నటించే వారిని నటులు అంటారు. మగవారిని నటుడు అని ఆడ వారిని నటి అని అంటారు. ఈ నటించే వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి సినిమా, టెలివిజన్, థియేటర్, లేదా రేడియోలలో పని చేస్తాడు. నటుడిని ఆంగ్లంలో యాక్టర్ అంటారు. యాక్టర్ అనే పదం పురాతన గ్రీకు పదము ὑποκριτής (hypokrites) నుండి ఉద్భవించింది. సాహిత్యపరంగా ఈ పదం యొక్క అర్థం ఒక వ్యక్తి నాటకీయమైన పాత్రను పోషించడం అనే అర్థానిస్తుంది.

నటులు

చరిత్ర

మార్చు

ఇంగ్లాండ్లో 1660 తరువాత మొదటిసారి మహిళలు స్టేజిపై కనిపించారు, నటుడు, నటి ప్రారంభంలో మహిళ ప్రదర్శన కోసం ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు, కానీ తరువాత ఫ్రెంచ్ నటీమణుల (actrice) ప్రభావంతో actor శబ్దవ్యుత్పత్తికి ess జతచేశారు, దానితో యాక్టర్ (నటుడు), యాక్ట్రెస్ (నటి) పదాలు ప్రాధాన్యత పొందాయి.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నటులు&oldid=4015464" నుండి వెలికితీశారు