ప్రజాశక్తి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ప్రజాశక్తి హైదరాబాదులోని ప్రజాశక్తి సాహితీ సంస్థచే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక. ఇది స్వాతంత్ర్యోద్యమ కాలములో 1942లో మద్రాసులో కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా ఆవిర్భవించింది.[1]. 1945 నుండి ఈ పత్రిక విజయవాడనుండి ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై 1948లో నిషేధించబడింది. 1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి 2014వ సంవత్సరము వరకు 10 సంచికలకు ఎదిగినది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత మార్కిస్టు -లెనినిస్టు భావజాల సమూహానికి పత్రికగా కొనసాగుతున్నది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ప్రజాశక్తి ఆంధ్ర ప్రాంతానికి పరిమతమైనది, తెలంగాణ లో మార్చి 25, 2015 నుండి నవతెలంగాణ పేరుతో వస్తున్నది.
ప్రజాశక్తి | |
---|---|
![]() | |
రకము | ప్రతి దినం దిన పత్రిక |
ఫార్మాటు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం: | ప్రజాశక్తి సాహితీ సంస్థ |
సంపాదకులు: | ఎం వి ఎస్ శర్మ |
స్థాపన | 1942-06-13 (వారపత్రిక),మద్రాసు, 1945-12-03 (దినపత్రిక)విజయవాడ, 1951-11-21 (వారపత్రిక), 1981-08-XX (దినపత్రిక) |
నిర్వహణ ఆగిపోయిన | 1948-04-22 నుండి 1951-11-20 (వారపత్రిక) మరల ఇంకొన్నాళ్లు |
వెల | సోమ-శని:రూ3.00, ఆది:4.00 |
ప్రధాన కేంద్రము | విజయవాడ |
| |
వెబ్‌సైటు: ప్రజాశక్తి అధికారిక వెబ్‌సైటు |
చిహ్నంసవరించు
ప్రఖ్యాత కవి, చిత్రకారుడు అడవి బాపిరాజు తొలి పత్రికా చిహ్నం తయారు చేశారు. ఆతరువాత ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో సుత్తీ కొడవలి తొలగించబడింది.
సంపాదకత్వంసవరించు
తొలిదశలో మద్దుకూరి చంద్రశేఖరరావు, కంభంపాటి సత్యనారాయణ (సీనియర్) తుమ్మల వెంకటరామయ్య, పుచ్చలపల్లి సుందరయ్య,చలసాని ప్రసాదరావులు సంపాదకవర్గ సభ్యులుగా పనిచేశారు.ఆ తరువాత వి.ఆర్.బొమ్మారెడ్డి సంపాదకత్వం వహించారు. ఆ తరువాత మోటూరు హనుమంతరావు గారు ఎడిటర్ గా పనిచేసారు.ఆయన ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గా 15 ఎళ్ళుగా పనిచేసారు. ఆయన ఎంపీ, శాసన సభ్యులు గానూ పనిచేసారు. ఆ తరువాత వీ.శ్రీనివాసరావు, ఆ తరువాత ఎస్. వినయకుమర్ ఎడిటర్ గా ఉన్నారు. కొంతకాలం తెలకపల్లి రవి సంపాదకుడుగా ఉన్నారు. 2014 జూన్ లో ఆంధ్రప్రధెశ్ రాష్ట్ర విభజన తర్వత 'రెందు రష్ట్రాలకు గాను రెండు వెర్వెరు ఏదిషన్లను నిర్వహించటంతో ఆంధ్రప్రధెశ్ రాష్ట్ర ఎడిటర్ గా ప్రస్తుతం ప్రజాశక్తి ఎడిటర్ గా పాటూరు రామయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఎడిటర్ గా సుంకరి వీరయ్య సంపదకులుగా ఉన్నారు.
అనుబంధాలుసవరించు
ప్రస్తుతం ప్రజాశక్తి ఎడిటర్ గా మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ గారు ఉన్నారు.
ప్రజాశక్తి బుక్ హౌస్సవరించు
ప్రజాశక్తి బుక్ హౌస్ 80,000 పైగా పుస్తకాలు ప్రచురించి పెద్ద పుస్తక ప్రచురణ సంస్థగా అభివృద్ధి చెందింది.[1]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ప్రజాశక్తి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 420–421.CS1 maint: extra punctuation (link)