సీతాపూర్
సీతాపూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, సీతాపూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలన మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. [1] సీతాపూర్ జిల్లా లక్నో డివిజన్‌లో ఉంది . ఈ పట్టణం సరాయన్ నది ఒడ్డున ఉంది. లక్నో, షాజహాన్పూర్ లకు సరిగ్గా మధ్యన ఉంది. జాతీయ రహదారి 24 ద్వారా లక్నోకు రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ ఒక కంటోన్మెంట్ ఉంది. బ్రిటిషు కాలంలో బ్రిటిష్ రెజిమెంటులో కొంత భాగం ఇక్కడ ఉండేది. [2]
సీతాపూర్ | |
---|---|
పట్టణం | |
నిర్దేశాంకాలు: 27°34′N 80°40′E / 27.57°N 80.66°ECoordinates: 27°34′N 80°40′E / 27.57°N 80.66°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | సీతాపూర్ |
స్థాపన | 1857 |
పేరు వచ్చినవిధం | సీతాదేవి |
సముద్రమట్టం నుండి ఎత్తు (in meters) | 138 మీ (453 అ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 1,77,351 |
• సాంద్రత | 630/కి.మీ2 (1,600/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఉర్దూ |
ప్రామాణిక కాలమానం | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 261001 |
జాలస్థలి | sitapur |
రవాణా సౌకర్యాలుసవరించు
రైలుసవరించు
సీతాపూర్‌లో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రధానమైన రైల్వే స్టేషను సీతాపూర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషను. జల్పాయిగురి నుండి అమృత్సర్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. జన సాధారణ్ ఎక్స్‌ప్రెస్, జన నాయక్ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్-సహర్సా ఎక్స్‌ప్రెస్, కర్మభూమి ఎక్స్‌ప్రెస్, జానసేవా ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు. సీతాపూర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తాయి.
రెండో స్టేషను సీతాపూర్ సిటీ జంక్షన్ రైల్వే స్టేషను. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. సీతాపూర్ నగరం నుండి ప్యాసింజర్ రైళ్లు ఉన్నావ్, బాలమౌ, షాజహాన్పూర్ లకు వెళ్తాయి.
మూలాలుసవరించు
- ↑ "Sitapur Up Travel Guide". Goibibo.com. 19 June 2020.
- ↑ Bhatt, Vijay Kumar (2016). Asst. Director. Kanpur: Ministry of MSME, Government of India. pp. http://dcmsme.gov.in/dips/DIP%20Sitapur%20VKB%20AD%20EI.pdf.