సుంకం అచ్చాలు
సుంకం అచ్చాలు (1924, మార్చి 3 – 1983, ఆగష్టు 9) భారతీయ రాజకీయనాయకుడు. ఈయన 1952 నుండి 1957 వరకు, తొలి లోక్‌సభలో నల్గొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.
సుంకం అచ్చాలు | |||
1952లో సుంకం అచ్చాలు | |||
పార్లమెంటు సభ్యుడు
| |||
నియోజకవర్గం | నల్గొండ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 3 మార్చి 1924 నల్గొండ, హైదరాబాదు రాజ్యం | ||
మరణం | 1983 ఆగస్టు 9 | (వయసు 59)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేస్ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ | ||
జీవిత భాగస్వామి | లింగమ్మ |
ప్రారంభ జీవితం
మార్చుసుంకం అచ్చాలు 1924, మార్చి 3న నల్గొండలో జన్మించాడు. ఈయన తండ్రి కాశయ్య.[1] ఈయన బడిలో చదువుకోలేదు, రైతుగా పనిచేశాడు.[1] ఇంట్లోనే ఉర్దూ, తెలుగు చదవటం, వ్రాయటంతో పాటు కొంత ఆంగ్లభాష కూడా నేర్చుకున్నాడు.[2] 1946లో లింగమ్మను పెళ్ళిచేసుకున్నాడు.[1] ఈయన నల్గొండ పట్టణంలో బట్టుగూడ ప్రాంతంలో నివసించేవాడు.[3]
సామాజికసేవ, రాజకీయాలు
మార్చుసుంకం అచ్చాలు షెడ్యూల్డు కులాల ఉద్ధరణకు సుదీర్ఘమైన కృషిచేశాడు. చిన్నవయసులోనే భారత జాతీయ కాంగ్రేసు కార్యకర్త అయ్యాడు. ఆ తర్వాత కాలంలో కాంగ్రేసును వీడి షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ నాయకుడయ్యాడు.[2] 1948 నుండి 1950 వరకు షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ నల్గొండ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన హైదరాబాదు షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ కార్యవర్గంలో సభ్యుడిగా కూడా ఉన్నాడు.[1]
రాజకీయాలు
మార్చు1952 సార్వత్రిక ఎన్నికలకు ముందు లోక్‌సభకు పోటీచేసేందుకు ఎస్.సి.ఎఫ్ ఈయనకు టికెట్టు నిరాకరించడంతో, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్ధిగా షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన నల్గొండ నియోజకవర్గం నుండి పోటీచేశాడు.[1][4] ద్విసభ్య నియోజకవర్గమైన నల్గొండలో ఈయన రావి నారాయణరెడ్డి సహ అభ్యర్ధి. [2] సుంకం అచ్చాలు ఆ ఎన్నికలలో దేశంలోనే అత్యధిక ఓట్ల తేడాతో గెలుపొందాడు.[1][4] ఈయన 282,117 ఓట్లు పొందాడు.[5] ఈయన ప్రధాన ఎస్.సి.ఎఫ్ అభ్యర్ధి డిపాజిట్ కూడా కోల్పోయాడు. 27 ఏళ్ళ వయసులో సుంకం అచ్చాలు అప్పట్లో ఆత్యంత పిన్నవయస్కుడైన పార్లమెంటు సభ్యులలో ఒకడు.[2]పార్టీ సభ్యుడు కాకపోయినా, సుంకం అచ్చాలు లోక్‌సభలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ బృందంతో పాటు కూర్చునేవాడు. షెడ్యూల్డ్ కులాల ఉద్ధరణపై కృషిచేసేందుకు కమ్యూనిస్టులను పురికొల్పే ప్రయత్నాలు చేసేవాడు.[2]
అచ్చాలు 1962లో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేసి కాంగ్రేసు పార్టీకి చెందిన కె.నాగన్న చేతిలో ఓడిపోయాడు.
మరణం
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Lok Sabha. Members Bioprofile: ACHALU, SHRI SUNKAM
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 Hari Sharan Chhabra (1952). Opposition in the Parliament: a unique, authentic and comprehensive biographical dictionary of M. P.'s on opposition benches. New Publishers. p. 40.
- ↑ Subodh Chandra Sarkar (1952). Indian Parliament and state legislatures: being the supplement to Hindustan year book, 1952. M.C. Sarkar. p. 120.
- ↑ 4.0 4.1 Gail Omvedt (30 January 1994). Dalits and the Democratic Revolution: Dr Ambedkar and the Dalit Movement in Colonial India. SAGE Publications. p. 273. ISBN 978-81-321-1983-8.
- ↑ Election Commission of India. STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1951 TO THE FIRST LOK SABHA - VOLUME I (NATIONAL AND STATE ABSTRACTS & DETAILED RESULTS)
- ↑ Lok Sabha Debates. Lok Sabha Secretariat. 1983. p. 1.
- ↑ The Journal of Parliamentary Information. Lok Sabha Secretariat. 1983. p. 355.