సిద్ధార్థ కట్టా

సిద్ధార్థ కట్టా తెలుగు కవి, జర్నలిస్టు. కవి సంగమం కవులలో ఒకడు.

సాహితీ జీవితం మార్చు

సిద్ధార్థ కట్టా గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో జన్మించాడు. 2013లో బీటెక్ పూర్తి చేశాడు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నాడు. 2018లో 'ఒక...' పేరుతో కవిత్వ సంకలనం తెచ్చాడు. 2016 లో ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు 'జీవన' పేరుతో నడిచే ప్రజాశక్తి ఫ్యామిలీ పేజీకి ఫీచర్స్ రాశాడు. ఇప్పుడు మోజో టీవీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఒక దీర్ఘకవితను తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. సిద్ధార్థ కట్టా కవిత్వంపై విమర్శకులు బొల్లోజు బాబా మాట్లాడుతూ "వస్తు విస్తృతి సిద్ధార్థ కవిత్వానికి గొప్ప బలం. చంద్రికల నుంచి ఉరికొయ్యలదాకా ఇతని కవిత్వం విస్తరించి ఉంది. యువకవుల్లో ఇది అరుదుగా కనిపించే లక్షణం. మంచి కవి నుండి గొప్ప కవిని వేరుచేసేది ఈ లక్షణమే " అని తెలిపారు. [1]

"ఆధునిక జీవన సారాంశాన్ని కవిత్వం చేయటం సిద్ధార్థ కవిత్వ లక్షణం. మంచి పదచిత్రాలను అలవోకగా సృష్టించగలిగే ప్రతిభ కలిగినవాడు సిద్ధార్థ. జీవితంలోని మల్టిప్లిసిటీని అర్ధం చేసుకొన్నవాడు. జీవితం పట్ల తనకున్న నిర్ధిష్టమైన ఆలోచనలను సౌందర్యాత్మకంగాను, శక్తివంతంగానూ కవిత్వంలోకి ఒంపగలిగిన నేర్పు కలిగినవాడు" అని సిద్ధార్థ కవిత్వం గురించి బొల్లోజు బాబా విశ్లేషించారు. అలాగే మరో సాహితీ విమర్శకుడు సీతారాం సిద్ధార్థను కవిత్వ కోపోద్రిక్తుడిగా పేర్కొన్నారు. "వాక్యం ఎప్పుడూ ఒక ఆపద. పదం పెను ప్రమాదం. భాషే మూగది. మోనోగ్లాబ్ మిలీనియం వస్తుందా? రాకనే చస్తుందా? అన్ని అంతరింపులు వరదల్లోంచి ఇతనొక గజఈతగాడిలాగా దేనినో కాపాడడానికి పయనమవుతున్నాడు" అని సిద్ధార్థ కవిత్వం గురించి సీతారాం తెలిపారు. [2]

పురస్కారాలు మార్చు

  • రొట్టమాకు రేవు కవితా పురస్కారం (కె.ఎల్.నరసింహారావు స్మారక అవార్డు)
  • అరుణ్ సాగర్ యువపురస్కారం
  • గంధం నాగరాజు యువపురస్కారం

మూలాలు మార్చు

  1. "కొలిమి పత్రికలో కవి సమాచారం".
  2. "కవితా సంపుటి కవర్ పేజీపై ముందుమాట".

యితర లింకులు మార్చు