సిమ్రాన్ బహదూర్

న్యూఢిల్లీకి చెందిన క్రికెట్ క్రీడాకారిణి

సిమ్రాన్ బహదూర్, న్యూఢిల్లీకి చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1][2] 2021 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలిసారిగా ఎంపికయింది.[3][4][5] 2021 మార్చి 20న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ మహిళల ట్వంటీ20లోకి అరంగేట్రం చేసింది.[6]

సిమ్రాన్ బహదూర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సిమ్రాన్ దిల్ బహదూర్
పుట్టిన తేదీ (1999-12-13) 1999 డిసెంబరు 13 (వయసు 25)
న్యూఢిల్లీ
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 136)2022 ఫిబ్రవరి 15 - న్యూజీలాండ్ తో
తొలి T20I (క్యాప్ 66)2021 మార్చి 20 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2022 జూన్ 27 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018/19–ప్రస్తుతంఢిల్లీ
2022వేగం
కెరీర్ గణాంకాలు
పోటీ ట్వంటీ20
మ్యాచ్‌లు 6
చేసిన పరుగులు 10
బ్యాటింగు సగటు 10.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 10
వేసిన బంతులు 90
వికెట్లు 1
బౌలింగు సగటు 126.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/29
క్యాచ్‌లు/స్టంపింగులు 1/–
మూలం: Cricinfo, 9 జూలై 2022

సిమ్రాన్ 1999, డిసెంబరు 13న ఢిల్లీలో జన్మించింది.

క్రికెట్ రంగం

మార్చు

2022 జనవరిలో న్యూజిలాండ్‌లో జరిగిన 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులోని ముగ్గురు రిజర్వ్ ప్లేయర్‌లలో ఒకరిగా ఎంపికైంది.[7] 2022 ఫిబ్రవరి 15న న్యూజిలాండ్‌కు వ్యతిరేకంగా భారతదేశం తరపున మహిళల వన్డే ఇంటర్నేషనల్ లోకి అరంగేట్రం చేసింది.[8]

మూలాలు

మార్చు
  1. "Simran Bahadur". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  2. "Interview: Story of Delhi's Rising Star – Simran Bahadur". Female Cricket. Retrieved 2023-08-02.
  3. "Shikha Pandey, Taniya Bhatia left out of squads for home series against South Africa". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  4. "Swetha Verma, Yastika Bhatia earn maiden call-ups to India's ODI squad". International Cricket Council. Retrieved 2023-08-02.
  5. "BCCI announces India women's ODI and T20I squads for South Africa series". Hindustan Times. Retrieved 2023-08-02.
  6. "1st T20I (N), Lucknow, Mar 20 2021, South Africa Women tour of India". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  7. "Renuka Singh, Meghna Singh, Yastika Bhatia break into India's World Cup squad". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  8. "2nd ODI, Queenstown, Feb 15 2022, India Women tour of New Zealand". ESPN Cricinfo. Retrieved 2023-08-02.