సుంద‌రాంగుడు (2021 సినిమా)

సుంద‌రాంగుడు 2021లో నిర్మిస్తున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా. ఎమ్ఎస్‌కె ప్ర‌మిద శ్రీ ఫిలింస్ ప‌తాకంపై అనిశెట్టి వెంక‌ట సుబ్బారావు స‌మ‌ర్ప‌ణ‌లో బీసు చంద‌ర్ గౌడ్‌, ఎమెఎస్‌కె రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఎమ్‌.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కృష్ణ సాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.[1] ఈ సినిమా టీజర్‌ను 2021, మే 8న విడుదల చేశారు.[2][3]

సినిమా పోస్టర్

కథ మార్చు

ఈ సినిమాలో హీరో జమీందార్‌ బిడ్డ. డబ్బు ఉందనే అహంకారంతో అన్ని తనకే దక్కాలని, అందమైన అమ్మాయిలను వశపర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ అతనికి ఏ ఒక్క అమ్మాయి పడకపోగా, ప్రతి అమ్మాయి అవమానిస్తుంది. తనను అవమాన పరిచిన అమ్మాయిలను ఎలా వశపర్చుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు మార్చు

  • కృష్ణ సాయి
  • దేవకన్య మౌర్యాని[4]
  • జీవా
  • జూనియర్ రేలంగి
  • బాషా
  • మిర్చి మాధవి
  • శివకృష్ణ

సాంకేతిక వర్గం మార్చు

  • ఎడిటింగ్‌: నందమూరి హరి
  • ఫైట్స్‌: రామ్‌ సుంకర
  • కొరియోగ్రఫీ: పాల్‌, సూర్య కిరణ్‌
  • ఛాయాగ్రహణం: వెంకట్‌ హనుమాన్‌
  • సంగీతం: సిద్ధ బాపు
  • నిర్మాత: బీసు చందర్‌ గౌడ్‌
  • కథ, కథనం, మాటలు, పాటలు,దర్శకత్వం: ఎం. వినయ్ బాబు

మూలాలు మార్చు

  1. The New Indian Express (27 May 2020). "It's a wrap for Krishna Sai's Sundarangudu" (in ఇంగ్లీష్). Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  2. Andhrajyothy (8 May 2021). "'సుంద‌రాంగుడు' టీజ‌ర్ విడుదల". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.
  3. Namasthe Telangana (8 May 2021). "సుందరాంగుడి ప్రేమాయణం". Namasthe Telangana. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021.
  4. Filmy Today. "Mouryani - Sundarangudu Movie Shooting Spot Coverage & Press Meet Photos". filmytoday.com. Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021.