సిగ్రిడ్ అండ్సెట్

సిగ్రిడ్ అండ్సెట్ (1882 మే 20 - 1949 జూన్ 10) ఒక నార్వేజియన్ నవలా రచయిత్రి. ఆమె 1928లో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నది.[2] అండ్సెట్ డెన్మార్క్ దేశంలోని కలుంద్బొర్గ్ నగరంలో జన్మించింది. తరువాత ఆమెకు రెండు సంవత్సరాల వయసులో వారి కుటుంబం నార్వేకు వలసవెళ్ళింది. తరువాత ఆమె కాథలిక్‌గా మార్పిడి చెందింది. ఆమె జర్మనీ నార్వే మీద దండయాత్ర చేసిన సమయంలో జర్మనీకి వ్యతిరేకంగా పనిచేసిన కారణంగా జర్మనీ నార్వేను స్వాధీనం చేసుకున్న తరువాతా ఆమె 1940 లో నార్వే నుండి యునైటెడ్ స్టేట్స్‌కు పారిపోయింది. 1945లో ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత ఆమె తిరిగి నార్వేకు చేరుకుంది. " క్రిస్టిన్ లవ్రంస్దట్టర్ " ఆమె ఉత్తమ రచనగా గుర్తించబడింది. మద్యయుగంలో స్కాండినేవియాలో జీవితచిత్రణ స్త్రీకోణంలో పుట్టుక నుండి మరణం వరకు వర్ణించబడింది. ఇది మూడు సంపుటములుగా 1920-1922 మద్య ప్రచురించబడింది.

Sigrid Undset
పుట్టిన తేదీ, స్థలం(1882-05-20)1882 మే 20 [1]
Kalundborg, Denmark[1]
మరణం1949 జూన్ 10(1949-06-10) (వయసు 67)
Lillehammer, Norway
వృత్తిWriter
జాతీయతNorwegian
పురస్కారాలుNobel Prize in Literature
1928
బంధువులు
  • Ingvald Martin Undset (father)[1]
  • Anna Marie Charlotte Nicoline née Gyth (mother)[1]

జీవితచరిత్ర

మార్చు
 
Sigrid Undset as a young girl

ఆరంభకాల జీవితం

మార్చు

సిగ్రిడ్ అండ్సెట్ 1882 మే 20 డెన్మార్క్ లోని ఒక చిన్నపట్టణం అయిన కలుంద్బొర్గ్‌లో జన్మించింది. సిగ్రిడ్ కు ఇద్దరు చెళ్ళెళ్ళు ఉన్నారు. సిగ్రిడ్ రెండుసంవత్సరాల వయసులో ఆమె కుటుంబం డెన్మార్క్ వదిలి నార్వేకు వలసపోయింది.

ఆమె నార్వే రాజధాని ఓస్లోలో పెరిగిపెద్దది అయింది. ఆమె 11 సంవత్సరాల వయసులో ఆమె తండ్రి (నార్వేజియన్ ఆర్కియాలజిస్ట్) ఇంగ్వాల్డ్ మార్టిన్ అండ్సెట్ (1853-1893) 40 సంవత్సరాల వయసులో దీర్ఘకాల అనారోగ్యంతో మరణించాడు.[3]

కుటుంబ ఆర్థికపరిస్థితి కారణంగా అండ్సెట్ విశ్వవిద్యాలయ విద్య అభ్యసించే ఆశను వదులుకుంది. ఒక సంవత్సరం సెక్రెటరియల్ కోర్స్ తరువాత ఆమెకు క్రిస్టియానాలోని ఒక ఇంజనీరింగ్ కంపెనీలో సెక్రెటరీగా ఉద్యోగం లభించింది. ఆమె ఆ ఉద్యోగంలో 10 సంవత్సరాలు కొనసాగింది.

