సిరిమల్లె నవ్వింది

సిరిమల్లె నవ్వింది కృష్ణ నటించిన తెలుగు కామెడీ డ్రామా చిత్రం. ఆదివిష్ణు రాసిన సిరిమల్లి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.[1] మహిళా దర్శకురాలు విజయ నిర్మల దర్శకత్వం లో, ఘట్టమనేని కృష్ణ, సుజాత,చంద్రమోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు .

సిరిమల్లె నవ్వింది
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
నిర్మాణం ఆదుర్తి భాస్కర్
ఎం.ఎస్.ప్రసాద్
చిత్రానువాదం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం కృష్ణ,
చంద్రమోహన్ ,
సుజాత
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ
కూర్పు ఆదుర్తి హరనాథ్
నిర్మాణ సంస్థ రవికళా మందిర్
భాష తెలుగు

సుజాత రైలులో దయనీయ స్థితిలో ప్రయాణిస్తూండగా ఈ చిత్రం ప్రారంభమవుతుంది. అక్కడ ఆమెకు ఒక వృద్ధ మహిళ పరిచయమై, తనతో పాటు తీసుకెళ్ళి ఆమెకు సహాయం చేస్తుంది. కృష్ణ అనే అమాయక ఇంటి యజమానిని అద్దెదారులు వారి దినచర్యలకు వాడుకుంటూంటారు అతడు జనాభా లెక్కల సేకరణ అధికారిగా పనిచేస్తున్నారు. ఒక రోజు అతను తన విధి నిర్వహణలో సుజాత ఇంటికి వెళ్ళినప్పుడు, అతను వారి మొదటి సమావేశంలో ఆమెను ఇష్ట పడతాడు. కృష్ణ తన మామయ్య పిల్లలకు ట్యూషన్ టీచర్‌గా సుజాతను నియమిస్తాడు. ఇక్కడి నుండి, కృష్ణ చాలా సరదాగా సుజాతను ఆకట్టుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. తరువాత, కృష్ణ తన తాత నాగభూషణం కోరిక మేరకు తన గ్రామానికి వెళతాడు. అతను చనిపోయే ముందు కృష్ణను పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తాడు. అప్పుడు కృష్ణ తన తాతకు సుజాత ఫోటోను చూపించి, ఆమెను మాత్రమే పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. ఫోటోను చూసిన నాగభూషణం సుజాత గతాన్ని అతడికి చెబుతాడు. ఒక రోజు అతను ఏదో పని కోసం గ్రామానికి వెళ్ళినప్పుడు, అతను అనుకోకుండా సుజాత పెళ్ళికి హాజరవుతాడు. అక్కడ ఆమె ఒక వృద్ధుడిని వివాహం చేసుకోవలసి వస్తుంది. పెళ్ళైన వెంటనే ఆ వృద్ధుడు మండపం లోనే మరణిస్తాడు. ఫ్లాష్‌బ్యాక్ పూర్తి చేసిన తర్వాత, నాగభూషణం కృష్ణను ఏం జరిగినా సుజాతనే పెళ్ళి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని కోరతాడు.

ఇంతలో, కృష్ణ తన గ్రామానికి వెళ్ళినప్పుడు, రచయిత, కృష్ణ స్నేహితుడూ అయిన చంద్రమోహన్ సుజాతను ప్రేమిస్తాడు. ఆమె పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. సుజత చంద్రమోహన్ ప్రేమను తిరస్కరిస్తుంది. దాంతో అతడు ఊరు వదిలి వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చినప్పుడు, కృష్ణ తన ప్రేమ గురించి సుజాతకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు, కాని ఆమె తిరస్కరిస్తుందేమోనని భయపడతాడు. ఒక రోజు సుజాత, పిల్లలు కృష్ణ మామయ్య గారి అల్లుడైన మోహన్బాబుతో కలిసి పిక్నిక్ కు వెళ్ళినప్పుడు అతను సుజాతతో తప్పుగా ప్రవర్తిస్తాడు. కృష్ణ సకాలంలో ఆమెను రక్షిస్తాడు. ఇది విన్న కృష్ణ మామ, ఆమె కోసం మోహన్బాబు దురుద్దేశం తెలియక సుజాతనే తప్పు పడతాడు. నిరాశకు గురైన సుజాత నగరాన్ని విడిచిపెట్టి రైల్వే స్టేషన్‌కు వెళుతుంది. కృష్ణ ఆమెను అనుసరిస్తాడు. అతను చివరికి ఆమె పట్ల తన భావాలను వ్యక్తపరుస్తాడు. దీనిని సుజాత అంగీకరిస్తుంది. మోహన్‌బాబు కూడా తన తప్పును గ్రహించి కృష్ణ మామ కుమార్తెను వివాహం చేసుకుంటాడు. చిత్రం సంతోషంగా ముగుస్తుంది

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

పాటలను ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, సాహితి రాశారు. ఈ పాటలను పి.సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ, వి.రామకృష్ణ పాడారు.

"చూస్తున్నానని నువ్వు చూస్తావని", రచన: ఆత్రేయ, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

"ఎగిరొచ్చినా కో చిలకమ్మ", రచన: ఆత్రేయ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

"ఒక పువ్వు పూచింది", రచన: సాహితి, గానం. పి సుశీల

"గూడొదిలి వచ్చావే గువ్వా", రచన: ఆచార్య ఆత్రేయ, గానం విస్సంరాజు రామకృష్ణ దాస్

"యే అమ్మ కూతురో", రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

"ఈడొస్తే ఇంతే నమ్మో", రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి శైలజ

మూలాలు

మార్చు
  1. "సిరిమల్లె నవ్వింది (1980) | సిరిమల్లె నవ్వింది Movie | సిరిమల్లె నవ్వింది Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-08-18.

. 2.ghantasala galaamrutamu kolluri bhaskarrao blog.