పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్)
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది హైదరాబాద్ స్టేట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన మాస్ ఫ్రంట్.
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | |
---|---|
రంగు(లు) | |
ECI Status | నిష్ఫలమైన పార్టీ |
1952 ఎన్నికల నాటికి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఉండడం వల్ల, ఎన్.ఎం.జయసూర్య నాయకత్వంలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, హైదరాబాదు రాష్ట్ర శాసనసభలోని తెలంగాణా ప్రాంతానికి చెందిన 90 స్థానాల్లో 48 స్థానాలను, లోక్‌సభలో ఏడు స్థానాలు గెలుచుకున్నది. జయసూర్య స్వయంగా మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు, హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి రెండు స్థానాల్లోనూ గెలుపొందాడు.[1]
హైదరాబాద్‌లోని మొత్తం 25 ఎంపీ స్థానాల్లో, మొదటి లోక్‌సభ కాలంలో పీడీఎఫ్ 7 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ ఏడుగురు ఎంపీల్లో తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులు కూడా ఉన్నారు.
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ మొదటి లోక్‌సభ సభ్యులు
మార్చు- రాంచందర్ గోవింద్ పరాంజపే (భీడ్)
- బద్దం ఎల్లారెడ్డి (కరీంనగర్)
- టి.బి.విఠల్ రావు (ఖమ్మం)
- ఎన్.ఎం.జయసూర్య (మెదక్)
- రావి నారాయణరెడ్డి (నల్గొండ)
- సుంకం అచ్చాలు (నల్గొండ-ఎస్సీ)
- పెండ్యాల రాఘవరావు (వరంగల్)