సిర్గాపూర్ మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం


సిర్గాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని మండలం.[1]. సిర్గాపూర్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

సిర్గాపూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సిర్గాపూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సిర్గాపూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సిర్గాపూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°07′25″N 77°44′28″E / 18.123735°N 77.741207°E / 18.123735; 77.741207
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం సిర్గాపూర్ (సంగారెడ్డి)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 204 km² (78.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 29,792
 - పురుషులు 15,479
 - స్త్రీలు 14,313
పిన్‌కోడ్ 502287

కొత్త మండల కేంద్రంగా మార్పు మార్చు

లోగడ సిర్గాపూర్ గ్రామ కేంద్రంగా మెదక్ జిల్లా,మెదక్ రెవెన్యూ డివిజను పరిధికి చెందిన కల్హేర్ మండలంలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సిర్గాపూర్ గ్రామాన్ని నూతన మండలంగా కల్హేర్ మండలంలోని 8 గ్రామాలను,కంగటి మండలంలోని 7 గ్రామాలను.,నారాయణఖేడ్ మండలంలోని ఒక గ్రామాన్ని విడగొట్టి 17 (1+16) గ్రామాలుతో, కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా,నారాయణఖేడ్ రెవెన్యూ డివిజను పరిధికింద ఈ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 121 చ.కి.మీ. కాగా, జనాభా 29,792. జనాభాలో పురుషులు 15,479 కాగా, స్త్రీల సంఖ్య 14,313. మండలంలో 5,746 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ముబారక్‌పూర్
  2. బొక్కస్‌గావ్
  3. అంతర్గావ్
  4. పోచాపూర్
  5. ఖాజాపూర్
  6. గోసాయిపల్లి
  7. సుల్తానాబాద్
  8. సిర్గాపూర్
  9. కడ్పల్
  10. గర్దెగావ్
  11. పొత్‌పల్లి
  12. వాసర్
  13. వాంగ్ధల్
  14. గౌడ్గావ్ (కె)
  15. చీమల్‌పహాడ్
  16. సంగం
  17. ఉజ్జలంపహాడ్

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 239, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.