అర్మ కొండ

(సీతమ్మ కొండ నుండి దారిమార్పు చెందింది)

అర్మకొండ, తూర్పు కనుమల ఉత్తర భాగంలో ఉన్న పర్వత శిఖరం. ఇది గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు గ్రామానికి ఉత్తరాన మాడుగుల కొండ ఉప-శ్రేణిలో ఉంది. దీన్ని సీతమ్మ కొండ అని, జిందగడ కూడా అంటారు.[3][4]

అర్మ కొండ
సీతమ్మ కొండ, జిందగడ
అర్మ కొండ is located in ఆంధ్రప్రదేశ్
అర్మ కొండ
అర్మ కొండ
ఆంధ్రప్రదేశ్ పటంలో అర్మ కొండ స్థానం
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు1,680 మీటర్లు (5,512 అ.)[1]
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్1,290 మీటర్లు (4,232 అ.)[1]
టోపోగ్రాఫిక్ ఐసొలేషన్907 కిలోమీటర్లు (564 మై.)[1]
నిర్దేశాంకాలు18°13′41″N 82°43′23″E / 18.228°N 82.723°E / 18.228; 82.723[2]
భౌగోళికం
స్థానంఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని, డుంబ్రిగుడ మండలం, హుకుంపేట మండలాల సరిహద్దులో
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు
పర్వత శ్రేణితూర్పు కనుమలు
అధిరోహణం
సులువుగా ఎక్కే మార్గంనడక / కాళ్ళూ చేతులతో ఎక్కడం

తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం

మార్చు

సముద్రమట్టం నుండి 1,680 మీటర్లు (5,510 అ.) ఎత్తున్న ఆర్మ కొండ, తూర్పు కనుమలలో కెల్లా ఎత్తైన శిఖరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కూడా ఎత్తైన పర్వత శిఖరం ఇదే. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లలో ఈ శిఖరానికి సీతమ్మ కొండ అని పేరు పెట్టారు. [5]

ఆర్మ కొండ టోపోగ్రాఫిక్ ఐసోలేషను [గమనిక 1] పరంగా భారతదేశంలో అనముడి తర్వాత రెండవ స్థానంలో ఉంది. అర్మకొండ ఐసొలేషను 907 కిలోమీటర్లు (564 మై.). [6]

మాడుగుల కొండ శ్రేణిలో ఉన్న ఇతర శిఖరాలు - గాలి కొండ (1,643 m), సింక్రం గుట్ట (1,620 m). [4]

ఇవి కూడా చూడండి

మార్చు
  • ఆంధ్రప్రదేశ్ భౌగోళికం
  • భారతదేశం లోని పర్వతాల జాబితా

గమనికలు

మార్చు
  1. ఓ పర్వత/కొండ శిఖరం నుండి, దాని అంత ఎత్తు లేదా దాని కంటే ఎక్కువ ఎత్తున్న మరో శిఖరం ఎంత దూరంలో ఉందో సూచించేందుకు వాడే పదం - "టోపోగ్రాఫిక్ ఐసొలేషను". ఓ పర్వత/కొండ శిఖరం దాని చుట్టూ ఉన్న అత్యంత లోతైన కాంటూరు లైను - దీనికంటే ఎత్తైన శిఖరం ఉండరాదు - కంటే ఎంత ఎత్తున ఉందో సూచించే పదాన్ని "టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్" అంటారు. దీన్ని రిలెటివ్ హైట్ అని కూడా అంటారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Arma Konda, India". Peak Bagger. Retrieved 2017-11-13.
  2. Arma Konda / Sitamma Konda (1680m)
  3. The Eastern Ghats
  4. 4.0 4.1 Nipuna. "దేశంలో మొట్టమొదటి బయోస్పియర్‌ రిజర్వ్? ( ఇండియన్‌ జాగ్రఫీ)". Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.
  5. 5 Hill Ranges of Indian Peninsular Plateau
  6. "World Peaks with 300 km of Isolation". Peak Bagger. Retrieved 2017-11-13.
"https://te.wikipedia.org/w/index.php?title=అర్మ_కొండ&oldid=4315399" నుండి వెలికితీశారు