1907 లో ఆమె " నార్వేజియన్ ఆథర్స్ యూనియన్ "లో చేరింది. 1933-1935 ఆథర్స్ యూనియన్ లిటరరీ కౌన్సిల్‌కు నాయకత్వం వహించింది. 1936-1940 వరకు ఆమె యూనియన్ చైర్మన్ బాధ్యత వహించింది.

రచయత్రి

మార్చు

ఒకవైపు ఆఫీసులో పనిచేస్తూనే సిగ్రిడ్ అండ్సెట్ రచనవ్యాసంగం, ఉన్నత విద్య కొనసాగించింది. తన 16వ సంవత్సరంలో ఆమె మొదటిసారిగా నవలా రచనచేయడం ఆరంభించింది. తన 22వ వయసులో మద్యయుగ డెన్మార్క్ గురించిన చారిత్రక నవలరచన ఆరంభించింది.

రెండుసంవత్సరాల తరువాత ఆమె మరొక చేవ్రాత పుస్తకం పూర్తిచేసింది. ఈ సారి పుస్తకంలో 80 పేజీలు మాత్రమే ఉన్నాయి. తరువాత ఆమె క్రిస్టియానాలోని మద్యతరగతి స్త్రీల జీవితం ప్రతిబింబించే నవలా రచన పూర్తి చేసింది. ఈ పుస్తకం కూడా మొదట ప్రచురణకర్తల చేత తిరస్కరించబడినా చివరికి ప్రచురించబడింది. " ఫ్రూ మార్తా ఊలే " అని పేరున్న ఈ నవల లోని మొదటి వాక్యం " నేను నా భర్తకు విశ్వాసంగా లేను "తో ఆరంభం అవుతుంది.

25 సంవత్సరాల వయసులో సిగ్రిడ్ అండ్సెట్ రచనలలో సహజత్వం చోటుచేసుకుంది. రచనలలో సమకాలీన నేపథ్యం చోటుచేసుకుంది. తరువాత సింగ్రెడ్ విశ్వసనీయమైన నార్వేదేశ యువరచయితగా గుర్తించబడింది. 1919 నాటికి అండ్సెట్ సమకాలీన క్రిస్టియానా నేపథ్యంలో పలు నవలలు రచించింది. 1907 - 1908 మద్య ఆమె నగరం, అందులో నివసిస్తున్న వారి జీవితాలు వర్ణిస్తూ నవలలు వ్రాసింది. అవి శ్రామిక ప్రజల జీవితచిత్రణ ప్రతిబింబించే నవలలుగా గుర్తించబడ్డాయి. తల్లి తండ్రులు, పిల్లల మద్య సంబంధాలు అందులో వివరించబడ్డాయి. ఆమె స్త్రీలు వారి ప్రేమలు ప్రధానాంశంగా తీసుకుని రచనలు సాగించింది.

సహజత్వం ప్రతిబింబించే నవలలలో జెన్నీ (1911), వారీన్ నవలలు ప్రధానమైనవి. మొదటి నవలలో మహిళాచిత్రకారిణి జీవితం, ప్రేమ ఇతివృత్తం ఉంది. ప్రేమ వైఫల్యం కారణంగా జీవితం వృధా అయిందని భావించి చివరికి ఆత్మహత్యచేసుకుంటుంది. రెండవనవలలోని స్త్రీ తీవ్రమైన వివాహప్రతిపాదన నుండి తనను తన ప్రేమను కాపాడి సురక్షితమైన కుటుంబం ఏర్పరుస్తుంది. ఈ నవలలు అండ్సెట్‌ను ఐరోపా‌లో స్త్రీవాదిగా చిత్రించాయి.

