సుధా చంద్రన్

భారతదేశ నటి - నృత్య కళాకారిణి, హిందీ చిత్రాల్లో ప్రముఖంగా నటించింది. దివ్యాంగురాలైనా పట్టుదలతో జైపుర్ ఫుట్ వాడి నృత్యం చేసింది.

సుధా చంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడు లోని "త్రిచీ" వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్యకారిణి. ఈవిడ తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టెలివిజన్ ధారావాహికలలో నటించారు.

సుధా చంద్రన్
Sudha chandran rabindranath tagore 150th birth aniversary celebration.jpg
రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి ఉత్సవాలలో సుధా చంద్రన్
జననం (1964-09-21) 1964 సెప్టెంబరు 21 (వయస్సు: 56  సంవత్సరాలు)
India
వృత్తినటి, నృత్యకళాకారిణి
క్రియాశీలక సంవత్సరాలు1984–ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామిరవి దంగ్
తల్లిదండ్రులుచంద్రన్

జీవిత విశేషాలుసవరించు

సుధా చంద్రన్ సెప్టెంబర్ 21 1964కేరళ లోని కన్నూర్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.[1] ఆమె ముంబైలో గల మిథీబాయి కళాశాల నుండి బి.ఎ డిగ్రీని ఆ తర్వాత ఎం.ఎ డిగ్రీని పొందారు. జూన్ 5 1981 న ఆమె ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడింది. వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు. రెండు వారముల తర్వాత ఆమె మద్రాసు వచ్చి అచ్చటి వైద్యులను సంప్రదించగా వారు ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించుటే సరియైన మార్గం అని చెప్పారు. ఆమెకు ఒక కాలిని తొలగించారు. ఆమె జైపూర్ లో వైద్యులు 'జైపూర్ కాలు' ను కృత్రిమంగా అమర్చారు.ఆ తర్వాత ఆమె ఆత్మ సడలని విశ్వాసంతో కృషిచేసి ఆ కృత్రిమ కాలితోనే నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచారు.[2] ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల నుండి ఆహ్వానాలు లభించాయి. ఆమెకు అనేక అవార్డులు లభించాయి. ఆమె భారతదేశంతోపాటు ఐరోపా, కెనడా అంరియు మధ్య తూర్పు దేశాలలో అనేక ప్రదర్శనలిచ్చారు. ఆ తర్వాతి కాలంలో ఆమె సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ప్రవేశించారు. ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాతే ఈ గుర్తింపులన్నీ లభించాయి. ఆమె అనేక మందికి స్ఫూర్తిప్రదతగా నిలిచారు.[3]

కెరీర్సవరించు

ఆమె 1984 లో తెలుగులో మయూరి సినిమాలో ఆమె జీవిత చరిత్రకు ప్రభావితురాలైన నృత్యకారిణిగా నటించారు. 1986 లో ఆమె హిందీలో "నాచే మయూరి"లో నటించారు.

కుటుంబంసవరించు

ఆమె 1986 లో రవి డాంగ్ ను వివాహమాడారు. ఆమెకు పిల్లలు లేరు.[3]

