మహానటి (2018 సినిమా)

2018 లో నాగ్ అశ్విన్ చే విడుదల చేసిన సినిమా
(మహానటి (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

ఇది 2018లో సినీనటి సావిత్రి జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా.

మహానటి
Mahanati poster.jpg
దర్శకత్వంనాగ్ అశ్విన్
రచనబుర్రా సాయిమాధవ్ (మాటలు)
కథనాగ్ అశ్విన్
నిర్మాతఅశ్వినీ దత్, ప్రియాంకా దత్, స్వప్నా దత్
నటవర్గందుల్కర్ సల్మాన్
కీర్తీ సురేష్
విజయ్ దేవరకొండ
సమంత
ఛాయాగ్రహణండానీ సంచెజ్- లోపెజ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
2018 మే 9 (2018-05-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

తెలుగులో మహానటిగా, తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీనటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు - సి. అశ్వినీదత్, స్వప్నా దత్, ప్రియాంకా దత్. ఈ సినిమా వైజయంతి మూవీస్, స్వప్న సినెమా బ్యానర్స్ కింద విడుదలయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. మిక్కి జె మెయెర్ చిత్రానికి సంగీతం అందించారు. సినిమా నిర్మాణం మే 2017 లో మొదలై 9 మే 2018న సినిమా విడుదల అయింది.

66వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా, జాతీయ ఉత్తమ నటి (కీర్తి సురేష్), జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ (ఇంద్రాక్షి పట్టానాయక్, గౌరంగ్ షా, అర్చన రావు) విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి.

నేపథ్యంసవరించు

ఈ చిత్రం మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ సినిమా 2017 మేలో చిత్రీకరణ ప్రారంభించుకుంది. 2018 మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు.[1]

తెలుగులో మహానటి గా ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు 2017 మేలో హైదరాబాదు లోని రామకృష్ణ స్టుడియోస్ లో ప్రారంభమయ్యాయి.[2][3]

కథసవరించు

బెంగుళూరులో ఒకనాటి ప్రముఖ సినీ నటియైన సావిత్రి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనిస్తాడు ఆమె కొడుకు. ఆమెను ఆసుపత్రికి తరలించిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోతుంది. చాలా వార్తా పత్రికలు ఇది ఒక చిన్న సంఘటనగా వార్త ప్రచురిస్తారు. కానీ ఆ ఘటన వెనుక ఉన్న కారణాలు ఎవరికీ తెలియరావు. ప్రజావాణి పత్రికలో పనిచేసే పాత్రికేయురాలు మధురవాణి మొదట్లో అయిష్టంగానే ఈ వార్త స్వీకరించి ఆసక్తి కొద్దీ ఆమె జీవితం గురించి తెలుసుకోవడం మొదలు పెడుతుంది.

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "Samantha Akkineni wraps up Mahanati, all set to holiday with hubby Naga Chaitanya". India Today (in ఇంగ్లీష్). 20 March 2018. Retrieved 22 March 2018.
  2. "Mahanati, biopic on iconic actress Savitri, officially launched – Pinkvilla South". Pinkvilla South (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 September 2017.
  3. "Mahanati starts rolling in Hyderabad today – Times of India". The Times of India. Retrieved 14 September 2017.

బయటి లింకులుసవరించు