అండ్సెట్ నవలలు ఆరంభంలో చక్కాగా విక్రయించబడ్డాయి. మూడవ పుస్తకం ప్రచురించబడిన తరువాత ఆమె తన ఉద్యోగం వదిలి రచయితగా జీవితం కొనసాగించడానికి తయారైంది. రచయితగా స్కాలర్ షిప్ తీసుకున్న తరువాత దీర్ఘకాల ఐరోపా యాత్రకు ఏర్పాటు చేసుకుంది. డెన్మార్క్, జర్మనీ లలో కొంతకాలం నివసించి ఇటలీ వైపు యాత్ర కొనసాగించి 1919 నాటికి రోమ్ నగరానికి చేరుకుంది. అక్కడ ఆమె తొమ్మిది మాసాల కాలం నివసించింది. అండ్సెట్ తల్లితండ్రులకు రోము నగరంతో దగ్గరి సంబంధం ఉంది. ఆమె ఇక్కడ నివసించిన కాలంలో తనతల్లితండ్రుల అడుగుజాడలను అనుసరించింది. దక్షిణ ఐరోపా సందర్శన ఆమెకు గొప్ప అనుభవాన్ని కలిగించింది. ఆమె రోము లో స్కాండెనేవియన్ కళాకారులు, రచయితలతో స్నేహం చేసింది.

వివాహం, సంతానం

మార్చు

రోమ్‌లో అండ్సెట్ " అండర్స్ కాస్టస్ స్వర్‌స్టాడ్‌"ను (నార్వేజియన్ పెయింటర్) కలుసుకుని తరువాత మూడు సంవత్సరాలకు ఆయనను వివాహం చేసుకుంది. వివాహం చేసుకునే సమయంలో ఆమె వయసు 30 స్వర్‌స్టాడ్‌ ఆమెకంటే 9 సంవత్సరాల పెద్దవాడు. ఆయనకు అప్పటికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చాడు.

సిగ్రెడ్, ఆండెర్స్ 1912లో వివాహం చేసుకున్నారు. తరువాత వారు ఆరు మాసాల కాలం లండన్లో నివసించారు. తరువాత వారు రోంకు తిరిగి వచ్చారు. అక్కడ సిగ్రిడ్ తన మొదటి మగ సంతానానికి జన్మ ఇచ్చింది (1913 జనవరి). సిగ్రిడ్ తనకుమారునికి తన తండ్రి పేరును పెట్టింది. 1919లో ఆమె మరొక కుమారునికి జన్మ ఇచ్చింది. తరువాత వారు ఆండెర్స్ మొదటి సంతానాన్ని తమ కుటుంబంలో చేర్చుకున్నారు. ఆమె రెండ సంతానం ఆడపిల్ల. ఆమె ఆండెర్స్ కురాములలో ఒకరిలా మానసికబలహీతతో పుట్టింది. తరువాత ఆమె రచనలు కొనసాగిస్తూ చివరి నవల, చిన్న కథల సంకలనం పూర్తిచేసింది. తరువాత ఆమె ప్రజాసమస్యల చర్చలలో పాల్గొన్నది. మహిళా విమోచనం, నీతినియమాలు ప్రధానాంశంగా చర్చలు జరుగుతూ ఉండేవి. నీతినియమాల క్షీణత కారణంగా మొదటి ప్రపంచయుద్ధం సంభవించిందని ఆమె భావించింది.

 
Sigrid Undset at work at Bjerkebæk
 
Bjerkebæk, Undset's home, now part of Maihaugen museum

1919లో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని దక్షిణ నార్వేలోని గుడ్బ్రాండ్ లోయలోని లిల్లెహమ్మర్‌ అనే చిన్న పట్టణానికి మారింది. అప్పుడు ఆమె గర్భవతి కనుక విశ్రాంతి కొరకు లిల్లెహమ్మర్‌కు వెళ్ళింది. తన భర్త కొత్త ఇల్లు ఏర్పాటు చేసిన తరువాత తిరిగి వెళ్ళాని అనుకున్నది. అయినప్పటికీ తరువాత వారి వివాహం రద్దయింది. 1919 ఆగస్టులో ఆమె మూడవ సంతానానికి జన్మ ఇచ్చింది. ఆమె లిల్లెహమ్మర్‌ను తననివాసంగా మార్చుకుంది. రెండు సంవత్సరాల తరువాత ఆమె నార్వేజియన్ శైలిలో చెక్కతో నిర్మించిన పెద్ద ఇల్లు నిర్మించుకుంది. నగరానికి సమీపంలో చుట్టూ గ్రామాలు కనిపించే ప్రదేశంలో పెద్ద ఆవరణ కంచె పూదోటతో నివాసం ఏర్పరుచుకుని అక్కడ ఆమె ప్రశాంతంగా రచనావ్యాసంగం కొనసాగించింది. [4]

