సిపాహీజాల జిల్లా

త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా.

సిపాహీజాల జిల్లా, త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఒక జిల్లా. 2012, జనవరి నెలలో త్రిపురలో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. జిల్లాలో కొంత భాగం పశ్చిమ త్రిపుర జిల్లా నుండి ఏర్పడింది. ఈ జిల్లాలో బిషాల్‌గర్, బిశ్రామ్‌గంజ్, మేలఘర్, సోనమురా మొదలైనవి ప్రధాన పట్టణాలు.

సిపాహీజాల జిల్లా
త్రిపుర రాష్ట్ర జిల్లా
నీర్‌మహల్ (మేలఘర్)
నీర్‌మహల్ (మేలఘర్)
త్రిపురలో ప్రాంతం ఉనికి
త్రిపురలో ప్రాంతం ఉనికి
దేశంభారతదేశం
రాష్ట్రంత్రిపుర
ఏర్పాటుజనవరి 2012 (2012-01)
ముఖ్య పట్టణంబిశ్రామ్‌గంజ్
విస్తీర్ణం
 • మొత్తం1,043.04 కి.మీ2 (402.72 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం5,42,731
జనాభా
 • అక్షరాస్యత98%
Time zoneUTC+5:30 (భారత కాలమానం)

విభాగాలు

మార్చు

ఈ జిల్లాలో బిషాల్‌గర్ ఉపవిభాగం, సోనమురా ఉపవిభాగం, జంపూయిజాలా ఉపవిభాగం అనే 3 ఉపవిభాగాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిధిలో బిషాల్‌గర్, చరిలం, నల్చార్, మోహన్‌భోగ్, బాక్సానగర్, కాథాలియా, జంపూయిజాలా అనే 7 బ్లాక్‌లు ఉన్నాయి.[1]

భౌగోళికం, జనాభా

మార్చు

ఈ జిల్లా 1,043.04 కి.మీ2 (402.72 చ. మై) విస్తీర్ణంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 5,42,731 జనాభా ఉన్నారు. అక్షరాస్యత 98% ఉంది.

రవాణా

మార్చు

రోడ్డుమార్గం

మార్చు

అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ నుండి త్రిపురలోని సబ్రూమ్ వరకు ఉన్న 8వ జాతీయ రహదారి ఈ జిల్లా మీదుగా వెళుతోంది.[2]

రైల్వేమార్గం

మార్చు

ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలోని లమ్డింగ్-సబ్రూమ్ మార్గం ఈ జిల్లా మీదుగా వెళుతోంది. ఈ జిల్లాలో బిశ్రామ్‌గంజ్ రైల్వే స్టేషను, బిషాల్‌గర్ రైల్వే స్టేషను అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటినుండి త్రిపుర రాజధాని అగర్తలా, అస్సాం, ధర్మనగర్, ఉదయ్‌పూర్, బెలోనియా మొదలైన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం ఉంది.[3][4]

పర్యాటక ప్రాంతాలు

మార్చు

ఈ జిల్లాలో మూడు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి[5]:-

  1. నీర్‌మహల్
  2. సిపాహీజాల వన్యప్రాణుల అభయారణ్యం
  3. కమల్ సాగర్ కాళి ఆలయం

మూలాలు

మార్చు
  1. "District Sepahijala, GOVERNMENT OF TRIPURA". Retrieved 31 December 2020.
  2. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 31 December 2020.
  3. "Indian Rail Info".
  4. "COVID-19 Reserved Specials - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 31 December 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Tourism | District Sepahijala, GOVERNMENT OF TRIPURA | India". Retrieved 31 December 2020.

ఇతర లంకెలు

మార్చు