్ధానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీ గురు అమర్ దాస్ జీ ఆదేశానుసారం ఈ పండుగను సిక్కులు గురుద్వారాలో జరుపుకుంటారు. |
ప్రకాశ్ ఉత్సవ్ దాస్వే పాట్షా | జనవరి 31 | పదవ సిక్కు గురువు గురుగోబింద్ సింగ్ జన్మదినోత్సవ వేడుకలుగా ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ సిక్కులకు చాలా ముఖ్యమైనది. 10వ దైవ కిరణప్రసరణ అని ఈ పేరుకు అర్ధం. |
హొల్లా మొహల్లా | మార్చి 17 | ఆనంద్ పూర్ సాహిబ్ ప్రాంతంలో ఈ పండుగ సంవత్సరానికొసారి జరుపుకుంటారు. సిక్కులకు యుద్ధకళలు, ఆత్మరక్షణ నేర్పేందుకు గురుగోబింద్ సింగ్ మొదలుపెట్టిన ఉత్సవం ఇది. ఈ ఉత్సవంలో కత్తి యుద్ధ ప్రదర్శనలు, గుర్రపు స్వారీ పందాలు చేస్తుంటారు. ఈ పోటీలను ఒక ప్రసిద్ధ కిర్తనతో ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సిక్కులు ఈ పండుగను 'సిక్కు ఒలంపిక్స్ ' గా భావించి జరుపుకుంటారు. సిక్కుల్లోని నిహాంగ్ శాఖ వారు ఎక్కువగా ఈ పండుగ చేసుకుంటారు. |
వైశాఖి | ఏప్రిల్ 13 | పంజాబ్ లోని ఖల్సా పంత్ పుట్టిన ఆనంద్ పూర్ సాహిబ్ ప్రాంతంలో జరుపుకుంటారు. కేశ్ గర్ సాహిబ్ ప్రాంతంలో కూడా చేసుకుంటారు. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లోని సిక్కులు ఈ పండుగ రోజున ఒక చోట కలుస్తారు. దీనినే మేళా అని కూడా అంటారు. గురు గ్రంధ్ సాహిబ్ ఉన్న గురుద్వారాలో ముఖ్యంగా జరుపుకుంటారు.[1] |
గురు అర్జున్ సంస్మరణ దినోత్సవం | జూన్ 16 | ఐదవ సిక్కు గురువు గురు అర్జున్ నిర్వాణ దినోత్సవం ఈ పండుగ. గురు అర్జున్ ను మొఘల్ చక్రవర్తి జహంగీర్ హింసించి చంపిన దినం ఇది. ఆయన సంస్మరణార్ధం ఈ రోజున సిక్కులు గురుద్వారాకు వెళ్ళి కీర్తనలు, భజనలు చేస్తారు. వేసవి కాలంలో వచ్చే ఈ పండుగకు గురుద్వారాకు వచ్చిన భక్తులకు పాలు, పంచదారతో తయారు చేసే చల్లటి పానీయాన్ని మతాలకతీతంగా ప్రసాదంలా పంచిపెడతారు. |
ఫలియా ప్రకాశ్ శ్రీ గురు గ్రంధ్ సాహిబ్ జీ | సెప్టెంబరు 1 | , ఆఖరి సిక్కు గురువు సిక్కులకు ప్రసాదించిన గురు గ్రంధ్ సాహిబ్ గ్రంథ దినోత్సవం. మానవ గురువుల పరంపర ఇక్కడితో ముగుసింది. ఆ తరువాత నుంచీ ఈ గురు గ్రంధ్ సాహిబే గురువుగా నిలిచింది. |
బండీ చోర్ దివస్ (దీపావళి) | నవంబరు 9 | ఈ పండుగ పేరుకు అర్ధం స్వేచ్ఛా పండుగ. 52మంది హిందూ రాజులను కాపాడినందుకు మొఘల్ చక్రవర్తి జహింగీర్ సిక్కుల 6వ గురువు గురు హరిగోబింద్ ను గ్వాలియర్ కోటలో బంధించారు. 1619న ఈ రోజునే ఆయన విడుదల అయ్యారు. అందుకే వారు ఈ రోజున ఇంట్లో దీపాలు వెలిగించి, టపాసులతో పండుగ చేసుకుంటారు సిక్కులు. అలాగే గురుద్వారాకు వెళ్ళి గుర్బానీ వింటారు. |
గురు నానక్ గుర్పుర్బ్ | నవంబరు 22 | ఇప్పటి పాకిస్థాన్ లో ఉన్న నానాకనా ప్రాంతంలో గురు నానక్ పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం ఈరోజున సిక్కులందరూ ఒకచోట కలుసుకుని, గురుద్వారాకు దీపాలంకణ చేసి, గురు గ్రంథ సాహిబ్ ను 48గంటల పాటు నిర్విరామంగా పారాయణ చేస్తారు. ఈ పండుగ వరుసగా మూడు రోజులపాటు జరుగుతాయి. |
