సిటిజన్ కేన్ 1941లో విడుదలైన అమెరికన్ జీవిత కథా చలనచిత్రం. చార్లెస్ ఫాస్టర్ కేన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్సన్ వెల్స్ నిర్మించి, దర్శకత్వం వహించడమేకాకుండా కేన్స్ పాత్రలో నటించాడు. హాలీవుడ్ సినిమాలలో సూపర్ హిట్ కావడమే కాకుండా క్లాసిక్‌ మూవీగా నిలిచిన ఈ చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకోవడమేకాకుండా మొత్తం తొమ్మిది విభాగాల్లో నామినేట్ అయింది.

సిటిజన్ కేన్
దర్శకత్వంఆర్సన్ వెల్స్
స్క్రీన్ ప్లేహెర్మాన్ జె. మాన్కివిజ్, ఆర్సన్ వెల్స్
నిర్మాతఆర్సన్ వెల్స్
తారాగణంఆర్సన్ వెల్స్, జోసెఫ్ కట్టన్, డోరతీ కమింగ్గో, ఎవరెట్ స్లోన్, రే కాలిన్స్, జార్జి కౌలూర్స్, ఆగ్నెస్ మూర్హెడ్, పాల్ స్టీవర్ట్, రూత్ వార్రిక్, ఎర్స్కైన్ శాన్ఫోర్డ్, విలియం అలెండ్
ఛాయాగ్రహణంగ్రెగ్ టోలాండ్
కూర్పురాబర్ట్ వైజ్
సంగీతంబెర్నార్డ్ హెర్మాన్
నిర్మాణ
సంస్థ
మెర్క్యురీ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుఆర్.కె.ఓ. రేడియో పిక్చర్స్
విడుదల తేదీs
మే 1, 1941 (1941-05-01)(ప్లేస్ థియేటర్ (న్యూయార్క్))
సెప్టెంబరు 5, 1941 (యునైటెడ్ స్టేట్స్)
సినిమా నిడివి
119 నిముషాలు [1]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$839,727[2]
బాక్సాఫీసు$1.6 మిలియన్ (1991 re-release)[3]

కథ నేపథ్యం

మార్చు

ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త 'రోజ్‌ బడ్‌' అని కలవరిస్తూ మరణిస్తాడు. ఆ మాటలను రికార్డ్ చేసిన డాక్టర్ల చెప్పినవాటి ఆధారంగా రోజ్‌ బడ్‌ ఏమిటని మీడియా పరిశోధన ప్రారంభిస్తుంది. ఆ పరిశోధన వల్ల ఆ పారిశ్రామికవేత్త జీవిత కథ అంతా బయటకు వస్తుంది. చివరకు ఈమూవీలో 'రోజ్‌ బడ్‌' అంటే ఏమిటో ఆపేరును ఆవ్యాపారవేత్త ఎందుకు కలవరించాడో తెలియకుండానే ఆమూవీ ముగింపుకు వస్తుంది. 'రోజ్ బడ్' అంటే ఆ ప్రముఖ వ్యాపారవేత్త రహస్య ప్రేమికురాలా లేదంటే అతడి అజ్ఞాత కూతురా లేకుంటే ఈ 'రోజ్ బడ్' వెనుక ఏదైనా మర్డర్ మిస్టరీ ఉందా అన్న సస్పెన్స్ తో కథ చాల స్పీడ్ గా నడుస్తుంది.

కేన్ చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు అతని కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటుంది. అయితే అదృష్టవశాత్తూ వారి కుటుంబానికి సంబంధించిన భూమిలో బంగారు గనులున్నాయని తెలియడంతో ఆ కుటుంబం అమాంతం ధనవంతులవుతారు. కానీ, కేన్ తల్లి అతన్ని ఒక ధనిక కుటుంబంలో పెంచి పెద్ద చేసి, అతని ఇరవై ఐదో ఏట అతనికి ఆస్తిపాస్తులు అందేలా ఒప్పందం కుదుర్చుకుంటుంది. అలా తన తల్లిదంవూడులకు, చిన్నతనానికి దూరమైన కేన్ అతి చిన్న వయసులోనే ప్రచురణ రంగంలోకి అడుగుపెట్టి, ఒక్కో మెట్టే ఎక్కుతూ అమెరికాలో మీడియా మొత్తాన్నీ శాసించే స్థాయికి ఎదగటం, ఆ క్రమంలో ప్రత్యర్థులని నిర్దాక్షిణ్యంగా చిత్తుచేయటం, మొదట్లో మంచివాడుగా ఉన్న కేన్ అగ్రస్థానానికెదిగే సమయానికి నిరంకుశుడిగా, ఎవరినీ నమ్మలేనివాడిగా తయారవటం, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్యకు దూరమై మరొకరితో సంబంధం ఏర్పరచుకోవడం, చివరికి ఆమెను కూడా దూరం చేసుకుని ఎంతో సాధించినా ఒంటరివాడిగా మిగిలిపోయి ఆఖరికి రోజ్ బడ్ అంటూ మరణిస్తాడు.