టెలివిజన్సవరించు

కార్యక్రమం పాత్ర ఛానెల్
కైసా యహ్ ఇష్క్ హై...అజాబ్ స రిస్క్ హై లోహరి లైఫ్ ఒ.కె
సౌంద్రవల్లి - జయ టి.వి
అంతరాల్ - దూరదర్శన్ నేషనల్
ఆరసి మధురై తిలకవతి సన్ టి.వి.
బహురైయన్ - డి.డి.మెట్రో
చంద్రకాంత (సీరియల్) - డి.డి.నేషనల్
ఛష్మే బాదూర్ (సీరియల్) - జీ.టీ.వి.
హమారీ బహు తులసి తులసి డి.డి.నేషనల్
హం పాంచ్ (సీజన్ 2) ఆనంద్ యొక్క మొదటి భార్య జీ.టీ.వి.
జానె భీ దో పారో - డి.డి.మెట్రో
కె.స్ట్రీట్ పాలి హిల్ గాయత్రి కౌల్ స్టార్ ప్లస్
కహిన్ కిసీ రోజ్ రమోలా సికంద్ స్టార్ ప్లస్
కైసే కహూఁ - జీ.టీ.వి
కలశం చంద్రమతి సన్ టీ.వి
కస్తూరి (సీరియల్) మాసి స్టార్ ప్లస్
కుఛ్ ఇస్ తార మల్లికా నందా సోనీ టీ వి
క్యా దిల్ మె హై రాజేశ్వరి దేవి 9 ఎక్స్‌
క్యుంకి సాస్ భి కభీ బహు థీ ఎ.సి.పి స్టార్ ప్లస్
సాథ్ సాథ్ (సీరియల్) - డి.డి.మెట్రో
సోల్‌హాహ్ సింగార్ రాజేశ్వరి దేవి సహారా వన్
తుంహై దిష దిషా యొక్క తల్లి జీ.టి.వి
కష్మకష్ జిందగీకీ రాజ్ లక్ష్మీ డి.డి.నేషనల్
కథాపరయుం కవ్యాంజలి రాజ్ లక్ష్మీ సూర్యా టి.వి
సౌందరవల్లి అఖిలాండేశ్వరి జయ టి.వి
జయం పద్మ జయ టి.వి
పొండట్తి తెవై రాజలక్ష్మి సన్ టి.వి
సూపర్ డాన్సర్ జూనియర్ 4 ఆమె అమృతా టి.వి
తకప్పు కలై తీరథ అప్పా సన్ టి.వి
తంకా తిమి థా ఆమె జయ టి.వి
తెండ్రాల్ భువన సన్ టి.వి
జిల్మిల్ సితారో కా అంగాన్ హోగా కళ్యాణి దేవీ రాయిచంద్ సహారా ఒన్
అదాలత్ ఇంద్రాణి సోనీ ఎంటర్‌టైన్ మెంటు టెలివిజన్ ఇండియా
దిల్ సె ది దూఆ... సౌభాగ్యవతి భవా? మిసెస్ వ్యాస్ లైఫ్ ఒకె
జల్లోష్ సువర్ణయుగచ జడ్జి ఈ.టి.వి. మరాఠీ
ఏక్ థీ నాయ్కా ఉమా బిశ్వాస్ లైఫ్ ఓ.కె
ఆర్ధ్రం రిటైర్డ్ జడ్జ్ ఆసియా నెట్
దైవం తందా వీడు చిత్రా దేవి స్టార్ విజయ్
నాగిని టి.వి సిరియల్ జెమినీ టి‌‌వి

నటించిన చిత్రాలుసవరించు

Year Film Role Language Notes
2013 Ameerin Aadhi Bhagavan Indra Sundaramurthy Tamil
2013 Cleopatra Malayalam
2011 Venghai Thamanna's Mother Tamil
2009 Alexander The Great Malayalam
2008 Sathyam Sathyam's mother Tamil
2006 Shaadi Karke Phas Gaya Yaar Doctor Hindi
2006 Malamaal Weekly Thakurain Hindi
2000 Tune Mera Dil Le Liyaa Rani (Veeru's girlfriend) Hindi
1999 Hum Aapke Dil Mein Rehte Hain Manju Hindi
1995 Milan Jaya
1995 Raghuveer Aarti Verma
1994 Anjaam Shivani's sister Hindi
1994 Daldu Chorayu Dhire Dhire
1994 Baali Umar Ko Salaam
1993 Phoolan Hasina Ramkali
1992 Nishchaiy Julie Hindi
1992 aka Nishchay India: Hindi title: video box title
1992 Inteha Pyar Ki Dancer at Tania's wedding Hindi
1992 Qaid Mein Hai Bulbul Julie
1992 Shola Aur Shabnam Karan's Sister Hindi
1992 Insaaf Ki Devi Sita S. Prakash Hindi
1991 Kurbaan Prithvi's sister Hindi
1991 Jaan Pechaan Hema
1991 Jeene Ki Sazaa Sheetal
1990 Thanedaar Mrs. Jagdish Chandra Hindi
1990 Pati Parmeshwar Hindi
1988 Olavina Aasare Kannada
1987 Kalam Mari Katha Mari Arifa Malayalam
1986 Malarum Kiliyum Malayalam
1984 Mayuri (film) Telugu
1986 Sarvam Sakthimayam Sivakami Tamil
1986 Naache Mayuri Mayuri Hindi
1987 Chinna Puve Mella Pesu Shanthi Telugu
1987 Chinna Thambi Periya Thambi Tamil

అవార్డులుసవరించు

మూలాలుసవరించు

  1. Never-say-die attitude: BACK ON THE BIG SCREEN - Sudha Chandran 'The Hindu'
  2. http://articles.timesofindia.indiatimes.com/2011-12-09/tv/30491022_1_film-industry-hema-malini-roles
  3. 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-24. Retrieved 2014-09-29.

బయటి లంకెలుసవరించు