సీమా సింగ్
సీమా సింగ్ (జననం 1990 జూన్ 11) హెలెన్, ఐటెమ్ క్వీన్ అని కూడా సుపరిచితురాలైన ఆమె, ఒక భారతీయ చలనచిత్ర నటి, నర్తకి, మోడల్, టెలివిజన్ ప్రెజెంటర్, రాజకీయవేత్త కూడా.[1] భోజ్‌పురి సినిమారంగంలో అత్యంత ప్రసిద్ధ ఐటెమ్ సాంగ్ డాన్సర్లలో ఆమె ఒకరు. ఆమె భోజ్‌పురి ఫిల్మ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది.[2][3][4]
సీమా సింగ్ | |
---|---|
सीमा सिंह | |
జననం | సీమా కుమారి సింగ్ 11 June 1990 (age 34) |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | ఐటెమ్ క్వీన్, హెలెన్ |
విద్యాసంస్థ | ముంబయి విశ్వవిద్యాలయం |
వృత్తి | నటి, నర్తకి, టెలివిజన్ ప్రెజెంటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఐటమ్ సాంగ్స్ |
రాజకీయ పార్టీ | లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) |
జీవిత భాగస్వామి | సౌరభ్ కుమార్ సింగ్ (m. 2019) |
పిల్లలు | ఒక కుమారుడు, శివాయ్ |
పురస్కారాలు | భోజ్‌పురి ఫిల్మ్ అవార్డు |
వ్యక్తిగత జీవితం
మార్చుసీమా సింగ్ 2019 మార్చి 13న బీహార్ షేఖ్‌పురా జిల్లా బార్బిఘాకు చెందిన వ్యాపారవేత్త సౌరవ్ కుమార్ సింగ్ ను వివాహం చేసుకుంది.[5][6] వీరికి శివాయ్ అనే కుమారుడు ఉన్నాడు.[7][8]
కెరీర్
మార్చుసినిమా
మార్చు2008లో దినేష్ లాల్ యాదవ్ నిరహువా నటించిన కహాన్ జైబా రాజా నమరీ లడై కే చిత్రంలో సీమా సింగ్ ఐటమ్ గర్ల్ గా అరంగేట్రం చేసింది.
ఆ తరువాత, ఆమె చోడాబ్ నా సాంగ్ తోహార్ (2011), హమ్ దో అంజానే (2011), హీరో (2012), హిమ్మత్వాలా (2012), దిలర్ (2013), ప్రేమ్ దివానీ (2013), రాజా బాబు (2015), విజయపథ్ (2015), హమ్ హై లూటేరే (2017), డ్రీమ్ జిందగి (2017) తదితర చిత్రాలలో ఐటెమ్ గర్ల్ గా మెప్పించింది.
రాజకీయ జీవితం
మార్చువ్యాపారవేత్త అయిన తన భర్త సౌరవ్ కుమార్ సింగ్ తో కలిసి సీమా సింగ్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)లో జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సమక్షంలో 2023 ఏప్రిల్ 4న చేరింది.[9][10][11] బీహార్ ఫస్ట్ బిహారీ ఫస్ట్ అనే ఇతివృత్తం తనను ప్రభావితం చేసిందని ఆమె చెప్పింది.[12]
మూలాలు
మార్చు- ↑ "भोजपुरी की आइटम क्वीन, जिसे लोग कहते हैं 'हेलेन'". www.aajtak.in (in హిందీ). 2022-09-01. Retrieved 2023-09-15.
- ↑ Gautam, Usha Wagle. "Thousands attend musical programme on second day of Eid al-Fitr". Gulf Times. Qatar. Retrieved 11 July 2017.
- ↑ "Seema Singh wins Dancing Queen award". The Times of India. Bhojpurimedia.com. 10 January 2017. Retrieved 11 July 2017.
- ↑ "Seema Singh adjudged 'Best Item Girl'". The Times of India. Bhojpurimedia.com. 13 January 2017. Retrieved 11 July 2017.
- ↑ "Seema Singh celebrates first wedding anniversary with husband Saurav Kumar with a happy memory from their wedding day". The Times of India. 2020-03-13. ISSN 0971-8257. Retrieved 2023-09-15.
- ↑ "भोजपुरी फिल्मों की 'हेलन' सीमा सिंह इस बिजनेसमैन संग लेने जा रहीं सात फेरे, जानें उनकी दिलचस्प Love story". Patrika News (in హిందీ). 2019-03-04. Retrieved 2023-09-15.
- ↑ "Seema Singh pens an emotional note for hubby Saurav Kumar and son Shivaay". The Times of India. 2021-08-05. ISSN 0971-8257. Retrieved 2023-09-15.
- ↑ "Seema Singh celebrates son Shivaay's four months birthday; see pics". The Times of India. 2021-07-13. ISSN 0971-8257. Retrieved 2023-09-15.
- ↑ "Chirag Paswan : चाचा पारस प्रवक्ता ले गए तो भतीजे चिराग ने भोजपुरी की इस एक्ट्रेस को पार्टी में लाकर दिया जवाब". Amar Ujala (in హిందీ). Retrieved 2023-09-15.
- ↑ "Bhojpuri Actress: 'आइटम क्वीन' ने ज्वाइन की चिराग पासवान की LJPR, एक्ट्रेस ने इंस्टाग्राम पर दी जानकारी". Dainik Jagran (in హిందీ). Retrieved 2023-09-15.
- ↑ Desk, Prabhat Khabar Digital (2023-04-10). "भोजपुरी अभिनेत्री ने ज्वाइन की चिराग पासवान की पार्टी, जानें कौन है सीमा सिंह". Prabhat Khabar (in హిందీ). Retrieved 2023-09-15.
- ↑ "भोजपुरी आइटम क्वीन की राजनीति में एंट्री, थामा चिराग पासवान की पार्टी का हाथ". Jansatta (in హిందీ). 2023-04-04. Retrieved 2023-09-15.