క్రిస్టిన్ లవ్రంస్డాట్టర్

మార్చు

మూడవ సంతానానికి జన్మ ఇచ్చిన తరువాత ఆమె ఒక ప్రధాన ప్రాజెక్ట్ (క్రిస్టిన్ లవ్రంస్డాట్టర్) ప్రారంభించింది. ఆమె తన స్వంత ఇంట్లో ఉంటూ క్రైస్తవానికి ముందునాటి నార్వే చరిత్రకు సంబంధించిన చిన్న నవలా రచన ప్రారంభించింది. తరువాత ఆమె నార్వేజియన్లలో ప్రచారంలో ఉన్న " ఆర్తూరియన్ లిజండ్స్ " గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఆమె " ఓల్డ్ నర్స్ " చేవ్రాలు ప్రతి, మద్యయుగ చరిత్రలు అధ్యయనం చేసింది. అలాగే ఆమె స్వదేశ, విదేశ మద్యయుగానికి చెందిన చర్చీలు, మఠాలు సందర్శించి పరిశోధన చేసింది. ఆమెకు ఎదురైన పరిస్థితులు ఆమెకు వ్యక్తిగతంగా ఎదగడానికి తోడ్పడ్డాయి. మొదటి ప్రపంచం యుద్ధం సమయంలో సంభవించిన రక్తంతో తడిసిన చారిత్రక సంఘటనలు ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసాయి. ఆమె " క్రిస్టిన్ లవ్రంస్డాట్టర్" ప్రారంభించే సమయానికి ఆమెకు జీవితంపట్ల చక్కని అవగాహన కలిగింది.

క్రిస్టిన్ లవ్రంస్డాట్టర్ ఒక చారిత్రక నవల అయినప్పటికీ చరిత్రకు అతీతమైన విషయాలు అందులో ఉన్నాయి. చారిత్రక నేపథ్యంలో కచ్చితత్వం, సహజత్వం ఉంటాయి. ఆమె తన మూడు వాల్యూములలో మానవ మానసిక ఉద్రేకాలు (ప్రేమ, నిరాశ, విషాదం, సంతోషం) వివరించబడ్డాయి. మద్యయుగ క్రైస్తవసంస్కృతి మీద అండ్సెట్‌కు ఉన్న ఆరాధన ఆమె రచనకు తోడ్పాటు అందించింది. క్రిస్టిన్ లవ్రంస్డాట్టర్‌లో ఆమె తాను గ్రహించిన జీవితరహస్యాలను పొందుపరిచింది. వివాహరద్దు తరువాత అండ్సెట్ పరిపక్వత కలిగిన రచలనలు చేయడం ఆరంభించింది. 1920-1927 మద్య ఆమె క్రిస్టిన్ లవ్రంస్డాట్టర్ మూడు సంపుటములను ప్రచురించింది. నాలుగవ సంపుటము ఆంగ్లంలోనికి అనువదించబడింది.

