ఉదయ్‌పూర్ (త్రిపుర)

త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లా ముఖ్య నగరం, ప్రధాన కార్యాలయం.
(ఉదయ్‌పూర్, త్రిపుర నుండి దారిమార్పు చెందింది)

ఉదయ్‌పూర్ (రంగమతి), త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లా ముఖ్య నగరం, ప్రధాన కార్యాలయం. త్రిపుర రాజధాని అగర్తలా నుండి 51 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ నగరం త్రిపురలో మూడవ అతిపెద్ద నగరం. ఈ నగరం మహారాజుల పాలనలో రాష్ట్ర మాజీ రాజధానిగా ఉండేది. ఈ నగరంలో త్రిపుర సుందరి ఆలయం ప్రాముఖ్యత కలిగిన దేవాలయం.

ఉదయ్‌పూర్
రంగమతి
నగరం
ఉదయ్‌పూర్ is located in Tripura
ఉదయ్‌పూర్
ఉదయ్‌పూర్
భారతదేశంలోని త్రిపురలో ప్రాంతం ఉనికి
ఉదయ్‌పూర్ is located in India
ఉదయ్‌పూర్
ఉదయ్‌పూర్
ఉదయ్‌పూర్ (India)
Coordinates: 23°32′N 91°29′E / 23.53°N 91.48°E / 23.53; 91.48
దేశం భారతదేశం
రాష్ట్రంత్రిపుర
జిల్లాగోమతి
Named forఉదయ్ మాణిక్య
Elevation
22 మీ (72 అ.)
జనాభా
 (2015)[1]
 • Total37,781
 • Rankత్రిపురలో 3వ
భాషలు
 • అధికారికబెంగాళీ, కోక్బోరోక్, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
799120
Vehicle registrationటిఆర్-03

భౌగోళికం

మార్చు

ఉదయ్‌పూర్ నగరం 23°32′N 91°29′E / 23.53°N 91.48°E / 23.53; 91.48 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] సముద్రమట్టానికి 22 మీటర్లు (72 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ నగరం మధ్యనుండి గోమతి నది వెళుతుంది. ఈ నది వ్యవసాయ భూములకు నీటిపారుదల కొరకు ఉపయోగపడుతోంది.

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[3] ఉదయ్‌పూర్ నగరంలో 37,781 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. ఉదయ్‌పూర్ సగటు అక్షరాస్యత 94.84% కాగా, జాతీయ సగటు 72.9% కన్నా ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 96.50% కాగా, స్త్రీల అక్షరాస్యత 93.15% గా ఉంది. ఉదయ్‌పూర్‌ జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఈ జనాభాలో 82% మంది హిందువులు, 17% మంది ముస్లింలు, 1% కంటే తక్కువమంది జైనులు, క్రైస్తవులు ఉన్నారు.

పర్యాటక ప్రాంతాలు

మార్చు

ఈ నగరాన్ని త్రిపుర పర్యాటక రాజధాని అంటారు. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యంత పేరొందింది త్రిపుర సుందరి ఆలయం. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. 1501లో మహారాజా ధన్య మాణిక్య డెబ్బర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం పక్కన కళ్యాణ్ సాగర్ అనే ఒక పెద్ద సరస్సు ఉంది.

భువనేశ్వరి ఆలయం, గుణబతి ఆలయం, జగన్నాథ్ ఆలయం, మహాదేవ్ ఆలయం మొదలైనవి ఇతర దేవాలయాలు. ఇక్కడ జగన్నాథ్ డిఘి, మహాదేవ్ డిఘి, అమర్ సాగర్, ధనిసాగర్, కళ్యాణ్ సాగర్ వంటి అనేక అందమైన సరస్సులు ఉండడంవల్ల ఈ నగరాన్ని "సరస్సుల నగరం (లేక్ సిటీ)" అని కూడా పిలుస్తారు.

కాజీ నజ్రుల్ ఇస్లాం తరువాత "నజ్రుల్ గ్రంధగర్" అనే జాతీయ గ్రంథాలయం కూడా ఇక్కడ ఉంది. టెపానియా ఎకో పార్క్, పురాన్ రాజ్‌బరి మొదలైనవి ఉదయ్‌పూర్ లోని ఇతర పర్యాటక ప్రాంతాలు.

దేవాలయాలు

మార్చు
  • త్రిపుర సుందరి ఆలయం
  • జగన్నాథ్-బారి ఆలయం
  • మహాదేవ్-బారి ఆలయం
  • హరి మందిర్
  • సత్సంఘ బీహార్
  • లోక్‌నాథ్ ఆలయం
  • రామకృష్ణ ఆశ్రమం
  • బసంతి మందిర్
  • రామ్‌తకూర్ ఆశ్రమం
  • భువనేశ్వరి ఆలయం
  • దుర్గా మందిర్

రవాణా

మార్చు

మాతాబరి సమీపంలో ఉదయ్‌పూర్ రైల్వే స్టేషను ఉంది. ఈ స్టేషను ఈశాన్య సరిహద్దు రైల్వే ఆధ్వర్యంలోని లమ్డింగ్ రైల్వే డివిజన్ పరిధిలోని లమ్డింగ్-సబ్రూమ్ విభాగంలో ఉంది. వాస్తుశిల్పంతో దేశంలోని అత్యంత అందమైన రైల్వే స్టేషను ఇది.

సబ్రూమ్ వరకు ఉన్న 8వ జాతీయ రహదారి ఈ నగరం మీదుగా వెళుతుంది. రాజర్‌బాగ్ మోటర్ స్టాండ్ నుండి రాజధాని అగర్తలా, రాష్ట్రాల ఇతర నగరాలకు రోడ్డుమార్గం ఉంది. ఈ నగరం పక్కనఉన్న గోమతి నది లోతును పెంచి, జలమార్గం ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడంకోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.[4][5][6][7]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. http://censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_2_PR_Cities_1Lakh_and_Above.pdf
  2. Falling Rain Genomics, Inc - Udaipur
  3. "Census of India 2011: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2020-12-30.
  4. "UDPRT/Udaipur Tripura". India Rail Info.
  5. First Commercial Broad Gauge Freight Train Arrives In Tripura
  6. BG railhead reaches Udaipur amid cheers Archived 2016-03-21 at the Wayback Machine
  7. "IRCTC Next Generation eTicketing System". Archived from the original on 2007-03-03.

వెలుపలి లంకెలు

మార్చు