క్రిస్టోఫర్ కొలంబస్

(కొలంబస్ నుండి దారిమార్పు చెందింది)

క్రిస్టోఫర్ కొలంబస్ (ఆగష్టు 26 (లేదా ఆగష్టు అక్టోబరు మధ్య), 1451 - మే 20, 1506) ఇటలీకి చెందిన ఒక నావికుడు, ప్రపంచ యాత్రికుడు. స్పెయిన్ రాజు సహకారంతో అట్లాంటిక్ సముద్రం పై ఆయన సాగించిన యాత్ర, పశ్చిమార్థగోళంలో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది.

క్రిస్టోఫర్ కొలంబస్
Christophorus Columbus(Italian),
Cristoforo Colombo(Spanish)
సెబాస్టినో డెల్ పియాంబో గీచిన క్రిస్టోఫర్ కొలంబస్ చిత్రం
జననంఆగష్టు 26 (లేదా ఆగష్టు, అక్టోబరు మధ్య), 1451
మరణం1506 మే 20
వల్లాడొలిడ్, స్పెయిన్
జాతీయతజియోవావీస్
ఇతర పేర్లుక్రిస్టోఫోరో కొలంబో
క్రిస్టొబాల్ కొలన్
వృత్తిMaritime explorer for the Crown of Castile
బిరుదుఅడ్మిరల్ ఆఫ్ ది ఓషియన్ సీస్, వైస్రాయ్ అండ్ గవర్నర్ ఆఫ్ ది ఐలాండ్స్
జీవిత భాగస్వామిఫిలిపా మొనిజ్ (c. 1476-1485)
పిల్లలుడియాగొ
ఫెర్డినాండో
బంధువులుGiovanni Pellegrino, Giacomo and Bartolomeo Columbus (brothers)

బాల్యం

మార్చు

కొలంబస్ 1451లో ఆగస్టు, అక్టోబరు మధ్య నవీన ఇటలీలో భాగమైన జెనోవాలో జన్మించి ఉండవచ్చునని చాలామంది భావన. ఈయన కచ్చితమైన జన్మదినంపై వాదోపవాదాలున్నాయి. ఈయన తండ్రి పేరు డొమెనికో కొలంబో. ఒక మధ్య తరగతి ఉన్ని వస్త్రాల నేతగాడు.

సముద్ర యానం

మార్చు

1492 లో క్రిస్టఫర్ కొలంబస్ భారత్ కు సముద్రమార్గం కనుగొనబోయి అమెరికా దీవుల్ని కనుగొన్నాడు. ఉత్సాహంగా తాను భారత్ చేరానని ప్రకటించుకున్నాడు. తర్వాత తెలిసింది అది మరో క్రొత్త ఖండమనీ. దాంతో స్థానిక గిరిజనులకి రెడ్ ఇండియన్లనీ, దీవులకి పశ్చిమ ఇండియా దీవులనీ పేరు పెట్టారు. తాము దోచుకోవడానికి మరో విశాల భూఖండం దొరికింది కదాని యూరోపియన్లు తెగ సంబరపడ్డారు. అనంతర అమెరికా స్వాతంత్ర్య సమరం గురించి, వాషింగ్టన్ నాయకత్వం గురించీ అందరికీ తెలిసిందే.

చరిత్రకు పూర్వం

మార్చు

చరిత్ర పూర్వ హిమ యుగానికి ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతాన్ని ఆసియా ఖండంలోని సైబీరియాతో కలుపుతూ సుమారు 1,000 మైళ్లు (1,600 కి.మీ.) పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెనగా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిర పడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు.

హిమ యుగాంతాన (దాదాపు 11,000 సంవత్సరాల క్రితం) బేరింగ్ భూమార్గ వంతెన సముద్రంలో మునిగిపోవటంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1493, నవంబరు 19 న పసిఫిక్ మహా సముద్రంలోని ప్యూర్టోరికో దీవిలో అడుగు పెట్టే వరకూ వీరినీ, వారితో పాటు రెండు అమెరికా ఖండాల ఉనికినీ మిగతా ప్రపంచం మర్చిపోయింది.

అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో కొలంబియా అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది. ప్రస్తుతం ఈ పేరుతో దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు. క్రిస్టఫర్ కొలంబస్ 1492 అక్టోబరు 12క్యూబాను మొదటిసారిగా తన నౌకాయాత్రలో సందర్శించాడు

కొలంబస్ జీవితంలో ముఖ్య ఘటనలు

మార్చు

గ్రంథములు:

మార్చు

Born—c.1451, Maybe Genoa, Liguria Died 20 May 1506 (aged c. 55) Valladolid, Castile Nationality Disputed Other names - Genoese: Christoffa Corombo ; Italian: Cristoforo Colombo

Occupation - Maritime explorer for the Crown of Castile Title - Admiral of the Ocean Sea; Viceroy and Governor of the Indies Religious beliefs - Roman Catholic Spouse (s) - Filipa Moniz (c. 1476-1485) Children - Diego, Fernando Relatives - Giovanni Pellegrino, Giacomo and Bartolomeo Columbus (brothers)

మూలాలు

మార్చు