రెక్కలు ప్రక్రియ సృష్టికర్తగా పేరుగాంచిన సుగమ్‌బాబు[1] అసలు పేరు మహబూబ్ ఖాన్. ఇతడు 1944, ఏప్రిల్ 1న గుంటూరు లో సకీనాబీబీ, ఫరీద్‌ఖాన్‌లకు జన్మించాడు. బి.ఏ. చదువుకున్నాడు. పైగంబరకవులలో ఒకడైన సుగమ్‌బాబు 2003లో రెక్కలు అనే నూతన ప్రక్రియను ప్రవేశపెట్టాడు. హిబ్రూ విశ్వవిద్యాలయం, ఇజ్రాయేల్‌కు చెందిన సుర్మన్ డేవిస్ ఈ రెక్కలను 'వింగ్స్' పేరుతో ఇంగ్లీషులో అనువదించడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియకు ఆదరణ లభించింది.

సుగమ్‌బాబు ఎం.కె.
జననంమహబూబ్ ఖాన్
(1944-04-01) 1944 ఏప్రిల్ 1 (వయసు 80)
India గుంటూరు , గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంగుంటూరు ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా
ఇతర పేర్లుమహబూబ్ ఖాన్
వృత్తిపాత్రికేయుడు
రచయిత
మతంఇస్లాం
తండ్రిఫరీద్ ఖాన్
తల్లిసకీనాబీబీ

రచనలు మార్చు

  1. చరలో సెలయేరు (1968)
  2. విప్లవం(1969)
  3. పైగంబర్ కవులు(1971)
  4. సూరీడు (1971)
  5. లెనిన్... లెనిన్ (1984)
  6. రెక్కలు (2004)
  7. ధమ్మపదం (2013)

మూలాలు మార్చు

  1. అక్షరశిల్పులు - సయ్యద్ నశీర్ అహ్మద్