సుగంధ ద్రవ్యం

వంటకాలకు ప్రత్యేక రుచిని సంతరించుటకు మొక్కల భాగాల నుండి తయారు చేయబడే పదార్థాలు (దినుసులు)
(సుగంధ ద్రవ్యము నుండి దారిమార్పు చెందింది)

సుగంధ ద్రవ్యాలు వంటకాలకు ప్రత్యేక రుచిని సంతరించుటకు మొక్కల భాగాల నుండి తయారు చేయబడే పదార్థాలు (దినుసులు). వీటిని ఉష్ణమండల సుగంధ మొక్కల బెరడు, విత్తనాలు, వేర్లు, పండ్లు, గింజల నుండి తయారు చేస్తారు. కొన్ని సుగంధ ద్రవ్యాలను చాలా అస్పష్టమైన, మృదువైన మొక్క కణజాలంతో తయారు చేస్తారు. మొక్కల ఆకులు, పువ్వులు, కొమ్మల నుండి తయారు చేసిన దినుసులను మూలికలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా సుగంధ ద్రవ్యాలు బలమైన రుచి కలిగియుంటాయి. వాటిని ఎండబెట్టి ఉపయోగిస్తారు. ప్రస్తుత సుగంధ ద్రవ్యాలు, మూలికలు మానవ నాగరికత ప్రారంభం నుండే ఉపయోగించబడుతున్నాయి. ఎప్పుడు మానవులూ సుగంధ ద్రవ్యాల ప్రభావానికి ఆకర్షించబడినారో, అపుడు వివిధ మొక్కల భాగాల నుండి వివిధ సుగంధ ద్రవ్యాలను తీయడం ప్రారంభించారు. ఆసక్తికరంగా, మానవులు ఆకర్షించే ఈ ద్రవ్యాలలో కొన్ని ప్రకృతిలో విషంతో లేదా జంతువుల వ్యతిరేక వికర్షకాలతో కూడి ఉన్నవి.

భారతదేశంలోని గోవాలో స్థానికంగా అమ్మబడుతున్న *

సుగంధద్రవ్యాల చరిత్ర

మార్చు

మధ్యప్రాచ్యంలో సా.శ.పూ 2000 ముందు గొప్ప విలువగల సుగంధ ద్రవ్యాలలైన ఉత్తమ దాల్చిన చెక్క, దాల్చిన చెక్క (సునాముఖి), నల్ల మిరియాలు మొదలగు వాటితో జరిగిన లాభసాటి వాణిజ్య వ్యాపారాల ద్వారా ఆ ప్రదేశంలో ఆర్థికాభివృద్ధి జరిగింది. అనేక శతాబ్దాలుగా అరబ్ వ్యాపారులు భారతదేశానికి వెళ్ళే వర్తక భూమార్గాలను నియంత్రించారు. కానీ ఎప్పుడైతే సముద్రమార్గాలు కనుగొనబడ్డవో ఈజిప్ట్ లో రోమన్-నియంత్రిత అలెగ్జాండ్రియా ఒక వాణిజ్య కేంద్రంగా మారింది. 13 నుండి 15 వ శతాబ్దం వరకు, వెనిస్ మధ్య ప్రాచ్యంతో సుగంధద్రవ్యాల గుత్తాధిపత్యం సాధించారు. వెనిస్ అన్యాయమైన ధరలు డిమాండ్ చేసేసరికి పోర్చుగల్, స్పెయిన్ దేశాలు తూర్పు ప్రాంతములో గుడ్ హోప్ అగ్రము చుట్టూ సుగంధ ద్రవ్యాల ద్వీపాలపైపు దృష్టి సారించాయి. అపుడు ప్రారంభ అన్వేషకులు అనేకమంది ఉన్నప్పటికీ క్రిస్టోఫర్ కొలంబస్ పశ్చిమంగా శోధించి బంగారం కనుగొన్నాడు. ఈ యాత్రలకు ఎక్కువ సుగంధ ద్రవ్య వర్తకుల ఆర్థిక మద్దతు లభించేది.

ఆధునిక ఉత్పత్తి

మార్చు

ప్రస్తుతం అన్ని సుగంధ ద్రవ్యాలు, మూలికలు సులువుగా అమ్మబడుతున్నవి. రవాణా, వాణిజ్య రంగాల పురోగతితో పాటు సుగంధ ద్రవ్యాలను అవి కనుగొనబడ్డ ప్రదేశాలలోనే కాక ప్రపంచం నలుమూలలా కూడా పండించడం దీనికి కారణాలు. "టిడోర్" లోని ఉదాహరణకు స్పెయిన్ కు చేరిన ఫెర్డినాండ్ మాగెల్లాన్ నౌకాదళంలో మనుగడలో ఉన్న ఏకైక ఓడ లోని అతి విలువైన లవంగాలు ఇప్పుడు జాంజిబార్, మడగాస్కర్ దీవుల తోటలలో సాగు చేస్తారు. ఒకప్పుడు చైనాలో మాత్రమే దొరికే అల్లం, ఇప్పుడు జమైకా, నైజీరియాలో పండిస్తున్నారు. మోలుకాస్ స్థానిక జాజికాయ, ఇప్పుడు గ్రెనడా పెరుగుతుంది. నవీన ప్రపంచంలో ముఖ్యమైన మిరియాలు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు.

భూగోళం పై 70% ఉత్పత్తులను భారతదేశం ఉత్పత్తి చేస్తుంది.

2010లో అత్యధికంగా సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలు
దేశం ఉత్పత్తి (టన్నుల్లో) గమనిక
  భారతదేశం 1,051,000 Im
  Bangladesh 128,517
  Turkey 107,000 *
  China 81,600 Im
  పాకిస్తాన్ 53,647
  Nepal 20,400 Im
  Colombia 14,900 Im
  ఇరాన్ 11,500 Im
  Burkina Faso 5,800 Im
  Sri Lanka 5,200 Im
ప్రపంచం 1,545,734
* = అనధికారిక సమాచారం | [ ] = అధికారిక సమాచారం | అ = అధికారిక, పాక్షిక అధికారిక, అనధికారిక, అంచనా వేయబడ్డ వివిధ సమాచారాల ఆధారంగా
F = ఆవస అంచన | Im = FAO data based on imputation methodology | M = సమాచారం లేదు

Source: ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థ (ఆవస) [UN Food & agricultural organisation (FAO)] (FAO)[1]

రకాలు

మార్చు

సుగంధ ద్రవ్యాలను ముఖ్యంగా మూడు రకాలుగా విభజించవచ్చు.

1. వృక్ష సంబంధమైన సుగంధ ద్రవ్యాలు: దాల్చినచెక్క, జాజికాయ, జాపత్రి, లవంగాలు మొదలగునవి.

2. గింజ సుగంధ ద్రవ్యాలు: ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు మొదలగునవి.

3. ఇతర సుగంధ ద్రవ్యాలు: మిరియాలు, యాలకులు, పసుపు, అల్లం వంటివి. ఇవేకాకుండా మిరప, ఉల్లి, వెల్లుల్లి మొదలైన వాటిని కూడా సుగంధ ద్రవ్యాలుగా చెప్పవచ్చు.

భారతీయ సాంప్రదాయ వంటలలో, పిండి వంటల తయారీలో సుగంధ ద్రవ్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కేవలం దేశంలో వినియోగానికేకాక, వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం వలన కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Major Food And Agricultural Commodities And Producers - Countries By Commodity". Fao.org. Archived from the original on 2012-06-19. Retrieved 2012-06-12.

వెలుపలి లంకెలు

మార్చు

బయటి లింకులు

మార్చు