సీసా (సినిమా)
సీసా 2016, మార్చి 18న విడుదలైన తెలుగు భయానక చలనచిత్రం. మహ్మద్ ఇస్సాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, చేస్వా, నర్మత నటించగా, కె. భాస్కర్ సంగీతం అందించాడు.[1] తమిళ మాతృక అగాడమ్ సినిమా మాదిరిగానే ఈ చిత్రం కూడా సింగిల్ టేక్ లో చిత్రీకరించబడింది.[2]
సీసా | |
---|---|
దర్శకత్వం | మహ్మద్ ఇస్సాక్ |
రచన | మహ్మద్ ఇస్సాక్ |
నిర్మాత | రాజశేఖర్ నల్లూరి మహ్మద్ ఇస్సాక్ ఎండి రజియా బీ |
తారాగణం | శివాజీ చేస్వా నర్మత |
ఛాయాగ్రహణం | ఈ.జె. నౌజాద్ |
సంగీతం | కె. భాస్కర్ |
విడుదల తేదీ | మార్చి 18, 2016 |
సినిమా నిడివి | 123 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా సారాంశం
మార్చుఇది మానవ భావోద్వేగాలకు సంబంధించిన థ్రిల్లర్ చిత్రం. సీసాలో ఉన్న దెయ్యం తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందించబడింది.
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: మహ్మద్ ఇస్సాక్
- నిర్మాత: రాజశేఖర్ నల్లూరి, మహ్మద్ ఇస్సాక్, ఎండి రజియా బీ
- రచన: మహ్మద్ ఇస్సాక్
- సంగీతం: కె. భాస్కర్
- ఛాయాగ్రహణం: ఈ.జె. నౌజాద్
రిమేక్
మార్చుతమిళ చిత్రం అగాడమ్ సినిమా ఆధారంగా సీసా చిత్రం రూపొందించబడింది. అగాడమ్ 2 గంటల 3 నిమిషాల 30 సెకన్లపాలు సింగిల్ షాట్‌లో చిత్రీకరించబడి ప్రపంచ సినిమా చరిత్రలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌గా నిలిచింది. రష్యన్ ఆర్క్ సినిమా 96 నిమిషాల స్టెడికామ్ సీక్వెన్స్ షాట్‌తో ఉన్న రికార్డును దాటి ఈ చిత్రం రికార్డులో నిలిచింది.[3][4]
విడుదల
మార్చు2016, మార్చి 18న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విడుదలయింది.
మూలాలు
మార్చు- ↑ "Seesa Movie Review". Indiaglitz. 16 March 2016. Retrieved 5 February 2020.
- ↑ "Whole film shot in one take!". India Glitz. 12 March 2016. Retrieved 5 February 2020.
- ↑ "Festival de Cannes: Russian Ark". festival-cannes.com. Archived from the original on 22 ఆగస్టు 2011. Retrieved 5 February 2020.
- ↑ "Sivaji Has A Highly Demanding Role In Seesa". oneindia. 17 Aug 2013. Archived from the original on 21 ఆగస్టు 2013. Retrieved 5 February 2020.