రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు
రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 నుండి 2019 వరకు రాష్ట్ర గనులు, జియాలజీ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
సుజయ్ కృష్ణ రంగారావు | |||
మాజీ గనులు, జియాలజీ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 - 2019 | |||
నియోజకవర్గం | బొబ్బిలి నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 14 సెప్టెంబర్ 1970 మద్రాస్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | ఆర్‌విజికె రంగారావు, మంగతాయారు | ||
నివాసం | బొబ్బిలి |
జననం, విద్యాభాస్యం
మార్చుసుజయ్ కృష్ణ రంగారావు 14 సెప్టెంబర్ 1970లో మద్రాస్ లో ఆర్‌విజికె రంగారావు, మంగతాయారు ఆర్‌విజికె రంగారావు, మంగతాయారు దంపతులకు జన్మించాడు. ఆయన బిఎ వరకు చదువుకున్నాడు.[2][3]
రాజకీయ జీవితం
మార్చుసుజయ్ కృష్ణ రంగారావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో రెండోసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర విభజన అనంతరం 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,[4] పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా పని చేసి, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[5]
సుజయ్ కృష్ణ రంగారావు ఏప్రిల్ 2016లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఏప్రిల్ 2న గనులు, జియాలజీ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చేతిలో ఓడిపోయాడు.
సుజయ్ కృష్ణ 2024 నవంబర్ 9న ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[7]
మూలాలు
మార్చు- ↑ Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Suryaa (3 April 2017). "ఏపీ మంత్రివర్గంలో కొత్త వారి వ్యక్తిగత వివరాలు". Archived from the original on 2017-04-05. Retrieved 10 December 2021.
- ↑ Andrabhoomi (3 April 2017). "కొత్త మంత్రుల పుట్టుపూర్వోత్తరాలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ The Hindu (30 May 2012). "Bobbili MLA shifts loyalty to Jagan, quits Congress" (in Indian English). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Asianet News (2 April 2017). "ఇవీ ఆంధ్రా కొత్త మంత్రుల శాఖలు". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
- ↑ Eenadu (10 November 2024). "ఏపీలో పదవుల పండగ". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.