కాథలిక్‌ ఇజం

మార్చు

సిగ్రెడ్ అండ్సెట్ తల్లితండ్రులు అథిజం అనుయాయులు. అయినప్పటికీ ఆమె, ఆమె చెల్లెళ్ళు బాప్తిజం స్వీకరించారు. ఆమె తల్లి క్రమానుసారంగా ల్యూథర్న్ చర్చికి హాజర్ అవుతుండేది. వారు పూర్తిగా లౌకిక వాదులుగా మారారు.[5] అండ్సెట్ తనజీవితంలో అధికభాగం అగ్నోస్టిక్‌గా గడిపింది. అయినప్పటికీ వివాహం, మొదటి ప్రపంచయుద్ధం సంభవించడం ఆమె ఆలోచనాసరళిని మార్చివేసింది. ఆసమయంలో ఆమెకు విశ్వసం అనే అనుభవం అధికం అయింది. ఈ క్లిష్టమైన ఆమె అనుభవాలు ఆమెను అగ్నోయిజం నుండి క్రైస్తవానికి నడిపించాయి. ఆమె రచనలలో మానవమేధకు అందని వివరించడానికి వీలుకాని జీవితరహస్యాలు అంతర్లీనంగా వివరించబడ్డాయి. ఆమె జాగృతమైన ఆలోచనాసరళిలో క్రూరమైన జీవితసత్యాలు వెలువడతూ సమాధానం చెప్పలేని ప్రశ్నలు తలెత్తుతాయి. ఆమె జీతంలో ఎదుర్కొన్న సమస్యలు ఆమె భావాలలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చాయి. ఒకప్పుడు ఆమె మనిషి దేవుడిని సృష్టించాడని భావించింది. చివరికి ఆమె దేవుడే మనిషిని సృష్టించాడన్న విశ్వాసాన్ని బలపరచుకుంది. అయినప్పటికీ ఆమె తాను పెరిగిన " ల్యూథర్న్ చర్చి(నార్వే) "ని అనుసరించలేదు. 1924లో ఆమె కాథలిక్ చర్చిని స్వీకరించింది. నార్వేలో సిగ్రిడ్ అండ్సెట్ కాథలిక్ మార్పిడి సంచలనం సృష్టించింది. ఆసమయంలో నార్వేలో స్వల్పంగా మాత్రమే కాథలిక్ అనుయాయులు ఉన్నారు. దీనిని ల్యూథరన్ చర్చి ఆదరించలేదు. నార్వేలో ల్యూథరన్ చర్చి, అధికసంఖ్యాక ప్రజలలో కాథలిక్ చర్చికి వ్యతిరేకత ఉంది. ఆసమయంలో నార్వే మేధావి వర్గంలో కాథలిజానికి వ్యతిరేకత అధనిజానికి (సోషలిజం), కమ్యూనిజానికి అనుకూలత అధికంగా ఉంది. ఆమె విశ్వాసం, ప్రవర్తన మీద విమర్శల దాడి అధికం అయింది. ఆమె సాహిత్యజీవితం మీద కూడా ఈ ప్రభావం అధికం అయింది. ఆమె కాథలిజాన్ని రక్షిస్తూ పలు చర్చలలో పాల్గొన్నది. ఫలితంగా ఆమెకు " ది కాథలిక్ లేడీ " అనే మారుపేరు స్థిరపడింది.

