సుందర్ సీ

(సుందర్.సీ నుండి దారిమార్పు చెందింది)

సుందర్ సీ తమిళ చలనచిత్ర దర్శకులు, నటుడు. వీరు తమిళనాడులోని ఈరోడు జిల్లాలో జన్మించారు, తమిళంలో 24 సినిమాలకు దర్శకత్వం వహించారు. "తలై నగరం" చిత్రముతో హీరోగా మారారు.[1] తొలి నాళ్ళలో, మణివణ్ణన్ గారి దగ్గర సహాయకులుగా ఉన్న వీరు ముఱై మామన్ అనే హాస్యరసప్రధాన చిత్రముతో మొదటిసారి దర్శకులురా మారారు. వీరి తెరకెక్కించిన కొన్ని చిత్రములలో హీరోయిన్ పాత్ర పేరు "ఇందు" అనబడుతుంది .

సుందర్ సీ
సుందర్ సీ
జననం
సుందరవేల్ చిదంబరం పిళ్ళై

(1968-01-21) 1968 జనవరి 21 (వయసు 56)
India ఈరోడు, తమిళనాడు
వృత్తినటులు,
చలనచిత్ర దర్శకులు
క్రియాశీల సంవత్సరాలు1995 – ఇప్పటి వరకు
జీవిత భాగస్వామికుష్బూ
తల్లిదండ్రులుచిదంబరం పిళ్ళై
దెయివానై అమ్మాళ్

సినీరంగప్రవేశం

మార్చు

దర్శకులుగా

మార్చు

1995-వ సంవత్సరం ముఱై మామన్ అనే హాస్యరసప్రధాన చిత్రముతో సుందర్ సీ మొదటిసారి దర్శకులురా మారారు, ఆ తర్వాత ముఱైమాప్పిళ్ళై, అని నటుడు విజయకుమార్ తనయుడు అరుణ్ విజయ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్ గారితో అరుణాచలం, కమల్ హాసన్తో శివం మాత్రమే కాక మరికొందరి నటులతో అనగా కార్తీక్, ప్రశాంత్, అర్జున్, శరత్ కుమార్, అజీత్ కుమార్ మొదలైనవారి చిత్రములకు దర్శకత్వం వహించారు.ఇయన తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన చిత్రం సమ్ థింగ్ సమ్ థింగ్ .

నటుడిగా

మార్చు

2006-వ సంవత్సరం అతని దర్శకత్వపు వృత్తిని విరమించి,తలై నగరం చిత్రముతో హీరోగా మారారు. ఆరంభ దశలో పరాజయం పొందినప్పటికీ తదుపరి ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. 2007-వ సంవత్సరం విడుదలైన వీరాప్పు సినిమానూ, 2008-వ సంవత్సరం విడుదలైన శండై సినిమానూ విజయం పొందాయి.[2]

బుల్లి తెర ప్రవేశం

మార్చు

2017-వ సంవత్సరం దక్షిణ భారత నాలుగు భాషలలో ఏకకాలంలో నందిని అనే దారవాహికను స్వయంగా తన సతీమణి కుష్బూ గారితో కలిసి నిర్మించారు.చలనచిత్రాన్ని తలపించేలా ఆ దారవాహికను రూపుదిద్ది ప్రముఖుల మన్ననలు అందుకున్నారు.అంతేకాక, ఈ దారవాహికకు పాక్షికంగా కథనందించారు.

మూలాలు

మార్చు
  1. "Sundar C. is on a roll". தி இந்து. 2 October 2007. Archived from the original on 29 అక్టోబరు 2007. Retrieved 8 May 2010.
  2. Retrieved on 2009-02-05 Archived 2016-03-04 at the Wayback Machine. Bollywoodgate.com. Retrieved on 2012-04-19.

బయట లింకులు

మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=సుందర్_సీ&oldid=4221598" నుండి వెలికితీశారు