నటవర్గం

మార్చు
  • ఆర్సన్ వెల్స్
  • జోసెఫ్ కట్టన్
  • డోరతీ కమింగ్గో
  • ఎవరెట్ స్లోన్
  • రే కాలిన్స్
  • జార్జి కౌలూర్స్
  • ఆగ్నెస్ మూర్హెడ్
  • పాల్ స్టీవర్ట్
  • రూత్ వార్రిక్
  • ఎర్స్కైన్ శాన్ఫోర్డ్
  • విలియం అలెండ్

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాత, దర్శకత్వం: ఆర్సన్ వెల్స్
  • స్క్రీన్ ప్లే: హెర్మాన్ జె. మాన్కివిజ్, ఆర్సన్ వెల్స్
  • సంగీతం: బెర్నార్డ్ హెర్మాన్
  • ఛాయాగ్రహణం: గ్రెగ్ టోలాండ్
  • కూర్పు: రాబర్ట్ వైజ్
  • నిర్మాణ సంస్థ: మెర్క్యురీ ప్రొడక్షన్స్
  • పంపిణీదారు: ఆర్.కె.ఓ. రేడియో పిక్చర్స్
 
1939లో తన ఇంటిలో ఆర్సన్ వెల్స్

ఇతర అంశాలు

మార్చు
  1. 23 ఏళ్ల అతి చిన్న వయసులో, కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రూపొందించి ప్రపంచ సినిమా చరివూతలో చిరస్థాయుగా నిలిచిపోయాడు ఈ చిత్ర దర్శకుడు ఆర్సన్ వెల్స్.
  2. ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లు అద్భుతమైన కథనరీతికి ఉదాహరణగా నిలిచాయి. ఆ తర్వాత అంత ప్రభావంతమైన ఫ్లాష్‌బ్యాక్‌ లు ఏ సినిమాలోనూ రాలేదు.
  3. సినిమా కథను, సంఘటనలు జరిగిన సమయానుక్షికమంలో లీనియర్‌గా కాకుండా, నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పడం ఈ సినిమాతోనే మొదలయింది.
  4. సినిమాటోక్షిగఫీ విభాగంలో ‘డీప్ ఫోకస్’ అనే ప్రక్రియను మొదటిసారిగా ఈ సినిమాలోనే ఉపయోగించారు.
  5. ఈ సన్నివేశంలో కేవలం పాత్రల వయసు మాత్రమే మారినట్టు చూపడం కాకుండా, కేన్, ఎమిలీ పాత్రలు పోషించిన నటులతో అద్భుతంగా నటింప చేస్తూనే, ఎప్పటికప్పుడు పాత్రలకు సరిపోయే మేకప్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, లైటింగ్ వాడుతూ, కేన్, ఎమిలీల తొమ్మిదేళ్ళ వైవాహిక జీవితాన్ని, వారిద్దరి మధ్య పెరుగుతున్న దూరాన్ని చిత్రీకరించారు. రెండు నిమిషాల పదకొండు సెకండ్ల పాటు నడిచే ఈ సన్నివేశంలో 32 షాట్లను ఉపయోగించాడు ఆర్సన్ వెల్స్.
  6. ఈ చిత్ర స్క్రీన్ ప్లే ఆధారంగా తెలుగులో మహానటి తెరకెక్కించబడింది.[4]

మూలాలు

మార్చు
  1. "CITIZEN KANE (A)". British Board of Film Classification. 1 August 1941. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 4 November 2018.
  2. Carringer, Robert L. (October 24, 1996). "The Making of Citizen Kane, Revised Edition". University of California Press – via Google Books.
  3. "Citizen Kane (1941)". Box Office Mojo. Retrieved 4 November 2018.
  4. https://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/mahaanati+kadhalo+haalivud+chaayalu-newsid-88799976[permanent dead link]