తరువాత జీవితం

మార్చు

1929 నాటికి ఆమె సమకాలీన ఒస్లోలో బలమైన కాథలిక్ నేపథ్యంలో నవలలు వ్రాసింది. అయినప్పటికీ నవలలో ప్రేమ ప్రధాన కథాంశంగా ఉంది. ఆమె బరువైన చారిత్రక నేపథ్యంతో నవలారచన చేసింది. అదనంగా ఆమె ఐస్‌లాండ్ సంబంధిత రచనలను ఆధునిక నార్వేజియన్‌లో అనువదించి ప్రచురించింది. 1934 లో " లెవెన్ ఇయర్స్ ఓల్డ్ " పేరుతో ఆత్మకథను ప్రచురించింది. అందులో ఆమె తన క్రిస్టియానా లోని బాల్యజీవితం, ప్రేమ విలువ, ఆమె రోగగ్రస్థ తండ్రి గురించి వర్ణించి చెప్పింది. చిన్న బాలిక జీవితం వర్ణించి గురించి చెప్పిన ఉన్నత నార్వే రచనగా ఇది గౌరవించబడింది. 1930లో ఆమె 18వ శతాబ్ధపు స్కాండినేవియా చరిత్ర సంబంధిత నవలలను ప్రచురించింది. 1939లో మేడమె డోరతీ మొదటి వాల్యూం ప్రచురించింది.అదే సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం సంభవించింది. అది ఆమె రచనాజీవితంలో మరియ వ్యక్తిగత జీవితంలో ఆటంకం కలిగించింది. తరువాత ఆమె నవలల ప్రచురణ చేయలేదు. స్టాలిన్ ఫిన్‌లాండ్ మీద దాడి చేసిన సమయంలో తన నవలకు లభించిన నోబెల్ పురస్కారం (1940) నగదును ఫిన్‌లాండ్‌కు అందించి ఫిన్‌లాండ్‌కు సహాయంగా నిలిచింది.[6]

దేశంవదిలి వెళ్ళుట

మార్చు

1940లో ఏప్రెల్‌లో జర్మనీ నార్వే మీద దండెత్తిన తరువాత ఆమె మీద దేశం విడిచివెళ్ళాలన్న వత్తిడి ఎదురైంది. 1930 నుండి ఆమె హిట్లర్ను బలంగా ఎదిరిస్తూ ఉంది. ఆరంభకాలం నుండీ ఆమె పుస్తకాలు " నాజీ నార్వే "లో నిషేధించబడ్డాయి. గెస్టాపో లక్ష్యంగా మారాలని ఆమె కోరుకోనప్పటికీ మధ్యస్థంగా ఉన్న స్వీడన్కు పారిపోవలసిన పరిస్థితి ఎదురైంది. ఆమె పెద్ద కుమారుడు నార్వే ఆర్మీలో పనిచేస్తూ 1940లో తన 27వ సంవత్సరంలో మరణించాడు.[7][7] గౌస్డాల్‌లోని సెగల్స్టాడ్ వంతెన వద్ద జర్మన్లతో యూద్ధం చేస్తున్నప్పుడు ఆమె పెద్ద కుమారుడు మరణించాడు.[8] యుద్ధం మొదలైన స్వల్పకాలంలోనే ఆమె వ్యాధిగ్రస్థమైన కుమార్తె మరణించింది. 1940 సిగ్రిడ్ తన చిన్నకుమారునితో స్వీడన్ మీదుగా యునైటెడ్ స్టేట్స్ చేరుకుంది. ఆమె న్యూయార్క్ లోని బ్రూక్లిన్ హైట్ వద్ద నివసించింది. " ఎస్.టి. అంస్గర్ స్కాడినేవియన్ కాథలిక్ లీగ్ "లో ఆమె క్రియాశీలకంగా పనిచేసింది. వారి బులెటిన్ కొరకు పలు వ్యాసాలను కూడా వ్రాసింది.1944 జనవరి 4 న జర్మనులు డానిష్ ల్యూథరన్ పాస్టర్‌ " కాజ్ మునక్ "ను వధించిన తరువాత డానిష్ " డీ ఫ్రీ డాంస్కర్ " వార్తాపత్రిక ప్రభావవంతమైన స్కాండినేవియన్ వ్యాసాల ముద్రణను (ఇందులో అండ్సెట్ వ్యాసాలు కూడా ఉన్నాయి) ఆపివేసింది.[9]

