సిడ్నీ షెల్డన్
సిడ్నీ షెల్డన్, ఒక ప్రసిద్ధ అమెరికన్ నవలా రచయిత. ఇతను చికాగోలో 1917 ఫిబ్రవరి 17న జన్మించాడు. కాలిఫోర్నియా సమీపంలోని పామ్‌స్ప్రింగ్స్ ఆసుపత్రిలో ఆయన న్యుమోనియాకు చికిత్స పొందుతూ 31 జనవరి, 2007న, తన 89వ యేట రోజున కన్నుమూశాడు. పుస్తక రచయితగా మాత్రమే కాక బాలీవుడ్ సినిమాల స్క్రిప్టు రచయితగా కూడా ఆయన మంచి పేరు పొందాడు. 50 సంవత్సరాల వయసులో ఆయన నవలలు రాయటం ప్రారంభించాడు. 'రేజ్ ఆఫ్ ఏంజెల్స్', 'ది అదర్‌సైడ్ ఆఫ్ మిడ్‌నైట్' నవలలు ఆయన పుస్తకాల్లో బెస్ట్‌సెల్లర్స్‌గా నిలిచాయి.శక్తిమంతమైన స్త్రీ పాత్రలు సృష్టించిన ఆయన మహిళల అభిమానాన్ని విశేషంగా పొందాడు.
- ఇతను పొందిన అవార్డులు
- 1947లో The Bachelor and the Bobby-Soxer'అనే సినిమాకు స్క్రీన్‌ప్లే వ్రాసినందుకు అకాడమీ అవార్డు.
- 1959లో Redhead అనే సంగీత రూపకానికి టోనీ అవార్డు
- నవలలు (ఆంగ్ల వికీ లింకులతో)
- The Naked Face (1970)
- The Other Side of Midnight (1973)
- A Stranger in the Mirror (1976)
- Bloodline (1977)
- Rage of Angels (1980)
- Master of the Game (1982)
- If Tomorrow Comes (1985)
- Windmills of the Gods (1987)
- The Sands of Time (1988)
- Memories of Midnight (1990)
- The Doomsday Conspiracy (1991)
- The Stars Shine Down (1992)
- Nothing Lasts Forever (1994)
- Morning (1995)
- The Best Laid Plans (1997)
- Tell Me Your Dreams (1998)
- The Sky is Falling (2001)
- Are You Afraid of the Dark? (2004)
- స్వీయ చరిత్ర
- The Other Side of Me (2005)
- బ్రాడ్‌వే నాటకాలు
- The Merry Widow
- Alice in Arms
- Redhead
- Roman Candle
- Gomes(London)
విశేషాలు
మార్చు- ఇతను రచించిన టెల్ మీ యువర్ డ్రీమ్స్ నవలని చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రులు (1999 సినిమా) లో ఒక హాస్య సన్నివేశం లో ప్రస్తావించబడినది
- వెంకటేష్ నటించిన మల్లీశ్వరి (2004 సినిమా) లో కూడా ఒక సన్నివేశంలో కత్రీనా కైఫ్ ఇతను రచించిన పుస్తకాన్నే చదువుతూ ఉంటుంది. "అరె! ఈ పుస్తకమా నేను చదివా, ఇందులో విలన్..." అంటూ ఆ నవలలో ఉన్న ఉత్కంఠని ముందే చెప్పటంతో తాను విసుగ్గా పుస్తకం మూసేస్తుంది.