చల్లగుళ్ళ నరసింహారావు (1948 డిసెంబర్ 29 - 2022 మే 11) ప్రముఖ సాహితీవేత్త. రాజకీయ, సామాజిక విశ్లేషకులు. భారతదేశంలోనే తొట్టతొలి మనో విజ్ఞానపత్రిక ‘రేపు’ వ్యవస్థాపకుడు.[1]

జీవితచరిత్ర మార్చు

సి.నరసింహారావు 1948 డిసెంబర్ 29న కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో జన్మించారు. హైస్కూలు వయసులోనే త్రిపురనేని రామస్వామి చౌదరిపుస్తకాలతో పాటు ప్రపంచవ్యాప్త ప్రఖ్యాత రచయితల పుస్తకాలను ఆయన ఎక్కువగా చదివేవారు. త్రిపురనేని పుస్తకాల ప్రభావంతోనే తనకు ప్రశ్నించే అలవాటు ఏర్పడిందని ఆయన చెప్పేవారు. కొత్త విషయాలను నేర్చుకోవడం తన జీవితంలో భాగమని పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. నిరంతర శోధన, జ్ఞానార్జన పట్ల ఆయన ఎక్కువ మక్కువ చూపించేవారు. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోపాటు యువతలో చైతన్యం, స్ఫూర్తి నింపేలా పుస్తకాలు రాశారు. వీటిల్లో విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు అత్యంత ప్రాచూర్యం పొందాయి. 1992లో ‘కలం గళం’ పేరున స్వాతి వారపత్రికలో అనేక సామాజికాంశాలపైన ఆయన వ్యాసాలు రాశారు.[2] గత రెండు దశాబ్దాలుగా దాదాపు అన్నీ తెలుగు న్యూస్ ఛానళ్లలో వార్తల విశ్లేషణ కార్యక్రమంలో సి.నరసింహారావు పాల్గొని, సీనియర్ జర్నలిస్టుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేసేవారు. పలు పత్రికలలో వేలాది వ్యాసాలు వ్రాసారు.

పురస్కారాలు మార్చు

మరణం మార్చు

అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న 73 ఏళ్ల సి.నరసింహారావు 2022 మే 11న అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జ్యోతి, ఒక కుమారుడు హర్ష ఉన్నారు.

మూలాలు మార్చు

  1. "రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూత - Andhrajyothy". web.archive.org. 2022-05-12. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "మనసు మర్మాలు విప్పిన విజ్ఞాని - Andhrajyothy". web.archive.org. 2022-05-13. Archived from the original on 2022-05-13. Retrieved 2022-05-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.