సిర్పూర్ కోట

(సిర్పూర్‌ కోట నుండి దారిమార్పు చెందింది)

సిర్పూర్‌ కోట తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ పట్టణంకు తూర్పున ఉన్న కోట. దేశంలోనే మొట్టమొదటి ‘గోండు’ రాజ్య సామ్రాజ్య స్థాపనకు నెలవైన ఈ సిర్పూర్ ప్రాంతం సా.శ. 1200 (9 వ శతాబ్దం) సంవత్సరాల క్రితం ఇక్కడి ఆదిమజాతి గిరిజనులు నాగరికతకు కొంత దూరంగా ఉండేవారు.[1]

గోండు రాజుల కాలంలో కింగ్ బల్లాలా 9 శతాబ్దంలో నిర్మించబడిన సిర్పూర్ కోట చిత్ర దృశ్యం .

చరిత్ర మార్చు

వేములవాడ చాళుక్యులు కరీంనగర్‌ ప్రాంతాన్ని, రాష్ట్ర కూటులు నిజామాబాద్‌ ప్రాంతాన్ని, పీష్వాలు ‘మరట్వాడా’ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో... జనగాం, సిర్పూర్‌ ప్రాంతంలో విడిపోయి బతుకుతున్న గిరిజనులను అందరినీ ఒక్కటిగా కలిపిన రాజగోండు నాయకుడు భీమ్ భాల్లల సింగ్. తమకంటూ ఒక ప్రత్యేక రాజ్యమే లక్ష్యంగా సిర్పూర్‌ని తన గోండు సామ్రాజ్య స్థావరంగా ఎంచుకొని కోట నిర్మాణానికి నాంది పలికాడు. ఈ కోటను 9వ శతకంలో నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. కోట చుట్టూ 18 అడుగుల ఎత్తయిన మట్టిగోడ రెండు కిలోమీటర్ల మేర నిర్మించారు. ఎత్తయిన బురుజులు, కోట చుట్టూ 12 అడుగుల లోతైన కందకం నిర్మించారు.[2]

కాల క్రమేణా గోండు రాజుల చేతుల్లో నుంచి ఈ కోట వేములవాడ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, మరాఠాలు, మొఘలాయిలు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాఫీల చేతుల్లోకి వెళ్ళింది. ఘన చరిత్ర కలిగిన సిర్పూర్‌ కోటలో హిందువులు, ముస్లిమ్‌ లకు సంబంధించిన అనేక కట్టడాలు నిర్మించబడి వివిధ మతాలు సంస్కృతులకు సమ్మేళనానికి నెలవైంది.

శిధిలావస్థలో కోట మార్చు

సిర్పూర్‌ కోటకు సంబంధించిన ముఖద్వారం నేడు శిథిలావస్థలో ఉంది. కాలంతోపాటు కోటకు సంబంధించిన అనేక ఆనవాళ్ళు ధ్వంసమయ్యాయి. నాటి గోండు రాజులు నిర్మించిన అనేక కట్టడాలు పూర్తిగా శిథిలమయ్యాయి. విలువైన నిధి నిక్షేపాల కోసం కోటలో వందలసార్లు దుండగులు తవ్వకాలు జరిపారు. ఇంటి నిర్మాణాల కోసం స్థానికులు కోటకు సంబంధించిన రాళ్ళు ఉపయోగించుకున్నారు.

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. magazine.telangana.gov.in. "భల్లాల రాజు నిర్మించిన కోట". magazine.telangana.gov.in. Archived from the original on 23 August 2016. Retrieved 22 November 2016.
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 October 2019. Retrieved 6 October 2019.