గురు తేగ్ బహద్దూర్ సంస్మరణ దినోత్సవం | నవంబరు 22 | ఇస్లాంలోకి మతం మారడానికి ఒప్పుకోని కారణంగా ఈ రోజున గురు తేగ్ బహద్దూర్ ను చంపేశారు. On this day Guru Tegh Bahadur was martyred when he refused to convert to Islam.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని నిర్ణయించుకుని ముందుగా కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసి, వారిని కాశ్మీర్ నుండి తరిమేశారు.[2][3] కొంతమంది కాశ్మీరి పండిట్లు గురు తేగ్ బహద్దూర్ ను కలసి అయన సహాయం కోరగా, గురు తేగ్ ఇస్లాంలోకి మారితే మేమూ మారతమని మొఘల్ అధికారులతో చెప్పమని ఆయన సలహా ఇచ్చారు.[2][3] జులై 1675లో గురువును ఆనంద్ పూర్ సాహిబ్ దగ్గరలోని మాలిక్ పూర్ ప్రాంతంలో బంధించి, ఇస్లాంలోకి మారమని హింసించారు. గురు తేగ్ నిరాకరించడంతో నవంబరులో ఆయనను మొఘల్ అధికారులు చంపేశారు. హిందూ మతాన్ని కాపాడటానికి ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు సిక్కులు. |
వేరే సిక్కు పండుగలు
మార్చుపైన జాబితాలో లేని కొన్ని ఇతర పండుగలు కూడా సిక్కులకు ఉన్నాయి. దాదాపుగా 45 ఇతర చిన్న పండుగలు కూడా ఉంటాయి సిక్కులకు. వీటిని చాలా వరకు కొన్ని చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో జరుపుకుంటారు. 8 సిక్కు గురువుల జన్మదినోత్సవాలు ప్రకాశ్ ఉత్సవ్ లుగా, గురుత్వ బాధ్యతల తరలింపు దినోత్సవాలను గుర్గడి దివస్ లుగా, సిక్కు గురువుల నిర్వాణ దినాలను జ్యోతిజోత్ దివస్ లుగా నిర్వహించుకుంటారు సిక్కులు. శ్రీ గురు హరిగోబింద్ జీ పుట్టిన వడాలీ గ్రామంలోని చెహర్తా సాహిబ్ గురుద్వారా మందిరంలో బసంత్ పండుగ చేసుకుంటారు. ఇది పతంగుల పండుగ. ఈ ప్రదేశంలో గురూజీ జన్మదినం వంటి పండుగలు కూడా చేసుకుంటారు.[4] అన్ని పండుగలకూ సిక్కులు గురుద్వారకు వెళ్ళి, గురుగ్రంథ సాహిబ్ పఠనం, గుర్బానీ, కీర్తనలు పాత్ లు పాడుతూ గడుపుతుంటారు.
కొన్ని చారిత్రిక పండుగలు, జాతరలు కూడా జరుపుకుంటారు. ఈ జాతరలకు వేలాదిగా జనం వస్తుంటారు. ఇవి దాదాపుగా 2 నుంచి 3 రోజులు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి:
- ఫతేగర్ సాహిబ్ ప్రాంతంలో గురుగోబింద్ సింగ్ యొక్క చిన్న సహిబ్జదాల నిర్వాణానికి సూచనగా వారి పేరు మీద జాతర.
- చంకుర్ యుద్ధంలో గురుగోబింద్ సింగ్ యొక్క పెద్ద సహిబ్జదాల వీరమరణానికి సూచనగా ఆ ప్రాంతంలో నిర్వహిస్తారు.
- ముక్త్ సర్ లో మొఘల్ రాజులతో చేసిన యుద్ధంలో వీరమరణం పొందిన గురుగోబింద్ సింగ్ యొక్క 40 మంది అనుచరుల సంస్మరణగా శ్రీ ముక్త్ సర్ సాహిబ్ పట్టణంలో ఉత్సవం జరుపుకుంటారు సిక్కులు.
References
మార్చు- ↑ "Sikhism holy days: Baisakhi". BBC. Retrieved 2007-07-08.
- ↑ 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-10-09. Retrieved 2016-07-06.
- ↑ 3.0 3.1 Surinder Singh Kohli. 1993. The Sikh and Sikhism. P.78-89
- ↑ Johar, Surinder Singh Holy Sikh Shrines