తిరిగి నార్వే రాక

మార్చు

1945 లో నార్వేకు స్వతంత్రం లభించిన తరువాత ఆమె తిరిగి నార్వేకు వెళ్ళింది. తరువాత ఆమె మరొక నాలుగు సంవత్సరాలు జీవించింది. అయినప్పటికీ ఆమె తిరిగి రచనలు చేయలేదు. సిగ్రిడ్ అండ్సెట్ తన 67 వ సంవత్సరంలో నార్వే లోని లిల్లెహమ్మర్‌లో (అక్కడ ఆమె 1919 నుండి 1940 వరకు నివసించింది) మరణించింది. ఆమెను లిల్లెహమ్మర్‌కు 15 కి.మీ దూరంలో ఉన్న మెంసలి గ్రామంలో సమాధి (అక్కడే ఆమె కుమార్తె, కుమారులు మరణించారు) చేసారు.

గౌరవం

మార్చు

సిగ్రెడ్ అండ్సెట్ వివిధ మార్గాలలో గౌరవించబడింది. వీటిలో అత్యంత ప్రతిష్ఠాకరమైన నోబెల్ బహుమతి కూడా ఉంది. ఆమెను " నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ " సభ్యుడు " హెల్గా ఎంగ్ " నోబెల్ బహుమతి కొరకు ప్రతిపాదించాడు.[10] శుక్రగ్రహంలోని ఒక క్రేటర్‌కు ఆమె తరువాత ఆమె పేరును పెట్టారు. 1982లో 500 నార్వే క్రోనర్ కరెన్సీ నోటు మీద ఆమె చిత్రం ముద్రించబడింది. 2 క్రోనర్ల పోస్టేజి స్టాంపు ఆమె చిత్రంతో వెలువరించబడింది. 1998 లో పొరుగున ఉన్న స్వీడన్ ఆమె పేరుతో స్టాంపును వెలువరించింది. లిల్లెహమ్మర్ లోని సిగ్రిడ్ అండ్సెట్ నివసించిన ఇల్లు " మైహౌజెన్ " మ్యూజియంలో భాగంగా ఉంది. [11]

సంబంధిత లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Fødte Kvindekøn". Kirkebog. 1880–1892 (in Danish). Vor Frue Sogn (Kalundborg). 1882. p. 166. Doktor philosof Ingvald Martin Undset og Hustru Anna Marie Charlotte Nicoline, født Gyth, 26 Aar 1/2{{cite book}}: CS1 maint: location missing publisher (link) CS1 maint: unrecognized language (link)
  2. Bliksrud, Liv (2022-06-30), "Sigrid Undset", Norsk biografisk leksikon (in నార్వేజియన్), retrieved 2023-03-14
  3. Ingvald Undset (Store norske leksikon)
  4. Bjerkebæk (Store norske leksikon)
  5. Sparrow, Stephen (2003). "Sigrid Undset: Catholic Viking" Archived 2016-03-03 at the Wayback Machine
  6. The Winter War 1939—1940 Archived 2009-05-02 at the Wayback Machine The Finnish Defence Forces, 1999.
  7. 7.0 7.1 Voksø, Per (1994). Krigens Dagbok – Norge 1940–1945 (in Norwegian). Oslo: Forlaget Det Beste. p. 33. ISBN 82-7010-245-8.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  8. Ording, Arne; Johnson, Gudrun; Garder, Johan (1951). Våre falne 1939–1945 (in Norwegian). Vol. 4. Oslo: Norwegian government. pp. 272–273.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  9. "KAJ MUNK IN MEMORIAM". De frie Danske (in Danish). January 1944. p. 6. Retrieved 18 November 2014. Munk var en overordentlig modig Mand og er nu mere end nogensinde før i Spidsen for Danmarks Frihedskamp. Hans indsats i Kampen for Friheden har skænket ham udødelighed. Han er blevet et af de store Navne i Danmarks Historie{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  10. http://www.nobelprize.org/nomination/archive/show.php?id=8335
  11. "Sigrid Undset's home Bjerkebæk (Maihaugen)". Archived from the original on 2015-07-30. Retrieved 2016-03-14.

వెలుపలి లింకులు

మార్చు