సుధాకర్ విఠల్‌రావు కోహలే (జననం 1 జూలై 1969) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సుధాకర్ కోహలే

పదవీ కాలం
2014 – 2019
ముందు దీనానాథ్ పడోలె
తరువాత మోహన్ మేట్
నియోజకవర్గం నాగపూర్ దక్షిణ

వ్యక్తిగత వివరాలు

జననం (1969-07-01) 1969 జూలై 1 (వయసు 55)
నాగ్‌పూర్, మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి వైశాలి కోహలే
సంతానం వేదాంత్, ఓజస్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

సుధాకర్ కోహలే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా, నాగ్‌పూర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, నాగ్‌పూర్ మహానగర్ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ చతుర్వేదిపై 43,214 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

సుధాకర్ కోహలే ఆ తరువాత 2019 ఎన్నికలలో టికెట్ దక్కలేదు,[2] 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రే చేతిలో ఓడిపోయాడు.[3]

మూలాలు

మార్చు
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. The Times of India (22 September 2019). "Maharashtra assembly elections: BJP may deny ticket to some sitting MLAs in Nagpur". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.
  3. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Nagpur West". Archived from the original on 7 December 2024. Retrieved 7 December 2024.