సిద్ధబాబా దేవాలయం

సిద్ధబాబా దేవాలయం, నేపాల్ దేశంలోని ఒక హిందూ దేవాలయం. నేపాల్ లోని పాల్ప జిల్లా బుత్వాల్ నగరానికి సమీపంలోని ఈ దేవాలయంలో శివుడు కొలువైవున్నాడు.[1] నేపాల్ లోని పాల్ప,[2] రూపాందేహి జిల్లాల హిందువులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఒక వ్యక్తి కోరిక నెరవేరినప్పుడు పావురాన్ని విడిచిపెట్టే సంప్రదాయం ఇక్కడ ఉంది. ఈ సంప్రదాయం వల్ల ఈ దేవాలయం చుట్టూ పెద్ద సంఖ్యలో పావురాలు ఉంటాయి.

సిద్ధబాబా దేవాలయం
సిద్ధబాబా మందిరం
సిద్ధబాబా దేవాలయం
సిద్ధబాబా దేవాలయం
సిద్ధబాబా దేవాలయం is located in Nepal
సిద్ధబాబా దేవాలయం
నేపాల్ లోని సిద్ధబాబా దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు27°43′19.06″N 83°28′7.11″E / 27.7219611°N 83.4686417°E / 27.7219611; 83.4686417
దేశంనేపాల్
జిల్లారూపాందేహి
స్థలంబుత్వాల్
సంస్కృతి
దైవంశివుడు
ముఖ్యమైన పర్వాలుమహాశివరాత్రి,తీజ్, బాల చతుర్దశి

శని, సోమవారాలు, వివిధ మతపరమైన పండుగలలో శివునికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుసంధానించబడిన రోజులలో ఈ సిద్ధబాబా దేవాలయంలో పూజలు చేస్తారు. శివరాత్రి పర్వదినాలలో పెద్ద సంఖ్యలో హిందువులు పూజల కోసం దేవాలయానికి వెళతారు.

ప్రదేశం మార్చు

సిద్ధబాబా దేవాలయం నేపాల్‌లోని పాల్పా జిల్లాలోని దోభన్-5లో ఉంది. ఇక్కడికి 2 కి.మీ.ల సమీపంలో బుట్వాల్ సబ్-మెట్రో నగరం ఉంది. టినౌ నదికి ఎడమ వైపు ఉంది.[3]

దేవాలయానికి సమీపంలో చిడియా ఖోలా అనే చిన్న నది ప్రవహిస్తుంది. తీర్థయాత్ర ఈ నదిలోని నీటిని పవిత్రంగా భావిస్తారు.[4]

చరిత్ర మార్చు

పురాణాల ప్రకారం, ఈ దేవాలయం బిక్రమ్ సంబాత్‌ను ప్రారంభించిన రాజు విక్రమాదిత్య అన్న భర్తృహరి రాజు తపస్సు చేసిన ప్రదేశంగా ఇక్కడి స్థానికుల నమ్మకం.[5]

సమీప పరిసరాలు మార్చు

శివుడితోపాటు ఈ దేవాలయంలో గణేష్, నాగదేవత, మానస దేవి, బిశ్వకర్మ వంటి ఇతర దేవతలు కూడా ఉన్నారు. ఆలయం లోపల అఖండ ధుని (నిరంతర పవిత్ర అగ్ని) ఉంది. ఆలయ ప్రాంగణంలో ధర్మశాల (విశ్రాంతి గృహం), శ్రాద్ధం, పార్కింగ్ స్థలాలు, ఇతర ప్రజా సౌకర్యాలు ఉన్నాయి.[5]

మూలాలు మార్చు

  1. "Siddha Baba Temple - khojnu.com". Retrieved 2021-02-24.
  2. "Visit Tansen". Archived from the original on 2018-06-30. Retrieved 2021-12-01.
  3. 99MustSee.com. "Siddha Baba Temple in BUTWAL - Unexplored Attraction in Butwal - Lumbini Nepal". Archived from the original on 2016-03-26. Retrieved 2021-02-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Maurya, Shiva. "Siddha Baba Mandir Details In Hindi". Retrieved 2021-02-24.
  5. 5.0 5.1 Parajuli, Dipak (2018-12-01). "Siddhababa Temple: Religious Connectivity and Believe Center". Nepalayatimes. Archived from the original on 2020-08-03. Retrieved 2021-02-24. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "nyt01" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు

వెలుపలి లంకెలు మార్చు