సిహెచ్.లక్ష్మణ చక్రవర్తి
సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి (Dr. Ch. Laxmana Chakravarthy) ఇటీవలి కాలంలో సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధులైన సాహిత్య విశ్లేషకులు. ఈయన తెలంగాణ విశ్వవిద్యాలయములో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాడు
Dr. Ch. Lakshmana Chakravarthy సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి | |
---|---|
జననం | సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి గ్రామం : గుమ్మడిదల : మెదక్ జిల్లా |
నివాస ప్రాంతం | తెలంగాణ భారత దేశము |
వృత్తి | సహాయ ఆచార్యులు |
ఉద్యోగం | తెలంగాణ విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | సాహిత్య విమర్శకుల, పరిశోధకులు, సంపాదకులు |
మతం | హిందూ |
తండ్రి | సంపత్కుమారాచార్యులు |
తల్లి | అలివేలు మంగతాయారు |
జీవిత విశేషాలు
మార్చులక్ష్మణ చక్రవర్తి మెదక్ జిల్లా నర్సాపురం దగ్గరి గ్రామం గుమ్మడిదలలో 1976లో 30 జూన్ న జన్మించారు. తిరుమల నల్లాన్ చక్రవర్తుల ఇంటిపేరు. తల్లి అలివేలు మంగతాయారు, తండ్రి సంపత్కుమారాచార్యులు.
విద్యాబ్యాసం
మార్చుహైదరాబాదులో 5వ తరగతి వరకు చదువుకుని సంప్రదాయ విద్యలైన ద్రావిడ ఆగమాలను మద్రాసులో చదివారు. బిర్లా మందిర్ వేంకటేశ్వరాలయం పూర్వ ప్రధానార్చకులైన, తన తండ్రగారైన తిరుమల నల్లాన్ చక్రవర్తుల సంపత్కుమారాచార్యులు గారి దగ్గర పాంచరాత్రాగమం అభ్యసించారు.1989లో ఆంధ్రసారస్వత పరిషత్తు ద్వారా విశారదలో ఉత్తీర్ణులై అక్కడే BA(L) వరకు చదివారు. M.A. Ph.D లు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి, M.Phil సెంట్రల్ యూనివర్సిటీ చేసారు. హైదరాబాద్ దోమలగూడలోని ఆంధ్ర విద్యాలయ కళాశాలలో తెలుగు అధ్యాపకులు గా 14 సంవత్సరాలు పని చేశారు. 2014 జనవరి నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాడు.
పురస్కారాలు
మార్చు- 1. మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ (రాష్ట్రపతి పురస్కారం) 2016
- 2. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం 2010 (సాహిత్య విమర్శ)
- 3. కొలకలూరి భాగీరథమ్మ సాహిత్య విమర్శ పురస్కారం 2016
- 4. సహృదయ సాహిత్య విమర్శ పురస్కారం 2016
ముద్రిత రచనలు
మార్చు- 1. పరమయోగి విలాసం – విశిష్టాద్వైత తత్త్వం. ఎం.ఫిల్. సిద్ధాంతగ్రంథం 2009
- 2. లక్ష్మణరేఖ, సాహిత్య విమర్శపై వ్యాసాలు 2009 పొ.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య విమర్శ పురస్కారం పొందిన గ్రంథం (2010)
- 3. వ్యాసచక్రం, వైష్ణవ సాహిత్య వ్యాసాలు 2010
- 4. కవిత్వానుసంధానం, కవిత్వ విశ్లేషణ వ్యాసాలు 2012
- 5. నవ్య సంప్రదాయ సాహిత్యం, (మోనోగ్రాఫ్) తెలుగు అకాడమీ ప్రచురణ 2012
- 6. ప్రాచీన కాలంలో అధికార భాషగా తెలుగు, (యు.ఏ. నరసింహమూర్తి గారితో కలిసి) 2012
- 7. ప్రతిబింబం, అధివిమర్శ వ్యాసాలు 2014, కొలకలూరి భాగీరథమ్మ, సహృదయ *సాహిత్య విమర్శ పురస్కారం పొందిన రచన
- 8. కోవెల సంపత్కుమారాచార్య, (మోనోగ్రాఫ్) తెలుగు అకాడమీ ప్రచురణ 2017
- 9. తెలుగులో సంకలన గ్రంథాలు, పిహెచ్.డి.సిద్ధాంత గ్రంథం, తెలుగు అకాడమీ ప్రచురణ 2018
అముద్రిత రచనలు
మార్చుతమిళ నవల కావల్ కోట్టమ్ కావలి కోట పేరుతో తెలుగు అనువాదం సాహిత్య విమర్శకులు, సాహిత్య విమర్శ భావనలపై వ్రాసిన వ్యాసాలు,
సంపాదకత్వం
మార్చు- 1. ఆధునిక సాహిత్య విమర్శ రీతులు, 2005
- 2. ఆధునిక సాహిత్య విమర్శకులు ప్రస్థానాలు, (రెండు భాగాలు) 2008
- 3. తెలుగు సాహిత్య విమర్శ దర్శనం, (విఙ్ఞాన సర్వస్వం) 2016
- 4. సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయ 2013